Mon, February 08, 2016

Type in English and Give Space to Convert to Telugu

'పట్టణాభిషేకం''వాస్తవాల ప్రతిబింబంగా బడ్జెట్‌''నీటిపై నిప్పుల వాన''సీఎం మొండి అయితే.. నేను జగమొండి''తీరప్రాంత దేశాల మధ్య సహకారం పెరగాలి''ఉత్తర కొరియా రాకెట్‌ ప్రయోగం''చిరుతకు చిక్కి .. ప్రాణాలతో బయటపడి''మౌఖికంలో మార్కులు ఖాయం''ఎయిమ్స్‌కు 220 ఎకరాలు కేటాయింపు''‘అంకుర’ భయాలొద్దు'
యువతా.. మీ భవిత జాగ్రత్త!
యువతను ఆకర్షించేందుకు అంతర్జాలంలో ఉగ్రవాద భావజాలం
ఐఎస్‌ ఉగ్రవాద సంస్థ జాడలపై నిఘా
ఆకర్షితులవుతున్న యువత, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌
హద్దుదాటితే మేజిస్ట్రేట్‌ ఎదుట బైండోవర్‌
ఫలితమిస్తున్న పోలీసు ఆపరేషన్‌
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి
హైదరాబాద్‌లో ‘ఇస్లామిక్‌ స్టేట్‌ ఫర్‌ ఇరాక్‌ అండ్‌ సిరియా (ఐఎస్‌ఐఎస్‌)’ ఉగ్రవాద సంస్థ ప్రభావం లేకుండా పోలీసులు కొత్త ఆపరేషన్‌ ప్రారంభించారు. ఈ ఉగ్రవాద భావజాలం పట్ల ఆకర్షితులవుతున్న యువకులను గుర్తించి.. వారికి, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. హద్దులు దాటేవారిని మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపర్చి విడిచిపెడుతున్నారు. తమ ప్రణాళిక సత్ఫలితాలిస్తున్నట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు.

తన ఉగ్రవాద ప్రణాళికను అమలు చేసేందుకు అధికంగా యువతను భాగస్వామ్యం చేయాలని ఈ సంస్థ భావిస్తోంది. తదనుగుణంగా దక్షిణ భారతదేశంపై దృష్టి సారించింది. ఉగ్రవాదులు మొన్నటివరకు తమ భావజాలంతో కూడిన వీడియోలను అంతర్జాలంలో ఉంచేవారు. తర్వాత స్కైప్‌ ద్వారా కొంతమంది యువకులతో కూడా మాట్లాడినట్టు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై కొద్ది నెలలుగా అన్ని రాష్ట్రాల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తుండటంతో ఈ సంస్థ కొత్త మార్గాన్ని ఎంచుకొంది. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ వంటి సామాజిక మాధ్యమాలను సాధనాలుగా చేసుకొంది. తప్పుడు పేర్లతో ఖాతాలను తెరచి, వాటి ద్వారా ఉగ్రవాద భావజాలాన్ని వ్యాప్తం చేస్తోంది. ఉన్నత విద్యను అభ్యసించినవారే లక్ష్యంగా.. వారి ఆలోచన ధోరణిని మార్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇటీవల బంగ్లాదేశ్‌ సరిహద్దులను దాటి ఇరాక్‌ వెళ్లేందుకు ప్రయత్నించిన 11 మంది యువకులను కోలకోతాలో పట్టుకున్నారు. వీరిపై ఎలాంటి నేరాభియోగాలు లేకపోవడంతో, వారి కుటుంబ పరిస్థితుల పూర్వపరాలను విచారించారు. తల్లిదండ్రుల సమక్షంలో వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపేశారు. వీరిలాగే హైదరాబాద్‌, చుట్టుపక్కల ప్రాంతాల్లోని మరికొందరు యువకులు ఈ భావజాలం పట్ల ఆకర్షితులవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అత్యున్నత సాంకేతిక పద్ధతుల్లో అంతర్జాలంలో ఇలాంటి వారిపై నిఘా ఉంచిన పోలీసులు... అక్కడ ఉగ్రవాద భావజాలాన్ని చదివే యువతను గుర్తిస్తున్నారు. మరో అడుగు ముందుకు వేయకముందే.. వారి తల్లిదండ్రులను పిలిపిస్తున్నారు. ఈ పరిణామం ఎక్కడకు దారితీస్తుందో, దాని వల్ల పిల్లల భవిష్యత్తు ఎంత నరకంగా మారుతుందో వివరిస్తున్నారు. తమ పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. ఇప్పటికే ఇలా అనేకమంది తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇచ్చినట్టు పోలీసు అధికారులు చెప్పారు. సదరు యువకులకు కూడా ప్రత్యేకంగా నిపుణులతో పరిస్థితి తీవ్రతను గురించి వివరిస్తున్నారు. కౌన్సెలింగ్‌ తర్వాత కూడా వారు ఉగ్రవాద భావజాలం వైపు వెళ్తున్నారా అన్న విషయంపైనా పోలీసులు దృష్టి పెట్టారు. హద్దులు దాటిన ఓ యువకుడిని మాత్రం మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరిచి, అతడి నుంచి హామీపత్రం తీసుకుని విడిచిపెట్టినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి.

మాధవన్‌ పళ్లురాలగొట్టాను..!

సినిమా కోసం ఉత్తుత్తినే కాదు.. నిజంగానే అంతపని చేసిందట రితిక. గత వారం విడుదలై సంచలన విజయం సాధించిన ‘సాలా ఖడూస్‌’ చిత్రం కథానాయిక. అప్పుడెప్పుడో పరుగుల రాణీ...

‘శ్రీశ్రీ’ డబ్బింగ్‌ పూర్తి

అలనాటి తెలుగు సూపర్‌స్టార్‌ కృష్ణ, ఆయన భార్య విజయ నిర్మల కీలక పాత్రధారులుగా తెరకెక్కిన ‘శ్రీశ్రీ’ చిత్రం దాదాపు పూర్తయ్యింది....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net