Mon, February 08, 2016

Type in English and Give Space to Convert to Telugu

'పట్టణాభిషేకం''వాస్తవాల ప్రతిబింబంగా బడ్జెట్‌''నీటిపై నిప్పుల వాన''సీఎం మొండి అయితే.. నేను జగమొండి''తీరప్రాంత దేశాల మధ్య సహకారం పెరగాలి''ఉత్తర కొరియా రాకెట్‌ ప్రయోగం''చిరుతకు చిక్కి .. ప్రాణాలతో బయటపడి''మౌఖికంలో మార్కులు ఖాయం''ఎయిమ్స్‌కు 220 ఎకరాలు కేటాయింపు''‘అంకుర’ భయాలొద్దు'
నల్లఖాతాల వివరాలు తెలిస్తే చెప్పండి!
ప్రజలకు ‘సిట్‌’ విజ్ఞప్తి
దిల్లీ: విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధన ఖాతాదారుల సమాచారాన్ని రాబట్టేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) తాజాగా ప్రజల సహకారాన్ని కోరింది. ఏ భారతీయ వ్యక్తికైనా/సంస్థకైనా ఏదైనా విదేశీ బ్యాంకుల్లో రహస్య ఖాతా ఉన్న సమాచారం తెలిస్తే...ఆ వివరాలను తమకు తెలియచేయాల్సిందిగా కోరింది. ఈ మేరకు ఆదివారం ఒక బహిరంగ ప్రకటన చేసింది. విదేశీ బ్యాంకుల్లో ఇలాంటి ఖాతాలున్న వ్యక్తులు/సంఘాలు/స్వచ్ఛంద సంస్థలు లేదా మరేదైనా రూపంలో ఉంటే... ఆ వివరాలను నిర్దేశిత పత్రంలో తమకు సమర్పించాలని ‘సిట్‌’ కోరింది. అయితే, ఏదో ఒక ఆరోపణలు చేయరాదనీ కచ్చితమైన సమాచారం ఉంటేనే ఆ వివరాలను అందచేయాలని పేర్కొంది. అంతేకాదు, విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనాన్ని తిరిగి మనదేశానికి రప్పించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టవచ్చుననే సూచనలు సైతం ఇవ్వాల్సిందిగా కోరింది. అయితే, ఈ సూచనలు నిర్మాణాత్మకంగా ఉండాలని పేర్కొంది.

ప్రజలు తమకు తెలిసిన సమాచారాన్ని ‘జాయింట్‌ సెక్రటరీ ( ‘సిట్‌’ సభ్యకార్యదర్శి), డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ రెవిన్యూ, నార్త్‌బ్లాక్‌, దిల్లీ’కి పోస్టు ద్వారా పంపవచ్చు. లేదంటే sit-rev@nic.in కు ఈ మెయిల్‌ ద్వారా పంపవచ్చు. నల్లధనం ఖాతాల వివరాలను అందించే వ్యక్తుల పేర్లను కచ్చితంగా గోప్యంగా ఉంచుతామని ‘సిట్‌’ స్పష్టం చేసింది.

మాధవన్‌ పళ్లురాలగొట్టాను..!

సినిమా కోసం ఉత్తుత్తినే కాదు.. నిజంగానే అంతపని చేసిందట రితిక. గత వారం విడుదలై సంచలన విజయం సాధించిన ‘సాలా ఖడూస్‌’ చిత్రం కథానాయిక. అప్పుడెప్పుడో పరుగుల రాణీ...

‘శ్రీశ్రీ’ డబ్బింగ్‌ పూర్తి

అలనాటి తెలుగు సూపర్‌స్టార్‌ కృష్ణ, ఆయన భార్య విజయ నిర్మల కీలక పాత్రధారులుగా తెరకెక్కిన ‘శ్రీశ్రీ’ చిత్రం దాదాపు పూర్తయ్యింది....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net