Sun, February 14, 2016

Type in English and Give Space to Convert to Telugu

'భారత్‌లో తయారీకి బ్రహ్మరథం''ఐపీఎస్‌లను పెంచండి''పాకిస్థాన్‌కు అధునాతన ఎఫ్‌-16 యుద్ధవిమానాలు''ఖేడ్‌లో 81.72 శాతం పోలింగ్‌''దిండి మొదటి దశ పనులకు త్వరలో టెండర్లు''మెదక్‌ నిమ్జ్‌లో చైనా పెట్టుబడులు..''చెలకల్లో.. అవినీతి మొలకలు!''మార్చి 10 నుంచి శాసనసభ సమావేశాలు''మళ్లీ తెరపైకి ఓటుకు నోటు కేసు''కళతో సామాజిక సందేశం'

వెలుగులోకి మరో జాబితా
అంతర్జాతీయంగా లక్ష మందికిపైగా ఖాతాదారుల వివరాల వెల్లడి
16వ స్థానంలో భారత్‌
పన్ను ఎగవేతకు సహకరించిన హెచ్‌.ఎస్‌.బి.సి.
గతంలో ఉల్లంఘనలు జరిగి ఉండవచ్చన్న బ్యాంకు
కొత్త కేసులపైనా దర్యాప్తు జరిపిస్తాం: కేంద్రం
దిల్లీ: నల్లకుబేరులకు సంబంధించి మరో జాబితా వెలుగు చూసింది. ప్రపంచవ్యాప్తంగా లక్ష మందికి పైౖగా ఖాతాదారుల వివరాలు దీనిలో ఉండడం సంచలనం సృష్టించింది. స్విట్జర్లాండ్‌లోని హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకులో ఉన్న ఈ ఖాతాల వివరాలను అంతర్జాతీయ పరిశోధనాత్మక పాత్రికేయుల వేదిక (ఐసీఐజే) బయటపెట్టింది. ఇది భారత్‌లో మరో రాజకీయ దుమారాన్ని సృష్టించే అవకాశం ఉంది. లక్ష మంది దాచుకున్న మొత్తం సంపద 100 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.6 లక్షల కోట్లు). జాబితాలో భారత్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు.. ముఖ్యంగా కాంగ్రెస్‌కు సంబంధించినవారు, మాజీ అధికారుల పేర్లు ఉన్నాయి. తాజా జాబితా వెల్లడైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సోమవారం స్పందించింది. హెచ్‌ఎస్‌బీసీ స్విట్జర్లాండ్‌ శాఖ, ఇతర చోట్ల ఉన్న భారతీయుల అప్రకటిత ఖాతాల పేర్లను పొందేందుకు ప్రజావేగుతో సంప్రదింపులు సాగిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. కొత్త కేసులన్నింటిపైనా తాము దర్యాప్తు జరుపుతామని పేర్కొంది. జాబితాలో పేర్లున్నవారంతా అక్రమార్కులు కారనీ, వారిలో కొందరు తమ విదేశీ వ్యాపార లావాదేవీల వివరాలను ఇప్పటికే పన్ను అధికారులకు తెలియజేశారని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ చెప్పారు. మరోపక్క సుప్రీం కోర్టు నియమిం చిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) కూడా తాజా జాబితాపై చర్చించింది. ఆధారాలున్న కొత్త కేసులన్నింటినీ పరిశీలిస్తామని వెల్లడించింది.





వలచి...గెలిచి..

ప్రేమికుల రోజూ.. అదే సూర్యుడు. అవే ఇరుసంధ్యలు. అదే గాలి. అవే దిక్కులు. ఎప్పట్లాగే ఇరవై నాలుగ్గంటలు!! మరేమిటీ ప్రత్యేకం? ఏముంది? ప్రేమే!!...

ఫైనల్‌లో వారియర్స్‌

రెండోసారి సీసీఎల్‌ ట్రోఫీ గెలవాలన్న తెలుగు వారియర్స్‌ నెరవేరడానికి ఇంకా ఒక్క అడుగు దూరంలో ఉంది. శనివారం హైదరాబాద్‌లో ఉత్కంఠభరితంగా జరిగిన రెండో సెమీఫైనల్‌లో...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net