Tue, February 09, 2016

Type in English and Give Space to Convert to Telugu

'ఔషధనగరిలో ప్రపంచశ్రేణి విశ్వవిద్యాలయం''భూసేకరణ, పునరావాసాలకేరూ. 8,000 కోట్లు''నెట్‌ సమానత్వానికే ట్రాయ్‌ మొగ్గు!''ముద్రగడ దీక్ష విరమణ''తెలంగాణ ప్రణాళిక భేష్‌''విద్వేషాలు రెచ్చగొడుతూ రాజకీయాలా?''డాక్టర్‌.. ధనాధన్‌..''రసాయన పరిశ్రమలో పేలుడు''నడి వీధిలో పైశాచికం''పాక్‌ నుంచే కుట్ర'
దిగివస్తున్న పసిడి ధర
రూ.24వేల వరకూ రావచ్చంటున్న నిపుణులు
ఈనాడు - హైదరాబాద్‌
గధగలాడే బంగారం వెలవెలబోతోంది. కొన్నేళ్లుగా పెరగటమే తప్పించి తగ్గుముఖమంటూ లేని పసిడి ధర ఇప్పుడు నేల చూపులు చూస్తోంది. ఇటీవలి కాలంలో అనూహ్యంగా దిగివస్తోంది. ఇది సాధారణ వినియోగదార్లను సంతోషానికి గురిచేస్తుంటే, దీనిపై భారీగా పెట్టుబడులు పెట్టిన వారు మాత్రం ఆందోళన చెందుతున్నారు.

2012లో బంగారం రికార్డు స్థా´యి ధరను నమోదు చేసింది. అప్పట్లో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1900 డాలర్లు పలికింది. భారత్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.33వేలకు పెరిగింది. అప్పట్లో ధర ఇంకా పెరుగుతుందని అనుకున్నారు. కానీ కాస్త అటూఇటూ 30వేల దరిదాపుల్లో చాలాకాలం ఉండిపోయింది. గత రెండు మూడు నెలల నుంచి మాత్రం కిందికి చూడటం మొదలైంది. దాదాపుగా 1130 డాలర్లకు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర క్షీణించింది. గరిష్ఠ స్థా´యితో పోలిస్తే ఇది 40% క్షీణత. దేశీయ మార్కెట్లోనూ 10 గ్రాముల బంగారం రూ.25,500కు దిగివచ్చింది. ఇది 20 శాతం కంటే ఎక్కువ క్షీణత. ఈ పరిస్థితిని ఎక్కువ మంది వూహించలేదు. తగ్గుదల ఇంతటితో ఆగుతుందా అంటే.. ఇంకా తగ్గవచ్చంటున్నారు నిపుణులు. అంతేగాక ధర ఇప్పట్లో భారీగా పెరిగే అవకాశం లేదని స్పష్టం చేస్తున్నారు. రెండేళ్లనాటి రూ.32,000 ధరను చేరుకోవటానికే ఎంతో సమయం పట్టవచ్చని చెబుతున్నారు.

ఎందుకీ క్షీణత?
అమెరికాలో ఉద్దీపనా పథకాలకు మంగళం పలుకుతున్నట్లు అక్కడి ప్రభుత్వం గత నెలలో స్పష్టం చేసింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందనే సంకేతం ఇందులో ఉంది. బంగారం ధరకు తగిలిన మొదటి ఎదురుదెబ్బ ఇదే. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర గణనీయంగా పడిపోయింది. పీపా వంద డాలర్లకు పైగానే ఉంటూ వచ్చిన ధర కాస్తా, 80 డాలర్లకు పడిపోయింది. ఇప్పటికీ 83 డాలర్లకు దగ్గర్లోనే ఉంది. మరోపక్క చైనాలో బంగారానికి డిమాండ్‌ బాగా క్షీణించింది. గత ఏడాది ధర తగ్గిన ప్రతిసారీ చైనా పెద్దఎత్తున పసిడిని కొనుగోలు చేసింది. ఈసారి మాత్రం ఆ దేశం నుంచి అలాంటి సంకేతాలేమీ లేవు. భారత్‌లో ఈ ఏడాది ఎన్‌డీఏ ప్రభుత్వం వచ్చాక.. ఏర్పడ్డ సానుకూల వాతావరణానికి తోడు, ముడిచమురు ధర దిగిరావటం ఆర్థిక వ్యవస్థకు కలిసొచ్చింది. లోటు తగ్గేందుకు అవకాశం కలిగింది. దీనివల్ల రూపాయి మారకం విలువ స్థి´రంగా ఉండటంతోపాటు, డాలర్‌తో పోల్చినప్పుడు బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా అంతర్జాతీయ మార్కెట్లో సరకుల ధరలు దిగివస్తున్నాయి. దీనివల్ల స్టాక్‌మార్కెట్‌ ఆకర్షణీయంగా మారింది. బంగారంపై పెట్టుబడి పెట్టేవాళ్లు, తమ సొమ్మును ఎక్కువగా స్టాక్‌మార్కెట్‌ పెట్టుబడులకు మళ్లిస్తున్నారు. ఈ కారణాలన్నీ బంగారం ధరకు ప్రతికూలంగా మారి, దిగివస్తున్నట్లు నిపుణుల విశ్లేషణ.

తగ్గవచ్చు!
అంతర్జాతీయ పరిణామాలను, ముఖ్యంగా చైనా, ఐరోపా దేశాల్లోని పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే బంగారం ధర ఇంకా తగ్గేందుకే అవకాశం కనిపిస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. శుక్రవారం హైదరాబాద్‌ బులియన్‌ వర్తకుల వద్ద 10 గ్రాముల బంగారం ధర రూ.26,360 ఉంది. మళ్లీ రూ.27వేల ధర పలికే అవకాశం ఉందని, ఆ తర్వాత మళ్లీ క్షీణత తప్పదని అంటున్నారు. వచ్చే 3-6 నెలల్లో రూ.24వేల వరకూ తగ్గేందుకు అవకాశం ఉందని చెబుతున్నారు. ధర తగ్గటంతో హైదరాబాద్‌లో, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆభరణాలు కొనుగోలు చేసే వారి సంఖ్య పెరిగినప్పటికీ, బంగారంపై పెద్దమొత్తాల్లో పెట్టుబడి పెట్టే వారు మాత్రం తగ్గిపోయారని అంటున్నారు. అంతేగాక ఇంకా ధర తగ్గుతుందనే అంచనాలతో కొనుగోలుదార్లు కూడా వేచిచూస్తే ధోరణిని అవలంబిస్తున్నారని స్థానిక ఆభరణాల సంస్థ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. కమాడిటీస్‌ ఫ్యూచర్స్‌ మార్కెట్లో బంగారం, వెండి కాంట్రాక్టుల కొనుగోలుకు ఆసక్తి చూపటం లేదని కమాడిటీస్‌ బ్రోకింగ్‌ సంస్థలు చెబుతున్నాయి.
అన్నీ వ్యతిరేకాంశాలే...
‘‘బంగారానికి అన్నీ వ్యతిరేక సంకేతాలు కనిపిస్తున్నాయి. మనదేశంలో బంగారం దిగుమతిపై పన్నుల భారం ఎక్కువ. వచ్చే బడ్జెట్‌లో పన్నులు తగ్గిస్తే ఆ మేరకు ధర తగ్గుతుంది. డాలర్‌తో రూపాయి విలువ బలపడినా, ముడిచమురు ధర తగ్గినా.. బంగారం ధరపై ఒత్తిడి పెరుగుతుందే కానీ తగ్గదు. అందువల్ల ప్రస్తుత పరిస్థితుల్లో పెట్టుబడికి పసిడి అనుకూలంగా కనిపించటం లేదు. దీనికి బదులు ఈక్విటీ పెట్టుబడులపై ఎక్కువ ప్రతిఫలం ఉంటుంది.’’
- నమశ్శివాయ, జెన్‌ మనీ డైరెక్టర్‌
వెయ్యి డాలర్ల కంటే తగ్గకపోవచ్చు
‘‘ఔన్సు బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్లో వెయ్యి డాలర్ల కంటే తగ్గే అవకాశం కనిపించడంలేదు. ఒకవేళ అనుకోని విధంగా వెయ్యి డాలర్ల కంటే కిందకు పడిపోతే పసిడి ధర కుప్పకూలినట్లే. అదే జరిగితే వచ్చే రెండేళ్ల వ్యవధిలో ఔన్సు బంగారం ధర 850- 600 డాలర్ల వరకూ రావచ్చు. అయితే ఈ పరిస్థితి ఇప్పటికిప్పుడు ఉండదు. ప్రస్తుతం కాస్త మద్దతు కనిపిస్తోంది. అందువల్ల మళ్లీ ఒకసారి కాస్త కోలుకొని 1192 వరకూ వెళ్లవచ్చు. దాన్ని అధిగమిస్తే 1240- 1270- 1350 డాలర్ల దిశగా ఔన్సు బంగారం ధర ప్రయాణం ఉంటుంది.’’ 
- ఎస్‌.అనంత్‌, ఆర్థిక వ్యవహారాల నిపుణులు
నాలుగు వాయిదాల్లో కొనుక్కోవటం మేలు
‘‘10 గ్రాముల బంగారం ధర రూ.25వేలకు చేరుతుందని అంటున్నారు. మనదేశంలో రూ.25వేలు- 26వేల వద్ద కొనుగోలుదార్లు ముందుకు వస్తారు. అంతర్జాతీయ మార్కెట్లో అయితే 1200 డాలర్ల నుంచీ కొనుగోలుదార్లు ఉంటారు. ఇప్పుడు అంతకంటే కిందకు వచ్చింది కాబట్టి కొనుగోలుదార్ల మద్దతు లభిస్తోంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులు, రష్యా- ఉక్రెయిన్‌ వివాదం, మరికొన్ని ఇతర అంతర్జాతీయ పరిణామాలు బంగారం ధర హెచ్చుతగ్గులకు లోనయ్యేటట్లు చేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో నాలుగు దఫాలుగా విభజించుకొని బంగారం లేదా ఆభరణాలను కొనుగోలు చేయటం మేలు. దానివల్ల సగటు ధర తక్కువగా ఉంటుంది.’’ 
- బూరుగు మహాబలేశ్వరరావు, అధ్యక్షులు,
ఆంధ్రప్రదేశ్‌ బులియన్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌.

పదుగురి కోసం ఆరుగురం!

కాలేజీ స్నేహితులకో వాట్స్‌యాప్‌ గ్రూప్‌ చిన్నప్పటి మిత్రులకో ఫేస్‌బుక్‌ గ్రూప్‌ బంధువులందరినీ కలిపేందుకు గూగుల్‌ ప్లస్‌.. ఇలా నేటి సామాజిక మాధ్యమాలని మస్తుగా వాడుకుంటోంది...

పచ్చబొట్టేసి...జోలీకి నచ్చేసి!

ఏంజెలీనా జోలీకి రెండంటే మహా ఇష్టం. ఒకటి పిల్లలు, రెండు టాటూలు. ముగ్గురు కన్నబిడ్డలతో పాటు మరో ముగ్గురు అనాథలను దత్తత తీసుకుని పెంచుకుంటోంది జోలీ...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net