Sun, February 07, 2016

Type in English and Give Space to Convert to Telugu

'కడలి వేదికగా కదన విన్యాసం''కల్తీల నుంచి కాపాడాలి''ఎస్సై కొలువులకు సై''వాట్సన్‌ @ రూ. 9.5 కోట్లు''హామీలు నెరవేర్చే వరకు దీక్ష''అన్నయ్యే వారసుడు..''ప్రజల మనసులు చూరగొంటూ..''సాగర జలాల్లో స్నేహబంధం''కాగిత రహిత టికెట్ల దిశగా రైల్వే''అనుమతి లేకుండా ప్రాజెక్టులు'
బయానా కొట్టు.. బీటీ పట్టు
పల్లెల్లో పత్తి విత్తుల కంపెనీల హడావిడి
మేలో ఇచ్చే ప్యాకెట్లకు ఇప్పుడే బుకింగ్‌లు
వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు
ఈనాడు - హైదరాబాద్‌
చేతికొచ్చిన పత్తి ఇంకా ఇళ్లలోనే మగ్గుతోంది. గిట్టుబాటు ధరలు రాక రైతులు విలవిలలాడుతున్నారు. మరోవైపు పొలాల్లోని పత్తి వరద నీటిలో మునిగితేలుతోంది. ఈ సమస్యలన్నిటితో రైతులు కుస్తీలు పడుతుంటే పత్తి విత్తుల కంపెనీల పాట్లు మరోలా ఉన్నాయి. బీటీ పత్తి విత్తుల ప్యాకెట్లకు బయానాల పేరుతో ఈ కంపెనీలు పల్లెల్లో హడావిడి చేస్తున్నాయి. వచ్చే మేలో రైతులకు విక్రయించే ప్యాకెట్లకు ఇప్పటి నుంచే బయానాలు తీసుకోవటం మొదలైంది. ఆరునెలల ముందే బయానా(అడ్వాన్సు)లు తీసుకొంటే డీలర్లు తమ కంపెనీవే కచ్చితంగా తీసుకొంటారనే పథకంతో ప్రధాన కంపెనీల యాజమాన్యాలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. విత్తన చట్టం నిబంధనల ప్రకారం వ్యవసాయశాఖ అనుమతి లేకుండా ఇలా బయానాలు వసూలు చేయకూడదు. వాస్తవానికి వచ్చే ఏడాదికి ఎన్ని బీటీ పత్తి విత్తులు కావాలనే ప్రణాళికపై ఇంతవరకూ వ్యవసాయశాఖ కసరత్తు ప్రారంభించలేదు. కంపెనీలతో సంప్రదింపులైనా ప్రారంభించలేదు. కానీ వచ్చే ఏడాదికి అవసరమైన విత్తులు ఎన్ని తయారుచేయాలో అంచనాకు రావాలంటే ముందుగా డీలర్ల నుంచి వచ్చే బుకింగ్‌లే ప్రధానమని కంపెనీలు భావిస్తున్నాయి.

* రాష్ట్రంలో ఈ ఏడాది కోటి 20 లక్షల విత్తన ప్యాకెట్లను గత మే నుంచి కంపెనీలు అందుబాటులో ఉంచగా రైతులు కోటి 8 లక్షల ప్యాకెట్లు కొన్నారు. 2011లో 94 లక్షల ప్యాకెట్లే అమ్మడం గమనార్హం.

* వచ్చే ఏడాది రాష్ట్రంలో కోటి 20 లక్షల ప్యాకెట్లు అమ్ముడవుతాయని బీటీ కంపెనీలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీల మధ్య పోటీ పెరిగింది. గిరాకి అధికంగా ఉన్న కంపెనీల వ్యాపారానికి ముందస్తు బుకింగ్‌లే కీలకం. ఇవి తగ్గితే సీజన్‌ మొదలైన తరవాత విత్తులు అమ్ముకోవడం కష్టమవుతుందని ఓ కంపెనీ యాజమాన్య ప్రతినిధి తెలిపారు.

* కొన్ని చిన్న కంపెనీల వారు ప్రధాన కంపెనీల విత్తులు తెచ్చి ఇస్తామంటూ పల్లెలకు ఏజెంట్లను పంపి బయానాలు వసూలు చేస్తున్నారు. ప్యాకెట్‌ విలువలో 10 శాతం ఇస్తే చాలంటూ డీలర్లను తమ గుప్పెట్లో ఉంచుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఒక్కో ప్యాకెట్‌ పత్తి విత్తుల ధర రూ.930 కాగా వచ్చే ఏడాదికి ధర పెంచాలా వద్దా అన్నది వచ్చే మార్చి, ఏప్రిల్‌ నెలల్లో ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఈ ధరలపై కంపెనీలు ఇప్పుడే తప్పుడు ప్రచారం మొదలెట్టాయి.

బయానాలపై అప్రమత్తం
బీటీ పత్తి విత్తులకు బయానాలు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. దీనిపై జిల్లా యంత్రాంగాలను అప్రమత్తం చేస్తున్నాము. కంపెనీలకు డీలర్లు అడ్వాన్సులు ఇవ్వవద్దు. వచ్చే ఏడాది పత్తి విత్తులపై ప్రణాళిక తయారీకి ఈనెల 17న విత్తన కంపెనీలతో రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహిస్తున్నాం.

-బలరాంనాయక్‌,
వ్యవసాయశాఖ అదనపు సంచాలకులు

వెలుగు వైపు నా అడుగులు...

బడిగంట కొట్టగానే పిల్లలందరూ బిలబిలమంటూ బయటకు పరుగుతీశారు. టీచర్లూ ఇంటిదారిపట్టారు. ఒకరిద్దరు తప్ప నిర్మానుష్యంగా మారిన ఆ బడిలో..

పరిశ్రమ వదిలి వెళ్లిపోదామనుకున్నా!

మానవీయ కోణాల్ని స్పృశిస్తూ సినిమాలు తీయడంలో దర్శకుడు మదన్‌ది ప్రత్యేక శైలి. మనిషి, మనసు, అనుబంధాల మధ్య సంఘర్షణల్ని ఆయన తెరపైకి తీసుకొచ్చే విధానం బాగుంటుంది.

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net