Wed, February 10, 2016

Type in English and Give Space to Convert to Telugu

'ఈ హనుమంతుడు మృత్యుంజయుడు!''విద్యా విలీనం''ఆ నాటి హామీలను నెరవేర్చండి''తెరాస గూటికి కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే''కాల్పుల్లో అనూహ్య మలుపు''ఉగ్ర మూలం ఐఎస్‌ఐ''వెనక్కు పంపాం.. బహిష్కరణ కాదు''సుశీల్‌ కొయిరాలా కన్నుమూత''వెళ్లిరా నేస్తమా...''రాజ్యాంగం పవిత్రతను కాపాడాలి'
లొంగిపోయే యోచనే ఛోటారాజన్‌కు లేదు
పట్టుబడినప్పుడు రూ.10 లక్షల నగదు ఉంది
15 జతల బట్టలూ ఉన్నాయి
మరో దేశానికెళ్లే ప్రయత్నంలోనే దొరికాడు: ప్రభుత్వ వర్గాల వెల్లడి
దిల్లీ, ముంబయి
నేరసామ్రాజ్య అధినేత ఛోటా రాజన్‌కు తనంత తానుగా లొంగిపోయే ఆలోచనేదీ లేదనీ, వేరే దేశానికి వెళ్లే ప్రయత్నంలో పట్టుబడ్డాడని ప్రభుత్వ వర్గాలు శనివారం స్పష్టం చేశాయి. తద్వారా రాజన్‌ లొంగిపోయాడా, అరెస్టయ్యాడా అనే అనుమానాలకు తెరదించే ప్రయత్నం చేశాయి. కేంద్ర దర్యాప్తు సంస్థ సహా భారత జాతీయ, అంతర్జాతీయ సంస్థలు సమన్వయంతో ఆరు నెలల పాటు చేసిన కృషి కారణంగానే అతడు ఇండోనేషియాలోని బాలిలో అరెస్టయ్యాడని వివరించాయి. ‘దాదాపు రూ.10 లక్షలకు సమానమైన నగదుతో, 15 జతల దుస్తులతో రాజన్‌ ప్రయాణిస్తున్నాడు. తనకిష్టమైన మరేదైనా దేశానికి వెళ్లే ప్రయత్నంలో ఉన్నాడనడానికి ఇవే సాక్ష్యం. అలా వెళ్లబోతూ ఇంటర్‌పోల్‌కు అందిన సమాచారంతో పట్టుబడిపోయాడు. లొంగిపోయే యోచన ఏమాత్రం లేకపోవడం వల్లనే బాలిలో ‘లొంగుబాటు పత్రం’పై సంతకం చేయడానికీ నిరాకరించాడనీ, అలా సంతకం చేసి ఉంటే వెన్వెంటనే అతడిని మన దేశానికి తీసుకురావడం వీలయ్యేదని పేర్కొన్నాయి.

ఆరు నెలల క్రితమే ఆచూకీ:‘పలాయనంలో ఉన్న నేరగాళ్లపై ఆరు నెలల క్రితం ఇంటర్‌పోల్‌తో జరిగిన ఒక ఉన్నతస్థాయి సమీక్షలో అతడు ఆస్ట్రేలియాలో ఉన్నట్లు సీబీఐకి తెలియవచ్చింది. మోహన్‌కుమార్‌ అనే తప్పుడు గుర్తింపుతో అక్కడ ఉన్నట్లు తెలిసింది. వెంటనే అంతర్జాతీయ దర్యాప్తు సంస్థలతో కలిసి చేపట్టిన రహస్య కార్యకలాపంతో పట్టుకోవడం సాధ్యమయింది...’ అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 2000 సంవత్సరంలో తనపై జరిగిన దాడి నుంచి త్రుటిలో తప్పించుకున్న రాజన్‌ బ్యాంకాక్‌ నుంచి విజయ్‌ కదమ్‌ అనే తప్పుడు గుర్తింపు పత్రంతో ఆఫ్రికా వెళ్లిపోయాడనీ, థాయ్‌లాండ్‌కు వెళ్లిన భారత దర్యాప్తు సంస్థలకు టోకరా ఇచ్చాడనీ వివరించాయి. 2003లోనూ మోహన్‌కుమార్‌ పేరుతో జింబాబ్వే నుంచి తప్పుడు పాస్‌పోర్టు పొంది ఆస్ట్రేలియాకు వెళ్లిపోయాడని తెలిపాయి. తన ప్రత్యర్థి దావూద్‌ ఇబ్రహీం నుంచి ప్రాణాలను రక్షించుకొనేందుకు అప్పటి నుంచి అక్కడే ఉన్నాడనీ, ఆస్ట్రేలియా నుంచే చురుగ్గా కార్యకలాపాలు నిర్వహించేవాడని చెప్పాయి.

రహస్యంగా వేలిముద్రల సేకరణ
‘ఆస్ట్రేలియాలో రాజన్‌ ఉన్నట్లు తెలిసిన తర్వాత దానిని రూఢి చేసుకోవడానికి సీబీఐ రహస్యంగా అతని వేలిముద్రలు సేకరించింది. పోలీసుల వద్ద ఉన్న ముద్రలతో అవి సరిపోయాయి. అప్పటి నుంచి అతని కదలికలపై నిఘా మొదలయింది. ఆస్ట్రేలియా నుంచి అతడిని తీసుకురావడం దాదాపు అసంభవం. ఎందుకంటే అక్కడి స్థానిక చట్టాలు అలాంటివి. అక్కడ నివాసం ఉండడానికి అనుమతి ఈ అక్టోబరు 31తో ముగిసిపోవడం మాకు ఓ వరంలా మారింది. మోహన్‌కుమార్‌ పేరుతో ఆ అనుమతిని పొడిగించుకునేందుకు రాజన్‌ ప్రయత్నించాడు. సీబీఐ వివిధ మార్గాల ద్వారా ప్రయత్నించి, ఆ పొడిగింపు రాకుండా చూసింది. నిర్ణీత గడువుకు ఆరు రోజుల ముందుగా, అక్టోబరు 25న బాలి వెళ్లడానికి రాజన్‌ ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. అక్కడైతే దావూద్‌ నుంచి ముప్పు తక్కువని అతడు భావించి ఉండవచ్చు. కానీ రెడ్‌కార్నర్‌ నోటీసులతో అక్కడి అధికారులు పట్టుకున్నారు. అక్కడి న్యాయస్థానాలను ఛోటా ఆశ్రయించకుండా, సీబీఐ ముందుగానే అతడి పాస్‌పోర్టును రద్దు చేయించింది. దాంతో ఎటూ కదల్లేని స్థితిలో పట్టుబడ్డాడు’ అని వివరించాయి. గుండెకు బైపాస్‌ శస్త్రచికిత్స చేయించుకున్న రాజన్‌కు మూత్రపిండాల జబ్బేమీ లేదని ముంబయి నేర పోలీసు విభాగ సీనియర్‌ అధికారి ఒకరు స్పష్టం చేశారు.

సన్నాఫ్‌ ఛోటా రాజన్‌!
తప్పుడు పేర్లతో పాస్‌పోర్టులు పొందిన నేరసామ్రాజ్య అధినేత ఒక పాస్‌పోర్టులో తన తండ్రిపేరు ‘ఛోటా రాజన్‌’గా పేర్కొనడం విశేషం. రెండు తప్పుడు పాస్‌పోర్టులున్నట్లు ఇంతవరకు తెలియగా మూడోదాన్ని కూడా సీబీఐ స్వాధీనం చేసుకొంది. ఇది ఎప్పుడు, ఎక్కడి నుంచి జారీ అయిందీ వెల్లడించడానికి సంబంధిత వర్గాలు నిరాకరించాయి. తప్పుడు పాస్‌పోర్టుల కేసులో రాజన్‌ను 10 రోజుల పాటు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ దిల్లీలో న్యాయస్థానం ఆదేశాలిచ్చింది.

మమ్మల్నీ ఉద్యోగులే అనుకున్నారు!

బయోటెక్నాలజీ రంగాన్ని చాలా ఇష్టంగా ఎంచుకున్నారా ఇద్దరు..!కానీ ఆ చదువుకు తగ్గ ఉద్యోగాల్లేవు.. ఈ పరిస్థితుల్లో ఎవరయినా ఉన్నచోటే వేరే ఉద్యోగాలు చూసుకోవడమో...

తెలుగులో నా ఆఖరి సినిమా వంగవీటి

ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ సంచలన ప్రకటన చేశారు. తెలుగులో తన ఆఖరి సినిమా......

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net