Tue, February 09, 2016

Type in English and Give Space to Convert to Telugu

'ఔషధనగరిలో ప్రపంచశ్రేణి విశ్వవిద్యాలయం''భూసేకరణ, పునరావాసాలకేరూ. 8,000 కోట్లు''నెట్‌ సమానత్వానికే ట్రాయ్‌ మొగ్గు!''ముద్రగడ దీక్ష విరమణ''తెలంగాణ ప్రణాళిక భేష్‌''విద్వేషాలు రెచ్చగొడుతూ రాజకీయాలా?''డాక్టర్‌.. ధనాధన్‌..''రసాయన పరిశ్రమలో పేలుడు''నడి వీధిలో పైశాచికం''పాక్‌ నుంచే కుట్ర'
సంచుల్లో చౌకబియ్యం
తూకంలో మోసాలకు అడ్డుకట్ట
జనవరి నుంచి ప్రారంభించే అవకాశం
ఈనాడు - చిత్తూరు
చౌక దుకాణాల ద్వారా ప్రజలకు అందించే బియ్యం తూకంలో మోసాన్ని నియంత్రించేందుకు అధికారులు ప్రభుత్వానికి ప్రత్యేక ప్రతిపాదనలు పంపారు. వీటి ప్రకారం.. చౌకదుకాణం వద్ద వినియోగదారులకు బియ్యాన్ని తూకం వేసి కాకుండా 4, 8, 16, 20 కిలోల సంచుల్లో ఇస్తారు. ఈ సంచులను సీల్‌ చేసి ఉంటుంది కనుక వాటి బరువులో తేడా రాదు. ఈ ప్రతిపాదనకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆమోదం తెలిపితే వెంటనే అమల్లోకి రానుంది. జనవరి నుంచి ఈ విధానం అమల్లోకి వచ్చే అవకాశముంది. ఇప్పటి వరకూ హమాలీల నుంచి రేషన్‌డీలర్ల వరకూ చాలా మంది చౌకబియ్యం తూకంలో మోసాలకు పాల్పడేవారు. దీంతో లబ్ధిదారులకు బియ్యం తూకంలో ఎంతో కొంత తేడా వచ్చేది. తెదేపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వివిధ శాఖల్లో జరిగే అవినీతిపై ఉక్కుపాదం మోపుతోంది. ఇందులో భాగంగా పౌరసరఫరాల శాఖలో జరిగే అక్రమాలకు చరమగీతం పాడేలా సంచుల్లో బియ్యం ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. తెల్లకార్డులో ఉన్న వ్యక్తులను బట్టి 4, 8, 16, 20 కేజీల సంచులు ఇవ్వాలని భావిస్తున్నారు. ఒక వేళ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆహారభద్రత విధానం అమల్లోకి వస్తే ప్రతి వ్యక్తికీ 5 కేజీల బియ్యం ఇస్తారు. అప్పుడు 5, 10, 15, 20 కేజీల బియ్యం వచ్చేలా సంచులు తయారు చేస్తారు. ముఖ్యమంత్రి సింగపూర్‌ నుంచి వచ్చిన తరవాత ఈ కొత్త విధానానికి ఆమోదం తెలిపితే అమలులోకి వస్తుంది. ఈ శాఖ మంత్రి పరిటాల సునీత కొత్త నిర్ణయంపై సుముఖంగా ఉన్నట్లు సమాచారం. బుధవారం జిల్లాల పౌరసరఫరాల శాఖాధికారులతో ఆ శాఖ కమిషనర్‌ రాజశేఖర్‌ వీడియో సమావేశం నిర్వహించినపుడు కూడా ఈ అంశంపై చర్చించారు.

పదుగురి కోసం ఆరుగురం!

కాలేజీ స్నేహితులకో వాట్స్‌యాప్‌ గ్రూప్‌ చిన్నప్పటి మిత్రులకో ఫేస్‌బుక్‌ గ్రూప్‌ బంధువులందరినీ కలిపేందుకు గూగుల్‌ ప్లస్‌.. ఇలా నేటి సామాజిక మాధ్యమాలని మస్తుగా వాడుకుంటోంది...

పచ్చబొట్టేసి...జోలీకి నచ్చేసి!

ఏంజెలీనా జోలీకి రెండంటే మహా ఇష్టం. ఒకటి పిల్లలు, రెండు టాటూలు. ముగ్గురు కన్నబిడ్డలతో పాటు మరో ముగ్గురు అనాథలను దత్తత తీసుకుని పెంచుకుంటోంది జోలీ...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net