Sun, February 07, 2016

Type in English and Give Space to Convert to Telugu

'కడలి వేదికగా కదన విన్యాసం''కల్తీల నుంచి కాపాడాలి''ఎస్సై కొలువులకు సై''వాట్సన్‌ @ రూ. 9.5 కోట్లు''హామీలు నెరవేర్చే వరకు దీక్ష''అన్నయ్యే వారసుడు..''ప్రజల మనసులు చూరగొంటూ..''సాగర జలాల్లో స్నేహబంధం''కాగిత రహిత టికెట్ల దిశగా రైల్వే''అనుమతి లేకుండా ప్రాజెక్టులు'
Alaya Pradhana Pujalu
ప్రధాన పూజలు
స్వామివారికి నిత్య పూజలివి

కోరిన కోర్కెలు తీర్చే భక్త వరదుడు అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి. ‘అన్న’ వరాలు ఇచ్చే స్వామిగా, భక్తుల కొంగు బంగారంగా తూర్పుగోదావరి జిల్లా అన్నవరం
సత్యనారాయణస్వామి దేవస్థానం ప్రసిద్ధి కెక్కింది.

స్వామివారి దర్శన వేళలు
ఉదయం 6 గంటల నుం* రాత్రి 9 గంటల వరకు సర్వదర్శనాలు ఉంటాయి. ఈ సమయంలో భక్తులు స్వామిని దర్శించుకోవచ్చు.
దర్శన టికెట్ల సమాచారం: అంతా ఉ*తంగా దర్శించుకోవచ్చు.
దర్శన సమయంలో విరామ వివరాలు: మహా నివేదనకు రోజూ మధ్యాహ్నం 12.30 గంటల నుం* 30 నిమిషాల పాటు దర్శనాలు నిలిపివేస్తారు.

ప్రత్యేక పూజలు, టికెట్ల వివరాలు
* ఉదయం 6 గంటల నుం* సాయంత్రం 6 గంటల వరకు సత్యనారాయణస్వామి వ్రతాలు నిర్వహిస్తారు.
* సాధారణ వ్రతం రూ.150, ప్రత్యేక వ్రతం రూ. 300, ధ్వజస్తంభం వద్ద రూ.700, విశిష్ట వ్రతం రూ.1,500.
* కొబ్బరి కాయలు, అరటిపళ్లు తీసుకువస్తే సరిపోతుంది. మిగిలిన పూజా సామగ్రి ప్రసాదం, స్వామివారి రూపు, పసుపు, కుంకుమ, తమలపాకులు, ప్రతి తదితర పూజా సామగ్రి
దేవస్థానమే సమకూర్చుతుంది. వ్రతానికి భర్త, భార్య పిల్లలను అనుమతిస్తారు.

ఉపాలయాలు, నిర్వహించే పూజలు: కొండదిగువున ఘాట్‌రోడ్డు ప్రారంభంలో గ్రామ దేవత శ్రీ నేరేళ్లమ్మ తల్లి ఆలయం, తొలిమెట్టు వద్ద శ్రీకనకదర్గ అమ్మవారి ఆలయం, కొండపైకి వచ్చే
మెట్ల మార్గం మధ్యలో వనదుర్గ అమ్మవారి ఆలయం, రత్నగిరి కొండపై క్షేత్రపాలకులు సీతారామచంద్రుని ఆలయం ఉన్నాయి.

ఆర్జిత సేవలు, ప్రధాన పూజలు
ఆలయంలో పూజలు నిర్వహించే సమయాలు
* ఆలయంలో నిత్యం తెల్లవారుజామున 4 గంటలకు సుప్రభాత సేవ
* 5 గంటలకు ధూపసేవ
* ఉదయం 7 గంటలకు బాల భోగం
* 7.30 గంటలకు బలిహరణ
* ఉదయం 8 గంటల నుం* 11 వరకూ చతుర్వేద పారాయణలు
* మధ్యాహ్నం 12 గంటలకు మహానివేదన
* సాయంత్రం 6 గంటలకు ధూపసేవ
* రాత్రి 7 గంటల నుం* 8 గంటల వరకూ దర్బారు సేవ
* రాత్రి 8.30 నుం* 9 గంటల వరకూ ఏకాంత సేవ

పూజల్లో పాల్గొనేందుకు టికెట్లు, వాటి ధరల సమాచారం
* పౌర్ణమికి రూ.558 టికెట్‌తో ప్రత్యంగిర హోమంలో పాల్గొనవచ్చు.
* స్వామి, అమ్మవార్ల దర్శనం అనంతరం ఘనాపాఠీల ఆశీర్వచనానికి రుసుం రూ.558
* పవళింపు సేవ వీక్షించేందుకు రుసుం రూ.50
* స్వామివారి శాశ్వత కల్యాణం (పదేళ్లకు మాత్రమే) ఏటా భక్తుల కోరిన రోజున రూ.10 వేలు
* శ్రీస్వామివారి వ్రతము (పదేళ్లకు) ఏటా భక్తులు కోరిన రోజున రూ. 7 వేలు
* స్వామివారి శాశ్వత నిత్యపూజ (పదేళ్లకు) ఏటా భక్తులు కోరిన రోజున రూ.500

ఆలయంలో దేవతామూర్తులకు నిర్వహించే ఇతర సేవలు: ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుం* 11.30 వరకూ శ్రీస్వామివారి నిత్యకల్యాణం జరుగుతుంది. దీనికి భక్తులు ఎటువంటి
పూజాసామగ్రి తెచ్చుకోనవసరం లేదు. రూ.1,000 టికెట్‌ తీసుకోవాలి. కల్యాణం చేయించే వారికి కండువా, జాకెట్టు ముక్క, ప్రసాదం, బంగీప్రసాదం అందజేస్తారు.

* శ్రీ స్వామివారి మూలవరులకు అభిషేకం (ప్రతి నెలా మఖనక్షత్రం రోజున) రూ.3,000 టికెట్‌పై అనుమతిస్తారు.
* రత్నగిరిపై సప్త గోపూజ నిత్యం జరుగుతుంది. రూ.116 రుసుం చెల్లించాలి.
* శ్రీసత్యనారాయణస్వామివారి మూలవరులకు స్వర్ణ పుష్పార్చన. 108 బంగారు పుష్పాలతో పూజచేసి ప్రసాదం అందిస్తారు. దీనికి రుసుం రూ.3 వేలు
* ఉపాలయాల్లో నిర్వహించే పూజలు: ప్రతి శుక్రవారం రత్నగిరిపై ఉన్న వనదుర్గ అమ్మవారి ఆలయంలో చండీ హోమం జరుగుతుంది. దీని రుసుం రూ.558
* ప్రత్యేక రోజుల్లో విశిష్ట పూజలు: చైత్రశుద్ధ పాడ్యమి పంచాంగ శ్రవణం, చైత్రశుద్ధ అష్టమి నుం* బహుళ పాడ్యమి వరకూ శ్రీరామనవమి కల్యాణ ఉత్సవాలు
* చైత్ర బహుళ షష్టి నుం* అమావాస్య వరకూ కనకదుర్గ అమ్మవారి బ్రహ్మోత్సవాలు
* వైశాఖ శుద్ధ దశమి లగాయితు బహుళ పాడ్యమి వరకూ శ్రీ సత్యదేవుని బ్రహ్మోత్సవాలు
* శ్రీ నేరెళ్లమ్మ ఉత్సవాలు, శ్రీస్వామివారి జయంతి వేడుకలు, శ్రీ కృష్ణ జయంతి, వినాయకచవితి నవరాత్రులు, శ్రీదేవి నవరాత్రులు, కార్తీక మాసంలో ప్రతి సోమవారం శ్రీస్వామివారికి లక్ష
పత్రిపూజ, *వరి సోమవారం అమ్మవారికి లక్ష కుంకుమపూజ, గిరి ప్రదక్షిణ, జ్వాలా తోరణం వంటి అనేక కార్యక్రమాలు ఏటా జరుగుతూ ఉంటాయి.

ఆన్‌లైన్‌ సేవలు :దేవస్థానంలో వసతిగదులు, వ్రత, కల్యాణ టికెట్లను ఆన్‌లైన్‌ ద్వారా బుక్‌చేసుకోవచ్చు. వసతి గదులకు మాత్రం సాధారణ ధరకన్నా 50 శాతం ఎక్కువగా ఉంటుంది.
మీసేవా కేంద్రాల్లో బుకింగ్‌ చేసుకునే అవకాశం ప్రస్తుతానికి ఉంది. దీనికి సంబంధిం* వివరాలు ‌్ర్ర్ర.్చ్థ్థ్చఙ్చr్చ్ఝ్ట్ఠఙ్చ్బ్మ్త్చ్థ్చ్ఝ.్థ్ౖఞ.్ౖథ ద్వారా తెలుసుకోవచ్చు. వివరాల కోసం
08868-238163 నెంబర్లో సంప్రదించవచ్చు. 

  ఆన్నవరం
 ఆన్నవరం స్థల పురాణం
 ఆన్నవరం దర్శన వేళలు

Top previous page
 
  దర్శనసమయాలు
 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net