Sun, February 14, 2016

Type in English and Give Space to Convert to Telugu

'భారత్‌లో తయారీకి బ్రహ్మరథం''ఐపీఎస్‌లను పెంచండి''పాకిస్థాన్‌కు అధునాతన ఎఫ్‌-16 యుద్ధవిమానాలు''ఖేడ్‌లో 81.72 శాతం పోలింగ్‌''దిండి మొదటి దశ పనులకు త్వరలో టెండర్లు''మెదక్‌ నిమ్జ్‌లో చైనా పెట్టుబడులు..''చెలకల్లో.. అవినీతి మొలకలు!''మార్చి 10 నుంచి శాసనసభ సమావేశాలు''మళ్లీ తెరపైకి ఓటుకు నోటు కేసు''కళతో సామాజిక సందేశం'
కాంగ్రెస్‌లో అసమ్మతి జ్వాల
పక్కన పెడుతున్నారని భావిస్తున్న సీనియర్‌ నేతలు
అధిష్ఠానంపై బహిరంగంగానే ధిక్కార స్వరాలు
దిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం. హరియాణా, మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లోనూ అదే తంతు. ఈ నేపథ్యంలో అధిష్ఠానంపై పలువురు నేతలు ధిక్కార స్వరాన్ని వినిపిస్తుండటంతో కాంగ్రెస్‌లో పూర్తి నిరాశ వాతావరణం నెలకొన్నట్టు కనిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో కనీవినీ ఎరుగని రీతిలో 44 స్థానాలకే పరిమితమై ఘోర పరాజయాన్ని చవిచూసిన తర్వాత తమను పక్కన పెడుతున్నారని భావిస్తున్న పలువురు ఉన్నత స్థాయి నేతలు అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. పి.చిదంబరం, మనీశ్‌ తివారీ, జయంతి నటరాజన్‌ వంటి సీనియర్‌ నేతలు తమను పట్టించుకోవటం లేదని భావిస్తున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడిని చేయనందుకు కమల్‌నాథ్‌ కూడా అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. తమిళనాడు కాంగ్రెస్‌ విభాగం నుంచి సీనియర్‌ నేత జి.కె.వాసన్‌ వైదొలగిన తర్వాత చిదంబరం కుమారుడు కార్తీ బుధవారం కాంగ్రెస్‌ అధిష్ఠానానికి వ్యతిరేకంగా మాట్లాడారు. దిల్లీలోని అధిష్ఠానం నుంచి వెలువడే నిర్ణయాలు శాసిస్తున్నాయని, అందువల్లే పార్టీ బలహీనం అవుతోందని వ్యాఖ్యానించారు. ‘‘మనం పరిశీలకుల తరహా పనితీరును సవరించుకోవాల్సిన అవసరముంది. తమిళనాడు కాంగ్రెస్‌కు మరింత స్వేచ్ఛ ఇవ్వాలి. పరిష్కారం దిల్లీ నుంచి రాకూడదు. కేరళలో మాదిరిగా రాష్ట్ర విభాగం ఉండాలని కోరుకుంటున్నా. అక్కడ స్వేచ్ఛాయుత పద్ధతిలో రాష్ట్ర విభాగాన్ని నడిపిస్తున్నారు’’ అని కార్తీ అభిప్రాయపడ్డారు. ఆ వెంటనే కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌ కార్తీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ వ్యవహారాల పట్ల సంతోషంగా లేకపోతే వదలి వెళ్లిపోవచ్చని సంకేతాలు ఇచ్చారు. కార్తీ పేరును ప్రస్తావించకుండా ‘‘మనం అందరినీ కలుపుకొని పోయే పార్టీలో ఉన్నాం. ఈ అభిప్రాయాన్ని మన్నించనివారు పార్టీని విడిచి పోవచ్చు’’ అని పేర్కొన్నారు. దిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ కూడా త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో పాల్గొనటానికి నిరాకరించటం కాంగ్రెస్‌కు మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టేలా కనిపిస్తోంది. మోహన్‌ గోపాల్‌, ఎ.కె.ఆంటోనీ, జైరామ్‌ రమేశ్‌ వంటి గాంధీ విధేయుల కోటరీ ద్వారా పార్టీ వ్యవహారాలు నడుస్తున్నాయని చాలామంది నేతలు భావిస్తున్నారు.

ముఠాతత్వాన్ని వీడండి.. సోనియా: ముఠాతత్వాన్ని వీడాలని, అట్టడుగు స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయటానికి కృషి చేయాలని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ తమిళనాడు విభాగాన్ని ఆదేశించారు. పీసీసీ అధ్యక్షుడు ఇళంగోవన్‌ నేతృత్వంలో టీఎన్‌సీసీ ప్రతినిధుల బృందం గురువారం సోనియాగాంధీని, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని కలుసుకొని గంటసేపు చర్చించింది. ఈ సందర్భంగా ఐకమత్యాన్ని కొనసాగించాలని, పార్టీని బలోపేతం చేయటానికి ప్రణాళిక రూపొందించాలని సోనియా వారికి సూచించారు. త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికలకు సన్నద్ధం కావాలని ఆదేశించారు.

వలచి...గెలిచి..

ప్రేమికుల రోజూ.. అదే సూర్యుడు. అవే ఇరుసంధ్యలు. అదే గాలి. అవే దిక్కులు. ఎప్పట్లాగే ఇరవై నాలుగ్గంటలు!! మరేమిటీ ప్రత్యేకం? ఏముంది? ప్రేమే!!...

‘శ్రీరస్తు శుభమస్తు’ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌

అల్లు శిరీష్‌, లావణ్య త్రిపాఠి జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘శ్రీరస్తు శుభమస్తు’. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను చిత్ర....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net