Sun, February 07, 2016

Type in English and Give Space to Convert to Telugu

'కడలి వేదికగా కదన విన్యాసం''కల్తీల నుంచి కాపాడాలి''ఎస్సై కొలువులకు సై''వాట్సన్‌ @ రూ. 9.5 కోట్లు''హామీలు నెరవేర్చే వరకు దీక్ష''అన్నయ్యే వారసుడు..''ప్రజల మనసులు చూరగొంటూ..''సాగర జలాల్లో స్నేహబంధం''కాగిత రహిత టికెట్ల దిశగా రైల్వే''అనుమతి లేకుండా ప్రాజెక్టులు'
‘రాజధాని’ రిజిస్ట్రేషన్లపై ఆరా
ఆ ప్రాంతంలో భూముల క్రయ, విక్రయాలపై ప్రభుత్వం నిఘా
వివరాలు పంపాలని ఆదేశం
స్థిరాస్తి వ్యాపారానికి ముకుతాడు
ఈనాడు - గుంటూరు
ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నిర్మాణం జరగనున్న గుంటూరు జిల్లాలోని తుళ్లూరు, మంగళగిరి మండలాల ప్రస్తుతం జరుగుతున్న భూముల రిజిస్ట్రేషన్‌ తీరుపై ప్రభుత్వం ఆరా తీస్తోంది. రాజధాని నిర్మాణానికి 30 వేల ఎకరాలు భూమి అవసరం కానుందని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు రైతుల నుంచి భూమి సమీకరించటానికి చర్యలు తీసుకుంటోంది. ఇదే అదనుగా కొందరు స్థిరాస్తి వ్యాపారులు, బడా పారిశ్రామికవేత్తలు, రాజకీయ ప్రముఖులు ఇక్కడ భూములపై కన్నేసి వాటిని చేజిక్కించుకోవాలని చూస్తున్నట్లు నిఘా వర్గాల ద్వారా సమాచారం అందింది. ప్రజోపయోగ కార్యక్రమాలకు రైతులను ఒప్పించి ప్రభుత్వం భూములను తీసుకుంటున్న నేపథ్యంలో కొందరు స్వార్థంతో ఈ భూములను స్థిరాస్తి వ్యాపారానికి ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తుండడంపై దృష్టి సారించింది. అలాంటి వారిపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. అసలు కొనుగోలుదారులు ఎవరు? వారు ఆ భూములను ఏ అవసరాలకు తీసుకుంటున్నారో ఆయా వర్గాల నుంచి వివరాలను రాబట్టే పనిలో ఉందని ఓ అధికారి ‘ఈనాడు’కు తెలియజేశారు. శాఖాధిపతుల కార్యాలయాలను ఏర్పాటు చేయటానికి శనివారం భవనాల పరిశీలనకు వచ్చిన ఉన్నత స్థాయి కమిటీ కూడా ఇక్కడ జరుగుతున్న రిజిస్ట్రేషన్లపై ఆ ప్రాంత సబ్‌రిజిస్ట్రార్లను పిలిచి మాట్లాడింది. రాజధాని ప్రాంతంలో స్థలాలు కొనుగోలు చేయాలని చాలామంది భావిస్తారు. ఇంటి జాగాకో.. లేక వ్యాపార నిర్వహణకు సరిపడా స్థలాలు తీసుకోవటంలో తప్పులేదు. అలా కాకుండా కేవలం స్థిరాస్తి వ్యాపారానికి ఎకరాలకు ఎకరాలు భూములు కొనుగోలు చేస్తే ఆ వివరాలను తక్షణమే ప్రభుత్వానికి తెలియపరచాలని ఉన్నత స్థాయి కమిటీ సభ్యుడు, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఒకరు జిల్లా ఉన్నతాధికారిని ఆదేశించారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న జిల్లా ఉన్నతాధికారి ప్రస్తుతం మంగళగిరి, తాడికొండ, అమరావతి, పెదకాకాని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలో ఇటీవల పెద్దమొత్తంగా జరిగిన రిజిస్ట్రేషన్ల వివరాలను రెండు రోజుల్లో ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిసింది. సాధ్యమైనంత వరకు ఎకరా, రెండు ఎకరాల వంతున కొనుగోలు చేస్తున్నారని ఐదారు ఎకరాలు ఒకే లావాదేవీగా కొన్న దాఖలాలు లేవని రిజిస్ట్రేషన్‌ అధికారి ఒకరు ‘ఈనాడు’కు తెలిపారు. ఈ భూముల్లో సాధ్యమైనంత వరకు రియల్‌ వ్యాపారానికి ముకుతాడు వేయటానికే రిజిస్ట్రేషన్ల వివరాలు తెలుసుకుంటోందని ఆ అధికారి వివరించారు. ఈ కార్యాలయాల పరిధిలో నిత్యం 70-80 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌ అవుతున్నాయి. రాత్రి పది గంటల వరకు రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో కార్యకలాపాలు జరుగుతూనే ఉన్నాయి. రిజిస్ట్రేషన్లు నిలుపుదల చేయాలని తమకు ప్రభుత్వ ఆదేశాలు, ఉత్తర్వులు ఏమీ లేవని సంబంధిత అధికార వర్గాలు వెల్లడించాయి.

వెలుగు వైపు నా అడుగులు...

బడిగంట కొట్టగానే పిల్లలందరూ బిలబిలమంటూ బయటకు పరుగుతీశారు. టీచర్లూ ఇంటిదారిపట్టారు. ఒకరిద్దరు తప్ప నిర్మానుష్యంగా మారిన ఆ బడిలో..

మరోసారి నీరజ్‌పాండే దర్శకత్వంలో అక్షయ్‌కుమార్‌

బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఇటీవల విడుదలై రూ.100 కోట్ల కలెక్షన్లతో భారీ........

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net