Fri, February 12, 2016

Type in English and Give Space to Convert to Telugu

'వైజ్ఞానిక మైలురాయి''విశ్రమించిన వీరుడు''మేయర్‌ ఎన్నిక ఏకగ్రీవం''కారెక్కిన మరో తెదేపా ఎమ్మెల్యే''‘బేర్‌’మన్న స్టాక్‌ మార్కెట్లు''‘ఆధార్‌’ ఇక తప్పనిసరి కాదు''కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయం''ఎంపీల జీతభత్యాలు త్వరలో రెట్టింపు!''మార్చి మొదటి వారంలో ‘పుర’ ఎన్నికలు''మేడారం జాతరను జాతీయ పండుగగా ప్రకటించండి'
వైద్యుల కొరత.. నాసిరకం మందులు!
రూ.160 కోట్లు వెచ్చిస్తున్నా.. మెరుగైన వైద్యం శూన్యం
సింగరేణి వైద్యశాలల్లో రోగులకు తప్పని ఇక్కట్లు
కొత్తగూడెం (సింగరేణి), న్యూస్‌టుడే: సింగరేణి ఆసుపత్రుల్లో రూ.కోట్లు వెచ్చిస్తున్నా మెరుగైన వైద్యం రోగులకు అందని ద్రాక్షగానే మిగులుతోంది. సంస్థలో పనిచేసే కార్మికులు, వారి కుటుంబ సభ్యుల వైద్యం కోసం ఏటా రూ.160 కోట్లను ఖర్చు చేస్తోంది. ఇంత వెచ్చిస్తున్నా వైద్యుల కొరత, పర్యవేక్షణ లేమి, నాసిరకం మందులతో సింగరేణి వైద్యశాలల్లో సరైన వైద్యం అందడం లేదు. 62వేల మంది ఉద్యోగులున్న సంస్థలో ఉద్యోగుల కుటుంబ సభ్యులు, ఉద్యోగ విరమణ కార్మికులు, ఒప్పంద కార్మికులు కలిపి మొత్తం 3 లక్షల మంది సింగరేణి వైద్యశాలలపై ఆధారపడి ఉన్నారు. వైద్యుల కొరత, మందుల నాణ్యతపై సరైన నిర్ణయాధికారం లేని కారణంగా వైద్యం పూర్తి స్థాయిలో అందటం లేదు.

వేధిస్తున్న వైద్యుల కొరత..: వైద్యుల కొరత సింగరేణి ఆసుపత్రులను వేధిస్తోంది. పట్టణాల్లో నివాసాన్ని కోరుకొనే వైద్యులు మారుమూల గనులున్న ప్రాంతాల్లో పనిచేయడానికి ఇష్టపడకపోవడం, ప్రభుత్వ వైద్యశాలల్లో మాదిరిగా విధి నిర్వహణ అనంతరం సొంతంగా ప్రాక్టీస్‌ చేసుకునే అవకాశం లేకపోవటంతో ఇందులో చేరేందుకు విముఖత చూపుతున్నారు. దీంతో ఎన్నిసార్లు ప్రకటనలు ఇచ్చినా ఖాళీలు భర్తీ కాని పరిస్థితి నెలకొంటోంది. ప్రస్తుతం సింగరేణిలో 250 మంది వైద్యులు ఉన్నారు. మరో 80మంది సాధారణ వైద్యులు, 30 మంది వైద్య నిపుణుల అవసరం ఉంది. రామగుండం, బెల్లంపల్లి, భూపాలపల్లి, రామకృష్ణాపూర్‌ ప్రాంతాల్లో కార్మికులు అధికంగా ఉండటంతో అక్కడ వైద్యశాలలకు వచ్చే రోగుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటోంది. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు అధికంగా వైద్యశాలలకు వెళ్లే ప్రాంత ఆసుపత్రుల్లో వైద్యుల కొరత మరింత తీవ్రంగా ఉంది. సింగరేణి కార్మికులు, వారి కుటుంబాలకు మాత్రమే కాకుండా స్థానికంగా ఉన్న రోగులకు కూడా వైద్యం చేయాల్సిన వైద్యశాలలు సొంత ఇల్లు చక్కబెట్టుకోవటమే కష్టంగా ఉంది. ఖాళీలను భర్తీ చేసి, ఖర్చు చేస్తున్న ప్రతిపైసాకు న్యాయం జరిగేలా పూర్తి స్థాయిలో నాణ్యమైన వైద్యాన్ని అందించాల్సిన అవసరం ఉంది.

మందుల్లో నాణ్యత, పర్యవేక్షణ కరవు..: టెండరు పద్ధతిలో ఎల్‌1 (లోయెస్ట్‌ కొటేషన్‌) తరహా కొనుగోళ్ల కారణంగా సింగరేణి వైద్యశాలల్లో ఇచ్చే మందుల్లో నాణ్యత ఉండటం లేదని రోగులు ఆరోపిస్తున్నారు. నాణ్యతను పెంచేందుకు నిజాయతీ కలిగిన అధికారులతో ప్రత్యేకంగా కొనుగోళ్ల కమిటీని ఏర్పాటుచేసి, విపణిలో దొరుకుతున్న నాణ్యమైన మందులను కొనుగోలు చేయిస్తే పరిస్థితి మెరుగుపడే అవకాశాలున్నాయి. ఇటీవల వైద్యశాలలపై పర్యవేక్షణ లోపించటం కూడా పనితీరును కుంటుపరుస్తోంది. గతంలో మెడికల్‌ సూపరింటెండెంట్లతో రెండు నెలలకోసారి సమీక్షలను నిర్వహించడంతో పాటు ఎప్పటికప్పుడు సింగరేణి పరిధిలో వైద్యశాలలను తనిఖీ చేసేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. దీంతో ఆ వైద్యశాలల్లో పరిస్థితి ఇష్టారాజ్యంగా మారింది. ఉన్నతాధికారులు పట్టించుకొని సింగరేణి వైద్యాన్ని మెరుగుపర్చడంలో నిర్మాణాత్మక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. కొత్తగూడెం, రామగుండంలో ప్రభుత్వం నూతనంగా సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మించాలని నిర్ణయించిన నేపథ్యంలో సంస్థాగత లోపాలపై దృష్టి సారించాలని కార్మిక సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.

సమంత@100 కేజీలు

మొదటి సినిమాలో సన్నగా సన్నజాజి తీగలా కనిపించి..రెండో చిత్రానికి వచ్చేసరికి బొద్దుగుమ్మగా దర్శనమిచ్చారు ఎంతో మంది కథానాయికలు....

40ల నాటి సెట్స్‌లో ఫరా ఖాన్‌, విశాల్‌ భరద్వాజ్‌

ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు విశాల్‌ భరద్వాజ్‌ దర్శకత్వంలో కంగనా రనౌత్‌, షాహిద్‌ కపూర్‌, సైఫ్‌ అలీ ఖాన్‌లు ప్రధాన తారాగణంగా........

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net