Tue, February 09, 2016

Type in English and Give Space to Convert to Telugu

'ఔషధనగరిలో ప్రపంచశ్రేణి విశ్వవిద్యాలయం''భూసేకరణ, పునరావాసాలకేరూ. 8,000 కోట్లు''నెట్‌ సమానత్వానికే ట్రాయ్‌ మొగ్గు!''ముద్రగడ దీక్ష విరమణ''తెలంగాణ ప్రణాళిక భేష్‌''విద్వేషాలు రెచ్చగొడుతూ రాజకీయాలా?''డాక్టర్‌.. ధనాధన్‌..''రసాయన పరిశ్రమలో పేలుడు''నడి వీధిలో పైశాచికం''పాక్‌ నుంచే కుట్ర'
పేదరిక సంస్థే పెన్నిధి!
అవసరానికి మించి కీలక పదవులు
గుదిబండగా మారిన నిర్వహణ వ్యయం
పొదుపు చర్యల దిశగా సెర్ప్‌
సొంత నిధుల సమీకరణ దిశగా కసరత్తు
ఈనాడు - హైదరాబాద్‌
పేరుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌). ఆ కార్యాలయ నిర్వహణ మాత్రం ఖరీదైన వ్యవహారమే. అక్కడ కీలక ఉద్యోగాల్లో ఉండేవాళ్ల జీతభత్యాలు, వాహనాల నిర్వహణ... ఇత్యాదులు ఆ సంస్థకు గుదిబండగా మారాయి. తక్షణమే ఆ విధానాల్లో మార్పులు తీసుకురావాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ప్రపంచ బ్యాంకు నిధులతో ఈ సంస్థ మొదలైంది. ఆ నిధులు ఇకపై వచ్చే మార్గం లేదు. పొదుపు చర్యలు పాటించేందుకు సిద్ధంగా ఉన్నామని, అయితే ఈ ఆర్థిక సంవత్సరం వరకూ నిధులు అందించాల్సిందిగా సెర్ప్‌ కార్యనిర్వహణాధికారి ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి తమ సంస్థే స్వయంగా నిధులు సమకూర్చుకొనే కార్యక్రమాలు చేపడుతుందని స్పష్టం చేశారు.ఈ సంస్థ ద్వారానే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టే స్వయం సహాయక సంఘాలు నిర్వహణ జరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇసుక తవ్వకాలపాటు పలు ప్రభుత్వ కార్యక్రమాల్లో డ్వాక్రా సంఘ సభ్యురాళ్లను భాగస్వాముల్ని చేస్తున్నారు. ఈ దశలో సెర్ప్‌ను ప్రక్షాళించి స్వయంశక్తి సంస్థగా మార్చాల్సిన అవసరం ఏర్పడింది. సెర్ప్‌ అంతర్గతంగా తమ కార్యక్రమాలను సమీక్షించుకోవడంతోపాటు పొదుపు చర్యలు ఎలా చేపట్టాలో బెంగళూరుకు చెందిన క్యాటలిస్ట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థతో అధ్యయనం చేయించుకొంది. ఈ సంస్థ తన నివేదికలో సెర్ప్‌లో పెద్దస్థాయిల్లో అదనపు సిబ్బంది ఉన్నారని, వారి నిర్వహణ వ్యయం భారంగా మారిందనే వాస్తవాన్ని తేటతెల్లం చేసింది.

ఉద్యోగం.. విలాసవంతం
సెర్ప్‌లో పది మంది డైరెక్టర్లు ఉన్నారు. వీరిలో కొందరు ఇతర ప్రభుత్వ శాఖలు, విభాగాల నుంచి డిప్యుటేషన్‌ విధానంలో వచ్చారు. పదవీ విరమణ చేసినవాళ్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సలహాదారులుగా వచ్చారు. వీరికి భారీగానే జీతభత్యాలు అందుతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో అంశాన్ని చూస్తున్నారు. వీరికి డ్రైవర్లు, అటెండర్లతోపాటు ఇతర సిబ్బంది ఉంటున్నారు. విలాసవంతమైన ఉద్యోగానికి సెర్ప్‌ డైరెక్టర్‌ పదవి చిరునామా అని ప్రభుత్వ ఉద్యోగ వర్గాల్లో ప్రచారం కూడా ఉంది. అందుకే.. ఓ దశలో సెర్ప్‌ అవసరమా అనే ప్రశ్నను కొందరు ఉన్నతాధికారులు ప్రభుత్వం ముందు ఉంచారు. ప్రభుత్వ శాఖల్లో అప్రాధాన్య పోస్టుల్లో ఉన్నవాళ్లు సైతం ఇక్కడ డైరెక్టర్‌ పదవుల్లోకి డిప్యుటేషన్‌పై వచ్చారు. నిబంధనల ప్రకారం వారు అయిదేళ్లకు మించి ఈ పదవిలో కొనసాగే అవకాశంలేదు. అంతకు మించి పని చేయాలంటే ముఖ్యమంత్రి అనుమతి ఇవ్వాలి. అయితే సెర్ప్‌లోని ఓ డెరెక్టర్‌ ఏళ్ల తరబడి అదే పదవిలో కొనసాగుతున్నారు. ఇలా గుదిబండగా మారిన డైరక్టర్ల సంఖ్యను పది నుంచి నాలుగు కుదించాలని నిర్ణయించినట్లు సమాచారం.

సేవా రుసుముల వసూలుకు యోచన
సెర్ప్‌ ద్వారానే పింఛన్ల పంపిణీ, డ్వాక్రా సంఘాలకు రుణాలు అందించే లింకేజీ కార్యక్రమాలు, స్త్రీనిధి లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించినప్పుడు సేవా రుసుము తీసుకోవాలని, తద్వారా నిధులు సమకూర్చుకొనే వీలు కలుగుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే ఇసుక రీచ్‌ల నుంచి సేవా రుసుము పొందేందుకు ప్రణాళికలు రూపొందించుకొంది. ఒక్కో క్యూబిక్‌ మీటర్‌కు రూ.10 సేవా రుసుముగా పొందాలనుకొంటోంది.

పదుగురి కోసం ఆరుగురం!

కాలేజీ స్నేహితులకో వాట్స్‌యాప్‌ గ్రూప్‌ చిన్నప్పటి మిత్రులకో ఫేస్‌బుక్‌ గ్రూప్‌ బంధువులందరినీ కలిపేందుకు గూగుల్‌ ప్లస్‌.. ఇలా నేటి సామాజిక మాధ్యమాలని మస్తుగా వాడుకుంటోంది...

పచ్చబొట్టేసి...జోలీకి నచ్చేసి!

ఏంజెలీనా జోలీకి రెండంటే మహా ఇష్టం. ఒకటి పిల్లలు, రెండు టాటూలు. ముగ్గురు కన్నబిడ్డలతో పాటు మరో ముగ్గురు అనాథలను దత్తత తీసుకుని పెంచుకుంటోంది జోలీ...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net