Tue, February 09, 2016

Type in English and Give Space to Convert to Telugu

'ఔషధనగరిలో ప్రపంచశ్రేణి విశ్వవిద్యాలయం''భూసేకరణ, పునరావాసాలకేరూ. 8,000 కోట్లు''నెట్‌ సమానత్వానికే ట్రాయ్‌ మొగ్గు!''ముద్రగడ దీక్ష విరమణ''తెలంగాణ ప్రణాళిక భేష్‌''విద్వేషాలు రెచ్చగొడుతూ రాజకీయాలా?''డాక్టర్‌.. ధనాధన్‌..''రసాయన పరిశ్రమలో పేలుడు''నడి వీధిలో పైశాచికం''పాక్‌ నుంచే కుట్ర'
వేగంగా కదులుతున్న విశాఖ ఐటీఐఆర్‌
కేంద్రమంత్రుల కమిటీ ముందు దస్త్రం
అభిప్రాయాల కోసం సంబంధిత
విభాగాలకు ఆరువారాల గడువు
ఈనాడు, హైదరాబాద్‌: విశాఖపట్నాన్ని ఐటీహబ్‌గా తీర్చిదిద్దేందుకు కీలకమైన ఐటీపెట్టుబడుల ప్రాంతీయ మండలి (ఐటీఐఆర్‌) ప్రాజెక్టు దస్త్రం వేగంగా కదులుతోంది. 45 చ.కి.మీ. పరిధి, 11 వేల ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయతలపెట్టిన ఐటీఐఆర్‌ ప్రాజెక్టు ఆమోద ప్రక్రియలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. అవరోధాలు లేకుండా పరిస్థితులన్నీ అనుకూలిస్తే మరో ఆరునెలల్లోగా ప్రాజెక్టుకు ఆమోదం లభించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం విశాఖ ఐటీఐఆర్‌ ప్రాజెక్టు దస్త్రం కేంద్ర మంత్రుల కమిటీ ముందు ఉన్నట్లు తెలిసింది. విశాఖ, తిరుపతిలో ఐటీఐఆర్‌ ప్రాజెక్టులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలుత విశాఖ ఐటీఐఆర్‌ ప్రాజెక్టు ప్రతిపాదనకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తెలిపారు. ఈ మేరకు ఐటీఐఆర్‌ పరిధిలో రూ.50 వేల కోట్ల ఐటీ, ఎలక్ట్రానిక్‌ పెట్టుబడులు ఆకర్షించాలని రాష్ట్ర సర్కార్‌ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలకు అనుమతి కోసం దస్త్రాన్ని అధికారులు కేంద్రానికి పంపించారు. ఈక్రమంలో ఐటీఐఆర్‌ ప్రాజెక్టుపై కేంద్రం వేగంగా స్పందిస్తోంది. ఐటీఐఆర్‌ఆమోదానికి కేంద్రంలోని పలు ప్రభుత్వశాఖలు అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. మంత్రుల కమిటీ ఆయా విభాగాల నుంచి ఆరువారాల్లోగా అభిప్రాయాలు తెలియజేయాలని కోరింది. నిర్ణీత గడువులోగా అభిప్రాయాలు, అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని, వాటిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమాధానాలు కోరుతుంది. ఈ సమాధానాలతో కేంద్ర మంత్రుల కమిటీ, ప్రభుత్వ విభాగాలు సంతృప్తి వ్యక్తంచేసిన తరువాత ఐటీఐఆర్‌ ప్రతిపాదనకు ఆమోదం లభించనుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు కనీసం 6నెలల గడువు పట్టే అవకాశముందనిఐటీశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.

విశాఖ ఐటీఐఆర్‌ ఇలా...
* ఎయిర్‌పోర్టుకు దగ్గరగా ఉన్న ఐదుప్రాంతాలను ఎంపిక చేసి విశాఖ ఐటీఐఆర్‌ పరిధిలో చేర్చారు. ఇందులో ప్రముఖంగా పరవాడ, మధురవాడ, భోగాపురం, గంభీర్‌ ప్రాంతాలున్నాయి.
* విశాఖ ఐటీఐఆర్‌ 45 చ.కి.మీ పరిధిలో 11 వేల ఎకరాల విస్తీర్ణంలో ఐటీ, ఐటీయేతర, ఎలక్ట్రానిక్‌ తయారీ పరిశ్రమలను అభివృద్ధి చేయనుంది.
* దాదాపు 50 వేల కోట్ల వరకు పెట్టుబడులు ఆకర్షించాలి. ఐటీఐఆర్‌తో 5 లక్షల మందికి ప్రత్యక్ష ఐటీ ఉద్యోగాలు, 18 లక్షల వరకు పరోక్ష ఉద్యోగాలు కల్పించాలి.
* అంతర్గత, బాహ్య మౌలిక సదుపాయాలు, రోడ్లు, తాగునీటి సరఫరా, విద్యుత్తు, మురుగునీటి పారుదల, ఘనవ్యర్థాల నిర్వహణ సౌకర్యాలు పనులు చేపట్టాల్సి ఉంది. వీటికి రూ.30వేల కోట్లకు పైగా నిధులు అవసరమవుతాయని అంచనా.

పదుగురి కోసం ఆరుగురం!

కాలేజీ స్నేహితులకో వాట్స్‌యాప్‌ గ్రూప్‌ చిన్నప్పటి మిత్రులకో ఫేస్‌బుక్‌ గ్రూప్‌ బంధువులందరినీ కలిపేందుకు గూగుల్‌ ప్లస్‌.. ఇలా నేటి సామాజిక మాధ్యమాలని మస్తుగా వాడుకుంటోంది...

పచ్చబొట్టేసి...జోలీకి నచ్చేసి!

ఏంజెలీనా జోలీకి రెండంటే మహా ఇష్టం. ఒకటి పిల్లలు, రెండు టాటూలు. ముగ్గురు కన్నబిడ్డలతో పాటు మరో ముగ్గురు అనాథలను దత్తత తీసుకుని పెంచుకుంటోంది జోలీ...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net