Thu, February 11, 2016

Type in English and Give Space to Convert to Telugu

'హైదరాబాద్‌కు యాపిల్‌''కారెక్కిన ఎర్రబెల్లి''మేయర్‌ బొంతు రామ్మోహన్‌!''హనుమంతప్ప పరిస్థితి మరింత విషమం''భాగ్యనగరం తరహాలో ఖేడ్‌ అభివృద్ధి''మహా జాతరకు శ్రీకారం''ఓటుకు నోటు కేసులో మరో తెదేపా ఎమ్మెల్యే అరెస్టు?''ప్రయాణికులపై మళ్లీ వడ్డింపు?''గవర్నర్లు రాష్ట్రాలకు ఉత్ప్రేరకాలు''మహానగర అభివృద్ధికి 100 రోజుల ప్రణాళిక!'
సింహాచలం
ప్రధాన పూజలు

1. స్వామి నిత్యకల్యాణం - టిక్కెట్టు ధర 1000 రూపాయలు, ప్రతి రోజు జరిగే ఈ సేవలో పాల్గొన్నవారికి పట్టు శేష వస్త్రం, చీర, రవిక, 80 గ్రాముల బరువు గల 6 లడ్డూలు, 2 పులిహోర ప్యాకెట్లు, 6 గురికి ఉచిత దర్శనం, అన్నదానంలో ఉచిత భోజనం సౌకర్యాలను కల్పిస్తారు.

2. స్వర్ణ పుష్పార్చన - టిక్కెట్టు ధర 1116 రూపాయలు, ప్రతి గురువారం ఉదయం 7గంటల నుంచి గంటపాటు జరుగుతుంది. పాల్గొన్న వారికి కండువా, రవిక, రెండు లడ్డూలు, రెండు పులిహోర ప్యాకెట్లు ఉచితంగా అందచేస్తారు.

ఇతర సేవల టిక్కెట్ల ధరలు
సహస్రనామార్చన - 200 రూపాయలు
అష్టోత్తర శతనామార్చన - 100 రూపాయలు
లక్ష్మీ అష్టోత్తర శతనామార్చన - 50 రూపాయలు
గరుడ సేవ - 300 రూపాయలు
కప్పస్తంభం ఆలింగనం - 25 రూపాయలు
లక్ష్మీనారాయణ వ్రతం - 50 రూపాయలు
గోపూజ - 50 రూపాయలు
గోసంరక్షణ పథకం విరాళం - 1116 రూపాయలు
పశువుకట్టు - 15 రూపాయలు
అన్నప్రాశన, అక్షరాభ్యాసం - 50 రూపాయలు
ద్విచక్రవాహన పూజ - 100 రూపాయలు
కారు పూజ - 200 రూపాయలు
కేశఖండన - 10 రూపాయలు
టిక్కెట్లు దొరికే స్థలాలు

* పూజా టిక్కెట్లు ఆలయంలో కప్ప స్తంభం వద్ద లభిస్తాయి.
* దర్శనం టిక్కెట్టు 100 రూపాయలు గాలిగోపురం వద్ద ప్రత్యేక కౌంటరులో దొరుకుతాయి.
* 20 రూపాయల టిక్కెట్లు క్యూలైన్ల మధ్యలో ఇస్తారు.
* వృద్ధులు, వికలాంగులకు గాలిగోపురం పక్కన లిఫ్టు సౌకర్యం ఉంది.
* కొండపైకి దర్శనం వేళల్లో కొండ దిగువ నుంచి దేవస్థానం 4 బస్సులు, ఆర్టీసీ 18 బస్సులు నడుపుతున్నాయి.

ప్రసాదాల ధరలు
* లడ్డు 80 గ్రాములు - 5 రూపాయలు
* పులిహోర - 5రూపాయలు
* చక్కెర పొంగలి - 3రూపాయలు
* రవ్వ లడ్డు - 2రూపాయలు


  సింహాచలం

 సింహాచలం స్థల పురాణం
 సింహాచలం దర్శన వేళలు
Top previous page
 
  దర్శనసమయాలు
 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net