Thu, February 11, 2016

Type in English and Give Space to Convert to Telugu

'హైదరాబాద్‌కు యాపిల్‌''కారెక్కిన ఎర్రబెల్లి''మేయర్‌ బొంతు రామ్మోహన్‌!''హనుమంతప్ప పరిస్థితి మరింత విషమం''భాగ్యనగరం తరహాలో ఖేడ్‌ అభివృద్ధి''మహా జాతరకు శ్రీకారం''ఓటుకు నోటు కేసులో మరో తెదేపా ఎమ్మెల్యే అరెస్టు?''ప్రయాణికులపై మళ్లీ వడ్డింపు?''గవర్నర్లు రాష్ట్రాలకు ఉత్ప్రేరకాలు''మహానగర అభివృద్ధికి 100 రోజుల ప్రణాళిక!'
‘రాజధాని’ రాజకీయం!
రంగంలోకి ప్రతిపక్షాలు
స్థానిక రైతులతో చర్చలు
బాసటగా ఉంటామని ప్రకటనలు
ఆచితూచి స్పందిస్తున్న ప్రభుత్వం
భూసమీకరణపై రైతాంగంలో భయాలు
ఈనాడు, గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం భూ సమీకరణకు రంగం సిద్ధం చేసోంటే.. కొన్ని గ్రామాల రైతులు భూములు ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారు. సమావేశాలు పెడుతున్నారు. తోటి రైతులను సంఘటితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. విపక్ష పార్టీలు రంగంలోకి దిగుతున్నాయి. రైతులకు మద్దతు ఇస్తామని చెబుతున్నాయి. వివిధ రైతు, ప్రజా సంఘాల నుంచి వస్తున్న ప్రతినిధులు స్థానిక రైతుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. వారికి మద్దతుగా ప్రభుత్వంపై పోరాటం చేస్తామని చెబుతున్నారు. మరోపక్క తెదేపా నాయకులు, మద్దతుదారులు స్థానిక శాసన సభ్యునికి రాజధాని భూ సమీకరణ కమిటీలో చోటు కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. సున్నితమైన అంశం కావడంతో ఆచితూచి స్పందిస్తోంది. మొత్తం మీద రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం ఎంపిక చేసిన తుళ్ళూరు మండలంలో పరిస్థితి ప్రస్తుతం నివురుగప్పిన నిప్పులా ఉంది.

త్వరలోనే ప్రక్రియ మొదలు: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నిర్మాణానికి అవసరమైన భూ సమీకరణ ప్రక్రియను త్వరలోనే మొదలు పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకు అవసరమైన కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఆయా గ్రామాల వారీగా సమస్త సమాచారం ప్రభుత్వం వద్ద ఉంది. భూ సేకరణకు బదులు భూ సమీకరణ విధానంలో రాజధానికి అవసరమైన భూములు తీసుకుంటామని, రైతులను అభివృద్ధిలో భాగస్వాములను చేసి వారికి గరిష్ఠ ప్రయోజనం చేకూర్చుతామని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఈ ప్రాంతంలోని కొన్ని గ్రామాల రైతులు భూములు ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారు. రైతులను ఒప్పించి వారికి చేకూరే ప్రయోజనాల గురించి వివరించి భూములు తీసుకోవాలన్న యోచనలో ప్రభుత్వం ఉంది. అప్పటికీ రైతులు వినకపోతే ఏం చేయాలన్న విషయంలోనూ ప్రభుత్వం పలు విధాల ఆలోచనలు చేస్తున్నట్లు తెలిసింది. రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి వారిలో అవగాహన కల్పించాలని భావిస్తోంది.

సమావేశాలు.. చర్చలు: రాజధాని వ్యవహారం తెరమీదకు వచ్చాక తుళ్ళూరు మండలానికి రాజకీయ నాయకుల తాకిడి పెరిగింది. రైతులకు బాసటగా ఉంటామంటూ విపక్షాలు రంగంలోకి దిగుతున్నాయి. ఇప్పటికే జిల్లా కాంగ్రెస్‌, వైకాపా నాయకులు రైతులను కలిసి సంఘీభావం తెలిపారు. మరోపక్క వామపక్షాలు రంగంలోకి దిగుతున్నాయి. త్వరలో లోక్‌సత్తా బృందం కూడా అక్కడ పర్యటించనుంది. అటు విజయవాడ నుంచి కూడా బార్‌ అసోసియేషన్‌ నాయకులు వచ్చి రైతులతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రజా సంఘాల ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు కూడా వస్తున్నారు. ప్రభుత్వం మాత్రం ఆచితూచి స్పందిస్తోంది. ప్రభుత్వం కూడా ప్రతి గ్రామంలోనూ సమావేశాలు నిర్వహించి రైతులను ఒప్పించి భూ సమీకరణ ప్రక్రియను సామరస్యపూర్వకంగా పూర్తి చేయాలన్న యోచనలో ఉంది.

మా ఎమ్మెల్యేకి చోటు ఇవ్వండి: భూ సమీకరణ కమిటీలో స్థానిక శాసన సభ్యుడు తెనాలి శ్రావణ్‌ కుమార్‌కు చోటు కల్పించాలని తూళ్ళురు మండల తెదేపా నాయకులు కోరుతున్నారు. భూ సమీకరణకు అనుకూలంగా రైతుల మద్దతు కూడగట్టాలంటే ఇది అవసరమని చెబుతున్నారు.

ఆ భూములే కావాలి!
ఈనాడు, గుంటూరు: తుళ్ళూరు.. గుంటూరు జిల్లాలో కృష్ణాతీరం వెంబడి ఉండే ఈ మండలం గురించి నిన్న మొన్నటి వరకు తెలిసిన వాళ్లు చాలా తక్కువ. మరి ఇప్పుడో.. దారులన్నీ తుళ్ళూరు వైపే పయనిస్తున్నాయి. ఒకప్పుడు ఆర్టీసీ బస్సులు, ఒకటీ అరా సరుకు రవాణా వాహనాలు మాత్రమే తిరిగే ఈ ప్రాంత రహదారులపై ఇప్పుడు ఖరీదైన విలాసవంతమైన కార్లు పరుగులు తీస్తున్నాయి. ఇటు ఆంధ్రప్రదేశ్‌తో పాటు, అటు తెలంగాణ జిల్లాల నుంచి పెద్ద పెద్ద కార్లు వచ్చి ఇక్కడ చక్కర్లు కొడుతున్నాయి. వీళ్లంతా వస్తోంది... ఈ ప్రాంతంలో భూములు కొనడానికే. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి తుళ్ళూరును ఎంపిక చేయడంతో ఈ ప్రాంతం ఒక్కసారిగా అందరికీ అవసరమైన ప్రాంతంగా మారిపోయింది. రాజధాని కోసం తమ భూములు ఇచ్చేది లేదని కొన్ని గ్రామాల రైతులు తెగేసి చెబుతుండగా..స్థిరాస్తి వ్యాపారులు, పెట్టుబడిదారులు రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం భూసమీకరణ జరపనున్న గ్రామాల్లోనే భూములు కావాలంటూ తిరుగుతున్నారు. ఈ పరిణామం స్థానిక రైతులను కొంత గందరగోళానికి గురి చేస్తోంది. ఎకరానికి రూ.70-80 లక్షల ధర ఇస్తామని చెబుతున్నా తమ భూములు అమ్మాలో, వద్దో తేల్చుకోలేని స్థితిలో రైతులు ఉన్నారు. ఇప్పుడు వస్తున్న ధర చూసి చిన్న రైతులు కొందరు భూములు అమ్ముతుండగా, కాస్త స్థోమత ఉన్న వారు మాత్రం వేచి చూసే ధోరణిలో ఉన్నారు. రాజధాని కోసం భూ సమీకరణ జరపడం వల్ల వచ్చే గరిష్ఠ ప్రయోజనం రైతులకే దక్కేలా చేయడం ఎలా? అన్న అంశంపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. అభివృద్ధి చేసిన భూమిలో ప్రభుత్వం వెయ్యి గజాలు ఇస్తామని చెబుతుండడంతో గజానికి రూ.20 వేలు వేసుకున్నా రూ.2 కోట్లు వస్తుందన్న అంచనాల్లో స్థిరాస్తి వ్యాపారులున్నారు.

నీళ్ల సీసాలపై మీ పేర్లు!

‘మంచి వ్యాపారవేత్త కావాలంటే ఎంబీఏలే చదవాల్సిన అవసరంలేదు. సామాజిక చొరవ ఉంటే చాలు! చక్కటి ఆలోచనతో ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేకుండా ఈ ఏడాదిన్నరలో రెండు...

వెండితెరపై కోట్ల ‘కాంతి’

సినిమా అనేది కచ్చితంగా వ్యాపారమే. ఏ కథానాయకుడికి ఎంత మార్కెట్‌ ఉంది? అనే లెక్కలు ఎప్పుడూ అవసరమే. పెట్టిన ప్రతీపైసాకీ గ్యారెంటీ ఉందన్న నమ్మకం కుదిరిన...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net