Fri, February 12, 2016

Type in English and Give Space to Convert to Telugu

'వైజ్ఞానిక మైలురాయి''విశ్రమించిన వీరుడు''మేయర్‌ ఎన్నిక ఏకగ్రీవం''కారెక్కిన మరో తెదేపా ఎమ్మెల్యే''‘బేర్‌’మన్న స్టాక్‌ మార్కెట్లు''‘ఆధార్‌’ ఇక తప్పనిసరి కాదు''కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయం''ఎంపీల జీతభత్యాలు త్వరలో రెట్టింపు!''మార్చి మొదటి వారంలో ‘పుర’ ఎన్నికలు''మేడారం జాతరను జాతీయ పండుగగా ప్రకటించండి'
బండ భారంపై వీడని సందిగ్ధత
ఈనాడు, హైదరాబాద్‌: ఆధార్‌ కార్డుతో వంట గ్యాస్‌ సిలిండర్‌ అనుసంధానం ఉందా? లేదా? అనుసంధానాన్ని తొలగిస్తూ గత వారం కేంద్రం మంత్రివర్గ తీసుకున్న నిర్ణయం ఎప్పటి నుంచి అమలులోకి వస్తుంది? సబ్సిడీ సిలిండర్ల సంఖ్య పెంపుదల ఒక్కటే అమలులోకి వస్తుందా? ఆధార్‌కార్డుతో సంబంధం యథావిధిగా కొనసాగుతుందా? అన్న సందేహాలు వినియోగదారులకే కాదు, ఉన్నతాధికారులు, చమురు సంస్థల ప్రతినిధులు, డీలర్లను వేధిస్తున్నాయి.

ఆధార్‌ అనుసంధానం తొలగింపు, సబ్సిడీ సిలిండర్ల సంఖ్యను ఏడాదికి 12కు పెంచడంపై మంత్రివర్గ నిర్ణయం తీసుకున్నా.. విధి విధానాలు రాకపోవటంతో అయోమయం నెలకొంది. ఒకపక్క ఆధార్‌కార్డుతో ప్రమేయం లేదని మంత్రివర్గం నిర్ణయించినప్పటికీ చమురు సంస్థలు యథావిధిగా ఫిబ్రవరి నెల గ్యాస్‌ ధరలను ఖరారు చేశాయి. అందులో వినియోగదారలు ఎంత చెల్లించాలి.. ప్రభుత్వం చెల్లించే సబ్సిడీ ఎంత.. అన్నది స్పష్టం చేసింది. ఈ పరిణమాలతో కేంద్రం మంత్రి నిర్ణయం అమలుపై అనుమానాలు నెలకొన్నాయి. 

వెనక్కు తగ్గం: సబ్సిడీ సిలిండర్ల సంఖ్యను పెంచే విషయంలో కానీ ఆధార్‌కార్డు అనుసంధానం విషయంలో కానీ వెనుకంజ వేసే ప్రసక్తి లేదని కేంద్ర సహాయ మంత్రి పనబాక లక్ష్మీ స్పష్టంచేశారు. సబ్సిడీ విషయంలో నెలకొన్న అయోమయంపై సోమవారం ‘ఈనాడు’ ఆమె దృష్టికి తీసుకెళ్లింది. విధివిధానాల ఖరారుకు కొంత వ్యవధి అవసరమని ఆమె చెప్పారు. ‘‘మంత్రివర్గం నిర్ణయాల మినిట్స్‌ సిద్ధం కావటానికి కొంత సమయం పడుతుంది. మంత్రివర్గ నిర్ణయం తరువాత రెండు రోజులు సెలవులు కావటం కూడా ఒక కారణం. త్వరలో స్పష్టత వస్తుంది. వినియోగదారులను ఇబ్బంది పెట్టే యోచన కేంద్రానికి లేదు’’ అని తెలిపారు.

సమంత@100 కేజీలు

మొదటి సినిమాలో సన్నగా సన్నజాజి తీగలా కనిపించి..రెండో చిత్రానికి వచ్చేసరికి బొద్దుగుమ్మగా దర్శనమిచ్చారు ఎంతో మంది కథానాయికలు....

మణిరత్నం వీరాభిమానిని!

హను రాఘవపూడి... తీసింది ‘అందాల రాక్షసి’ ఒక్కటే. దాని చుట్టూ బోలెడు కామెంట్లు.. కాంప్లిమెంట్లు. ‘మణిరత్నం ప్రభావం కుర్రాడిపై చాలా ఎక్కువ ఉంది’ అనుకొన్నారు చాలామంది....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net