Sat, February 06, 2016

Type in English and Give Space to Convert to Telugu

'గులాబీ.. సునామీ''మాట నిలబెట్టుకుంటాం''నౌకా సంరంభం నేడే''కక్షతోనే పార్లమెంటులో రగడ!''వ్యూహాత్మక విజయం''ఆఖర్లో వచ్చారు.. అదరగొట్టారు!''సమర సేనాని''పర్యాటకులకు మణిహారం''ముద్రగడ ఆమరణ దీక్ష''హైదరాబాద్‌లో మరో రెండు పెద్దాసుపత్రులు'
అలీబాబా.. రూ.56,000 కోట్లు
చైనా ఇ-కామర్స్‌ సంస్థ అమ్మకాల రికార్డు
గంటలో రూ.12,000 కోట్ల విక్రయాలు
43 శాతం మొబైల్‌ లావాదేవీలే
అందుబాటులో 27000కు పైగా బ్రాండ్లు
షాంఘై
-కామర్స్‌ దిగ్గజం అలీబాబా ఆన్‌లైన్‌లో రికార్డు విక్రయాలను సాధించింది. సోమవారం చైనాలో ‘సింగిల్స్‌ డే’ షాపింగ్‌ బొనాంజాలో తొలి గంటలోనే 2 బిలియన్‌ డాలర్ల విలువైన వస్తువులను విక్రయించింది. గతేడాది ఇదే సమయం ఇదే బొనాంజాలో రోజు మొత్తం మీద కంపెనీ 5.8 బిలియన్‌ డాలర్ల విక్రయాలను సాధించగా.. అందులో ఈ గంట విక్రయాలే మూడోవంతు కావడం గమనార్హం. ఇక రోజు మొత్తం మీద 9.34 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.56,000 కోట్లు) విక్రయాలు అధిగమించడం గమనార్హం. అందులో 42.6 శాతం లావాదేవీలు మొబైల్‌ ద్వారా చేసినవే. మరో పక్క ఇప్పటికే 25 బిలియన్‌ డాలర్లతో ఎనిమిది వారాల కిందట న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలో లిస్టింగ్‌ రికార్డునూ సొంతం చేసుకుంది.

సింగిల్స్‌ డే అంటే: నవంబరు 11న ఎక్కువ ఒకట్లు(11.11.) వస్తాయి కాబట్టి ఆ రోజున ‘సింగిల్స్‌ డే’ పేరిట 2009 నుంచీ అలీబాబా ఈ భారీ స్థాయి డిస్కౌంట్లను ప్రకటిస్తోంది. అమెరికాలోని సైబర్‌ మండే, బ్లాక్‌ ఫ్రైడేల తరహాలోనే ఇదీ సాగుతుంది. గతేడాదిలోనే సింగిల్స్‌ డే.. ఇతర ప్రధాన షాపింగ్‌ పండుగలను(అమెరికాలో జరిగే) అధిగమించింది. థాంక్స్‌ గివింగ్‌ డే, బ్లాక్‌ ఫ్రైడే, సైబర్‌ మండే.. ఈ మూడూ కలిసి కూడా గతేడాది 3.7 బిలియన్‌ డాలర్ల విక్రయాలను నమోదు చేశాయని ఇంటర్నెట్‌ అనలిటిక్స్‌ సంస్థ కామ్‌స్కోర్‌ వెల్లడించింది. చైనాలో ‘సింగిల్స్‌ డే’ను ‘యాంటీ వాలెంటైన్స్‌ డే’గా పిలుస్తారు. ఈ ఏడాది దీనిని అంతర్జాతీయంగా విస్తరించారు.

ఇవీ విశేషాలు.. : తొలి గంట 12 సెకన్లలోనే 2 బిలియన్‌ డాలర్ల కంటే ఎక్కువ డీల్స్‌ జరిగాయి.
* ఈ ఏడాది సింగిల్స్‌ డేలో 27,000కు పైగా బ్రాండ్లు, కంపెనీలు పాల్గొన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 220 దేశాల్లోని వినియోగదార్లు ఈ 24 గంటల షాపింగ్‌ పండుగలో పాల్గొన్నారు.
* 18 నిమిషాల కంటే తక్కువ వ్యవధిలోనే 1 బిలియన్‌ డాలర్ల వ్యాపారాన్ని చేరడం విశేషం.
* సింగిల్స్‌ డే పండుగలో చైనాకు చెందిన జియోమి టెక్నాలజీ కో. ఏకంగా 10 లక్షలకు పైగా హ్యాండ్‌సెట్లను విక్రయించింది.
* చైనాలో అతిపెద్ద ఇ-కామర్స్‌ కంపెనీ అయిన అలీబాబా తన రిటైల్‌ వెబ్‌సైట్‌ ‘టి-మాల్‌’, ‘తౌబా’ ద్వారా ఈ విక్రయాలు జరుపుతుంది. చైనా బయట అలిఎక్స్‌ప్రెస్‌, టిమాల్‌ గ్లోబల్‌ సర్వీసెస్‌ ద్వారా విక్రయాలు జరుపుతుంది.

జీన్స్‌ ప్రభ!

కొన్నిరోజులు వాడగానే జీన్స్‌ బిగుతైపోతాయి. అలాగని వాటిని పారేయలేం. ఎందుకంటే చూడ్డానికేమో కొత్తగా ఉంటాయి. అలాంటి జీన్స్‌నే రీసైకిల్‌ చేసి కొత్త ఉత్పత్తులుగా మార్కెట్‌లోకి...

మనసంతా పొరుగు కథలపైనే!

మహేష్‌బాబు లాంటి ఒకరిద్దరు కథానాయకులు తప్ప దాదాపుగా మిగిలిన తెలుగు హీరోలందరూ రీమేక్‌ చిత్రాలపై మోజు ప్రదర్శించేవాళ్లే. పొరుగు భాషలో ఒక మంచి సినిమా...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net