Sat, February 13, 2016

Type in English and Give Space to Convert to Telugu

'ప్యాకేజీ ఇవ్వండి''విలీనమా.. అనర్హతా?''అదనపు పనులన్నీ పాత గుత్తేదారులకే''భారతమాతను కించపరిస్తే సహించం''‘తెలంగాణ బ్రాండ్‌’ పేరుతో అమ్మకాలు''శాశ్వత ఉత్సవంగా మేడారం జాతర''కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయం''విలీన లేఖపై ఏమి చేయాలి?''వీరసేనానికి కన్నీటి వీడ్కోలు''అమ్మతనానికి అండ'
ఏదీ వద్దు... బిల్లు రద్దు!
క్లాజ్‌ క్లాజ్‌కూ సవరణల సారమిదేనయా!
బిల్లులోని అంశాలపై సవరణలు.. సూచనల వెల్లువ
విభజనకు ఇటు మద్దతు- అటు వ్యతిరేకత
తెలంగాణ ఏర్పాటు సహా కీలక క్లాజులను
తొలగించాలన్న సీమాంధ్ర ఎమ్మెల్యేలు
సలహాలు, సూచనలు మాత్రమే ఇచ్చిన తెలంగాణ ఎమ్మెల్యేలు
ఏమీ ఇవ్వని కిరణ్‌కుమార్‌రెడ్డి, బొత్స, చంద్రబాబు
సరిహద్దు కమిషన్‌ కోరిన సీమాంధ్ర కాంగ్రెస్‌
పోలవరానికి జాతీయ హోదా వద్దని సవరణ
సీమాంధ్ర కాంగ్రెస్‌ ప్రతిపాదించినవివీ...!
మ నేతలు సహా పలువురు న్యాయ నిపుణులతో సుదీర్ఘంగా చర్చలు జరిపిన ముఖ్యమంత్రి కిరణ్‌ శుక్రవారం ఉదయం సీమాంధ్ర కాంగ్రెస్‌ తరఫున ఇవ్వాల్సిన ప్రతిపాదనలకు తుదిరూపం ఇచ్చారు. వీటిని శుక్రవారం సీమాంధ్ర కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సభాపతికి అందించారు. తెలంగాణ ఏర్పాటును సూచించే క్లాజ్‌తో సహా పలు కీలక క్లాజ్‌ల్ని తొలగించాలని సూచించారు. ప్రతి సవరణ ప్రతిపాదనకు రాజ్యాంగపరమైన సూత్రాలనో, సుప్రీంకోర్టు తీర్పులనో, చట్టబద్ధమైన నిబంధనలనో ఉటంకిస్తూ కారణాలుగా చూపారు. అదే సమయంలో కొన్ని సవరణ ప్రతిపాదనల్లో విభజిస్తే వచ్చే సమస్యల్ని ఎలా పరిష్కరించాలో సూచించారు. అలాంటి వాటిల్లో సరిహద్దుల నిర్ధారణ కమిషన్‌ను ప్రతిపాదించటం గమనార్హం. విభజననే గట్టిగా వ్యతిరేకించే సభ్యులు ఇలా సూచించటం విశేషం. ఇలా చేయాలంటే సుదీర్ఘ సమయం పడుతుంది కనుక ఎన్నికల్లోగా విభజన సాధ్యం కాకుండా చేసేందుకేనన్న భావన లేకపోలేదు. సవరణల్లో కొన్ని...
రాష్ట్రం సమైక్యంగా ఉంచడానికి వీలుగా... బిల్లులోని 12-13 క్లాజులను రద్దుల పద్దులో చేర్చాలి. కొత్త రాష్ట్ర ఏర్పాటు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ పరిధిలో ఉండే జిల్లాలు ఎన్ని అనే విషయాన్ని తెలియజేసే 3, 4 క్లాజులను రద్దు చేయాలి.

హైదరాబాద్‌ను ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగానే ఉంచాలి
హైదరాబాద్‌ను తెలంగాణ రాజధానిగా పేర్కొన్న రెండో భాగంలోని క్లాజు 5(1,) (2)లను తొలగించాలి. ఎందుకంటే....హైదరాబాద్‌ కోస్తాంధ్ర, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలకు రాజధానిగా ఉందని చరిత్ర చెప్తోంది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రాంతాలన్నీ చరిత్రలో సుదీర్ఘకాలం ఒకే గొడుగు కింద ఉన్నాయని ఇందిరాగాంధీ కూడా చెప్పారు. 1956 నుంచి తెలంగాణేతరులు హైదరాబాద్‌ అభివృద్ధిలో భాగస్వాములయ్యారు. అందుకే హైదరాబాద్‌ను ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా ఉంచాలి.

హైదరాబాద్‌ అందరిదీ!
జనాభా ఇతర ప్రామాణికాల ఆధారంగా 13వ ఆర్థిక సంఘం నిధులను పంపిణీ చేయాలన్న క్లాజ్‌ను రద్దు చేయాలి. రెండు రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్న వనరులను దృష్టిలో పెట్టుకుని కేంద్రం తగిన గ్రాంట్లు ఇచ్చే సౌకర్యం పొందుపరచొచ్చు అన్న 46 (1, 2) క్లాజను తీసేయాలి. ఎందుకంటే... హైదరాబాద్‌ పెట్టుబడుల కేంద్రమైంది. అందుకే అన్ని ప్రాంతాల్లోని వారు పెట్టుబడులు పెట్టారు. హైదరాబాద్‌లో వచ్చే ఆదాయం మొత్తం రాష్ట్రంలోనిది. కానీ బిల్లులో ఎక్కడా హైదరాబాద్‌ ఆదాయం గురించి ప్రస్తావించలేదు. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా పరిగణించే పక్షంలో ఆదాయం కూడా రెండు రాష్ట్రాలది. ఈ విషయాన్ని పూర్తిగా బిల్లులో విస్మరించారు. ఇది అహేతుకం. అసంబద్ధం.

35 స్థానాలే ఉంటే మండలి ఎలా..
బిల్లులోని మూడో భాగం...23వ క్లాజును తొలగించాలి. ఎందుకంటే... ప్రతిపాదిత తెలంగాణ రాష్ట్రంలోని మండలిలో 35 మంది సభ్యులే ఉంటారు. రాజ్యాంగంలోని 171వ ప్రకరణం ప్రకారం 40 కంటే తక్కువ స్థానాలతో కూడిన మండలి ఉండకూడదు. ఇది రాజ్యాంగ విరుద్ధం కాబట్టి తొలగించాలి.

సరిహద్దులు నిర్ణయించేందుకు సరిహద్దు కమిషన్‌
బిల్లులోని రెండో భాగం క్లాజ్‌ 3ను తీసేయాలి. ఎందుకంటే... సరిహద్దుల నిర్ణయం స్పష్టంగా లేదు. ఒకప్పటి హైదరాబాద్‌ రాష్ట్రంలోని చాలా తెలుగు మాట్లాడే ప్రాంతాలు కర్ణాటకలో ఉన్నాయి. వాటిని ప్రతిపాదిత తెలంగాణలో కలపడంపై పరిశీలించలేదు. పైగా భద్రాచలం డివిజన్‌ను 1959లో జీవోఎం.ఎస్‌.నెం.2384 ద్వారా తూర్పుగోదావరి జిల్లా నుంచి ఖమ్మం జిల్లాలో కలిపారు. అదే విధంగా కృష్ణా జిల్లాలోని మునగాల పరగణా నల్గొండ జిల్లాలో కలిపారు. ఇవన్నీ పరిశీలించి సరిహద్దులు నిర్ణయించేందుకు ఒక సరిహద్దు కమిషన్‌ ఏర్పాటు చేయాలి.

సరిహద్దులు నిర్ణయించకుండా సీట్ల నిర్ణయం ఎలా?
బిల్లులోని 16వ (1, 2, 3)క్లాజు ప్రకారం ప్రస్తుత 294 అసెంబ్లీ సీట్లలో ఆంధ్రప్రదేశ్‌కు 175, తెలంగాణకు 119 సీట్లు కేటాయించారు. ఆంగ్లో ఇండియన్‌ నుంచి ఒకరిని నామినేట్‌ చేసే ఈ క్లాజును తొలగించాలి. ఎందుకంటే... ప్రతిపాదిత రాష్ట్రాల సరిహద్దుల గుర్తింపును శాస్త్రీయంగా జరపలేదు. చరిత్రను పరిగణనలోకి తీసుకోలేదు. హైదరాబాద్‌లో అంతర్భాగమైన కర్ణాటకలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలను ఇందులో చేర్చలేదు. అదే సమయంలో ఆంధ్ర రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలను అందులో చేర్చారు. సరిహద్దులను ఖరారు చేయకుండా అసెంబ్లీలో శాసనసభ స్థానాలను నిర్ణయించడం కష్టం.

జలాలపై ‘మండలి’ ఏర్పాటుకు అధికారమే లేదు
కృష్ణా, గోదావరి నదీ జలాలు, వాటి బోర్డుల నిర్వహణకు సర్వోన్నత మండలి ఏర్పాటు అనే క్లాజును తొలగించాలి. ఎందుకంటే... కేంద్ర ప్రభుత్వానికి అధికారం లేనందున ఈ ‘మండలి’ ఏర్పాటు చేయడం కష్టం. సర్వోన్నత మండలికి అధికారాలు ఇవ్వడం దిగువ రాష్ట్రాలకు రాజ్యాంగం కల్పించిన హక్కుకు విరుద్ధం. మిగులు జలాలను వాడుకునే అధికారం ట్రిబ్యునళ్లు దిగువ రాష్ట్రానికి ఇచ్చాయి. తదనుగుణంగానే ప్రాజెక్టుల నిర్మాణమూ చేపట్టారు.

రెండు రాష్ట్రాలకు సమానంగా సింగరేణి మూలధనం
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా బొగ్గు, సహజ వాయువు, విద్యుత్‌ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ ఉంటుందన్న క్లాజ్‌ను తొలగించాలి. ఎందుకంటే... సమైక్య రాష్ట్ర వనరులతో సింగరేణి కాలరీస్‌ అభివృద్ధి జరిగింది. ప్రస్తుత మార్కెట్‌ విలువకు అనుగుణంగా దాని విలువను అంచనా వేసి పంపిణీ చేయాలి. దురదృష్టవశాత్తు అలాంటి విషయం బిల్లులో ప్రస్తావించలేదు. పైగా కోల్‌ ఇండియా ద్వారా ఇచ్చిన బొగ్గు లింకేజీలను కేంద్ర ప్రభుత్వం గౌరవించడం లేదు. ఈ కారణంగానే గత కొన్ని సంవత్సరాల నుంచి సింగరేణి ఆ అగాథాన్ని పూడ్చగలుగుతోంది. బొగ్గు లింకేజీపై కోల్‌ ఇండియా నుంచి ఖచ్చితమైన హామీ ఇవ్వకుండా, తగిన పరిహారం కూడా ఇవ్వకుండా 51 శాతమున్న రాష్ట్ర ప్రభుత్వ మూలధనాన్ని పూర్తిగా తెలంగాణకు బదిలీ చేయడం నిర్హేతుక నిర్ణయమవుతుంది. అందువల్ల దీన్ని ఉపసంహరించుకోవాలి. 51వ శాతం మూలధనాన్ని కొత్తగా ఏర్పడే రెండు రాష్ట్రాలకు బదిలీ చేయాలి.

ఆయకట్టు లేదా జనాభా ప్రాతిపదికన జలవిద్యుత్‌!
జల విద్యుత్‌లోను అరకొర నిర్ణయమే. జల విద్యుత్‌ ప్రాజెక్టులు అవి ఉన్న భూభౌతిక ప్రాంతాలను తీసుకుని ఎలా కేటాయిస్తారనే విషయమై బిల్లులో స్పష్టత లేదు. అందువల్ల అన్ని జల విద్యుత్‌ కేంద్రాల నిర్వహణకు ఒక అధీకృత సంస్థ ఉండాలి. ఉత్పత్తి అయ్యే జల విద్యుత్‌ను ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టు లేదా జనాభా లేదా గాడ్గిల్‌ ఫార్ములాకు అనుగుణంగా పంపిణీ చేయాలి. కేంద్ర విద్యుత్‌ ప్రాజెక్టుల విద్యుత్‌కు సంబంధించి కూడా జాతీయ విధానంగా చెబుతున్న గాడ్గిల్‌ ఫార్ములానే అనుసరించాలి. కేంద్రం తన విధానాన్నే ఎందుకు గౌరవించలేదో అర్థం కావడంలేదు. ఉక్కు కర్మాగారం, ఫెర్రో అల్లాయ్స్‌ పరిశ్రమలను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎన్టీపీసీ-సింహాద్రి అవశేష రాష్ట్రానికే ఉండాలి.

కేంద్రానికి అధికారం లేదు
విద్యుత్‌ విషయంలో కొత్తగా ఏర్పడే రాష్ట్రాలతో సంప్రదించి తదనుగుణంగా కేంద్రం ఆదేశాలు ఇవ్వాలన్న 69వ క్లాజ్‌ను తొలగించాలి. ఎందుకంటే... ఇది రాష్ట్ర అధికారాన్ని కేంద్రం చేతుల్లోకి తీసుకోవడమే. ఫెడరల్‌ రాజ్యాంగంలో నీరు, విద్యుత్‌ విషయంలో కేంద్రం ఆదేశాలు ఇవ్వలేదు.

గవర్నర్‌ అధికారం చెల్లదు
ఉమ్మడి రాజధానిలో ప్రజలకు రక్షణ కల్పించే బాధ్యత గవర్నర్‌ది అనే 8 (1 నుంచి4) క్లాజ్‌ను రద్దు చేయాలి. ఎందుకంటే... ఉమ్మడి రాజధానిలో శాంతిభద్రతలు, అంతర్గత భద్రత తదితరాల బాధ్యత ఈ క్లాజ్‌ ద్వారా గవర్నర్‌కు ఉంటుంది. కానీ ఈ విషయాలు శాసనవ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ పరిధిలోకి వస్తాయి. రాష్ట్రాల అధికారాలను కేంద్రం చేతిలోకి తీసుకున్నట్లే.

పోలవరం ప్రాజెక్టుపై...:
క్లాజు 9-90 (2, 3)లో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తున్నట్లు పేర్కొన్న క్లాజును రద్దు చేయాలి. ఎందుకంటే... గోదావరి వాటర్‌ డిస్ప్యూట్స్‌ ట్రైబ్యూనల్‌ (జీడబ్యూడీటీ) పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన అన్ని సాంకేతిక అనుమతులు ఇచ్చింది. సుప్రీంకోర్టు 1992లో ఏఐఆర్‌ ఎస్‌సీ 522లోని పేజీ 544, పేరా 11లో అంతర్‌ రాష్ట్ర నదులపై నియంత్రణ, అభివృద్ది అంశాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి రావని తేల్చి చెప్పింది. దీంతోపాటు రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్‌లో కూడా నదీ పరివాహక రాష్ట్రానికే నీటి నిల్వ చేసుకునే హక్కుందని చెప్పింది. పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ, పునరావాసం తదితర కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం సొంతంగా ఇప్పటికే చేపట్టింది. నిధులు ఖర్చు చేసింది.రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వ జోక్యం వద్దు. నిర్మాణానికి అవసరమైన ఆర్ధిక సహాయం చేస్తే చాలు. ప్రాజెక్టు కట్టుకునే అధికారం రాష్ట్రానికి ఉంది. ప్రాజెక్టుపై అజమాయిషీ చేయాల్సిన అవసరమే లేదు.

మౌలిక వసతులకు నిధుల మాటే లేదు
13వ షెడ్యూల్‌-93లో విభజన తర్వాత ఇరు ప్రాంతాల్లో మౌలిక వసతుల గురించి ప్రస్తావించారు. ఈ క్లాజులో ఎయిమ్స్‌, గిరిజన, ఉద్యాన విశ్వవిద్యాలయం, దుగరాజపట్నం పోర్టు, రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీ వంటివాటిని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ క్లాజును రద్దు చేయాలి. ఎందుకంటే... ఈ మౌలిక వసతులను ఎంత కాలంలో ఏర్పాటు చేస్తారో బిల్లులో చెప్పలేదు. అలాగే వీటి ఏర్పాటుకు నిధులను ఎలా సమకూరుస్తారో కూడా పేర్కొనలేదు. ఇచ్చిన హామీ చూస్తే ఉత్తుత్త హామీగా కనపడుతోంది.

371(డి)ని సవరించాల్సిందే..
క్లాజు 12-96, 97లను రద్దు చేయాల్సిందే. ఎందుకంటే... విద్య, ఉద్యోగాలకు సంబంధించి 371(డి), 168 అధికారణలను సవరించకుండా విభజన కుదరదు. రాజ్యాంగంలోని 3, 4వ అధికరణల కిందకు తేవడం కుదరదు. రాజ్యాంగంలోని 368 అధికరణ ప్రకారమే వీటిని సవరించాలి.

ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ బిల్లునే సవరించాలి: సీమాంధ్ర తెదేపా
తెలుగుదేశం సీమాంధ్ర ఎమ్మెల్యేలు 43 మంది వేర్వేరుగా బిల్లులోని 108 క్లాజులను తీసేయాలంటూ ప్రతిపాదనలు ఇచ్చారు. నాలుగు షెడ్యూళ్లలో కూడా సవరణ ప్రతిపాదనలు చేశారు. దాదాపుగా బిల్లులోని క్లాజులన్నింటినీ తీసేయాలంటూ వీరు సవరణల రూపంలో డిమాండ్‌ చేశారు. అన్ని క్లాజులు తీసేస్తే ఇక బిల్లులో ఏమీ ఉండదనేది తెదేపా సీమాంధ్ర ఎమ్మెల్యేల వ్యూహం! ఉదాహరణకు మొదటి క్లాజులో ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు అని ఉంటే...దాన్ని తొలగించాలంటూ సవరణ ప్రతిపాదన ఇచ్చారు. మొత్తం అన్ని క్లాజులను ఇలానే తీసేయాలంటూ సవరణ ప్రతిపాదనలు చేశారు.
ఆంధ్రప్రదేశ్‌ సమగ్రాభివృద్ధి బిల్లుగా మార్చాలి: సీపీఎం
ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ బిల్లు పేరును ఆంధ్రప్రదేశ్‌ సమగ్రాభివృద్ధి బిల్లుగా మార్చాలని కోరుతూ సీపీఎం సభ్యుడు జూలకంటి రంగారెడ్డి సవరణ ఇచ్చారు. సీమాంధ్ర మంత్రుల్లో మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌ విడిగా సవరణ ఇస్తూ అవశేష ఆంధ్రప్రదేశ్‌ పేరును ‘తెలుగునాడు’’ రాష్ట్రంగా పిలవాలని సూచించారు. నియోజక వర్గాల పునర్విభజనకు 2011 ఎస్సీ, ఎస్టీ జనాభాను ప్రాతిపదికగా తీసుకోవాలన్నారు. సీనియర్‌ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి అసెంబ్లీ స్థానాల్ని సీమాంధ్రలో 200, తెలంగాణలో 153కి పెంచాలని సవరణ ప్రతిపాదించారు. మంత్రి వట్టి వసంతకుమార్‌ తన స¾వరణలో పోలవరం ప్రాజెక్టును ప్రత్యేకంగా ప్రస్తావించారు. తెలంగాణకు చెందిన ఎస్టీ ఎమ్మెల్యేలు వేరుగా అభిప్రాయం తెలియజేశారు. తెలంగాణ కాంగ్రెస్‌లో ఇద్దరు ఎమ్మెల్యేలు మినహా అందరూ తమ అభిప్రాయాలను సభాపతికి సమర్పించారని మంత్రి కె.జానారెడ్డి తెలిపారు. సభాపతి అనుమతి తీసుకుని వారు కూడా పత్రాలిస్తారని వెల్లడించారు. సీపీఐ 32, లోక్‌సత్తా 12, భాజపా 10, ఎంఐఎం 15 సవరణలు ప్రతిపాదించాయి. కాంగ్రెస్‌, తెలుగుదేశం సభ్యులు ప్రాంతాల వారీగా ఇవ్వడంతో సభాపతి ఆదేశం మేరకు... అందిన వాటిని క్రోడీకరించే పనిలో శాసనసభ కార్యదర్శి రాజా సదారామ్‌ నిమగ్నమయ్యారు. సలహాలు, సవరణలు ఎన్ని అందాయనే విషయమై ఈనెల 17 నాటికి ఒక స్పష్టత రాగలదని భావిస్తున్నారు.
- ఈనాడు, హైదరాబాద్‌

మా వూరికి మంచి నీళ్లు...

బాగా ఆస్తిపాస్తులున్న వాళ్లని శ్రీమంతులంటారు.మహేశ్‌బాబు నటించిన ‘శ్రీమంతుడు’ చూశాక ఆ అర్థం మారిపోయిందనే చెప్పవచ్చు. ఎక్కడ పెరిగినా, స్థిరపడినా సొంతూరి...

ఎన్టీఆర్‌ ‘దండయాత్ర’కు ఏడాది..!

‘ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం.. అదే ఒక్కడు మీదడిపోతే.. దండయాత్ర.. ఇది దయా గాడి దండయాత్ర’. పవర్‌ఫుల్‌ డైలాగులతో ఎన్టీఆర్‌ తెలుగు సినీ సెల్యులాయిడ్‌పై చేసిన దండయాత్రకు ఫిబ్రవరి 13తో ఏడాది పూర్తైంది. ‘వన్‌ ....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net