Sat, February 13, 2016

Type in English and Give Space to Convert to Telugu

'ప్యాకేజీ ఇవ్వండి''విలీనమా.. అనర్హతా?''అదనపు పనులన్నీ పాత గుత్తేదారులకే''భారతమాతను కించపరిస్తే సహించం''‘తెలంగాణ బ్రాండ్‌’ పేరుతో అమ్మకాలు''శాశ్వత ఉత్సవంగా మేడారం జాతర''కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయం''విలీన లేఖపై ఏమి చేయాలి?''వీరసేనానికి కన్నీటి వీడ్కోలు''అమ్మతనానికి అండ'
పల్లెప్రగతి’తో నిరుపేదల అభ్యున్నతి
తెలంగాణలోని మూడో వంతు మండలాల్లో ప్రత్యేక పథకం
జనవరి నుంచి ప్రారంభం
రూ.1000 కోట్ల ప్రపంచబ్యాంకు రుణం
గిరిజనులు, బలహీనవర్గాల సమగ్ర అభివృద్ధికి కార్యక్రమాలు
ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని అత్యంత వెనకబడిన మండలాల్లో నిరుపేద కుటుంబాల సమగ్ర అభివృద్ధికి ‘తెలంగాణ పల్లెప్రగతి’ పథకం కింద రూ.1000 కోట్లు వెచ్చించనున్నారు. ప్రపంచ బ్యాంకు రుణంతో జనవరి నుంచి ఈ పథకం అమలు కానుంది. రాష్ట్రంలో మూడో వంతు మండలాలు అన్ని విధాలా వెనకబడిన నేపథ్యంలో ఈ పథకం ద్వారా నిరుపేద కుటుంబాల సర్వతోముఖాభివృద్ధికి బహముఖ వ్యూహాన్ని అనుసరించనున్నారు. ఆరోగ్యం, విద్య, కుటుంబాలకు నికర ఆదాయం, కులవృత్తులకు ప్రోత్సాహం, మెరుగైన జీవన వసతుల కల్పనకు తోడ్పాటు అందిస్తారు. పల్లెప్రగతి పథకం ద్వారా గిరిజన మండలాలకు ప్రత్యేక ప్రయోజనం కలగనుంది. సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాలను చేరుకునేలా కార్యక్రమాలను అమలు చేస్తారు. ప్రస్తుతం ఉన్న పౌష్టికాహార, శిశు సంరక్షణ కేంద్రాల (ఎన్‌డీసీసీ)ను మరింత పటిష్ఠం చేస్తారు. గిరిజన ప్రాంతాల్లో ఎన్‌డీసీసీలను పటిష్ఠం చేయడంతో పాటు అనేక సేవలను విస్తరిస్తారు. ప్రస్తుతం అమలు చేస్తున్న ఐసీడీఎస్‌, జాతీయ ఆరోగ్య మిషన్లను కలిపి క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు చేపడతారు. గతంలో ప్రభుత్వం చేపట్టిన మార్పు కార్యక్రమాన్ని దీనికి అనుసంధానం చేస్తారు. కార్యక్రమ అమలు, ఫలితాలను ప్రపంచ బ్యాంకు ఎప్పటికప్పుడు అంచనా వేస్తుంది. అవసరమైన చోట్ల సామాజిక సేవా సంస్థల సాయాన్ని తీసుకుంటారు. బాల్య వివాహాలు, భ్రూణ హత్యల నివారణకు ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయి.

సరైన రాబడి..
రాష్ట్రంలో గుర్తించిన 150 మండలాల్లో నిరుపేద కుటుంబాల ఉత్పాదనలు, పండించే పంటలకు తగినంత రాబడి వచ్చేలా కార్యక్రమాలు చేపడతారు. గిరిజనులు, దళితుల ప్రత్యేక ఉత్పాదనలకు నికరమైన రాబడి ఉండేలా చూడడంతో పాటు మార్కెటింగ్‌కు పూర్తిగా సహకరిస్తారు. హస్తకళలు, చేనేత వంటి రంగాలకు వూతమిచ్చి ఉత్పత్తులను పట్టణ మార్కెట్‌లో విక్రయించుకొని ఎక్కువ రాబడి పొందేలా చూస్తారు.

మా వూరికి మంచి నీళ్లు...

బాగా ఆస్తిపాస్తులున్న వాళ్లని శ్రీమంతులంటారు.మహేశ్‌బాబు నటించిన ‘శ్రీమంతుడు’ చూశాక ఆ అర్థం మారిపోయిందనే చెప్పవచ్చు. ఎక్కడ పెరిగినా, స్థిరపడినా సొంతూరి...

ప్రేమలు మెరిసే.. తారలు మురిసే!

ప్రేమ ఓ అనీర్వచనీయమైన అనుభూతి. ప్రేమలో పడితేనే దాని మాధుర్యం ఏంటో తెలిసేది. నిజ జీవితాల్లోనే కాదు వెండితెరపైనా ప్రేమ అద్భుతమైన విజయాలు అందించింది....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net