Sat, February 06, 2016

Type in English and Give Space to Convert to Telugu

'గులాబీ.. సునామీ''మాట నిలబెట్టుకుంటాం''నౌకా సంరంభం నేడే''కక్షతోనే పార్లమెంటులో రగడ!''వ్యూహాత్మక విజయం''ఆఖర్లో వచ్చారు.. అదరగొట్టారు!''సమర సేనాని''పర్యాటకులకు మణిహారం''ముద్రగడ ఆమరణ దీక్ష''హైదరాబాద్‌లో మరో రెండు పెద్దాసుపత్రులు'
పుత్రుడిదే మాట.. ఆడింది ఆట!
తితిదేలో ‘ప్రైవేటు’ హవా చక్రం తిప్పుతున్న అధికారి కొడుకు
దళారీ పాత్ర పోషిస్తున్న మరో చిరుద్యోగి
ఈనాడు, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో కొందరు ప్రైవేటు వ్యక్తుల హవా కొనసాగుతూనే ఉంది. ఒక అధికారి కుమారుడి జోక్యం శ్రుతి మించుతోంది. కొనుగోళ్ల నుంచీ దుకాణాల కేటాయింపుల వరకూ పలు అంశాల్లో ఆ అధికారి కొడుకు ఆదేశాల మేరకే అన్నీ సాగుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఆయా పనులను చక్కబెట్టడానికి అధికారి కొడుకుకు తితిదేకు చెందిన ఒక చిరుద్యోగి మార్గదర్శనం చేస్తున్నారనే విమర్శలున్నాయి.

* తితిదేకు కావాల్సిన చక్కెరను ఎంఎస్‌టీసీ సహకారంతో ఆన్‌లైన్‌ టెండర్ల ద్వారా కొనుగోలు చేస్తుంటారు. గతేడాది ఇదే విధంగా దాదాపు రూ.25 కోట్ల విలువ చేసే చక్కెర కొనుగోలుకు టెండర్లు పిలిచారు. దీనిలో ఒక వ్యాపారి టెండరు దక్కించుకున్నారు. కేవలం ఉత్పత్తిదారులకు మాత్రమే సరఫరా ఉత్తర్వులు ఇవ్వాలని తితిదే కొనుగోళ్ల సంఘం తేల్చి చెప్పింది. ఆ వ్యాపారి టెండరు రద్దు చేయాలని కూడా సిఫార్సు చేసింది. ఆ సిఫార్సులు బుట్టదాఖలు చేసి అదే వ్యాపారి నుంచి రూ.10 కోట్ల విలువైన చక్కెరను నాలుగు నెలల పాటు తీసుకోవడం గమనార్హం. వాస్తవానికి టెండరు ఖరారయ్యే సమయానికి ఉత్పత్తిదారుల వద్ద కిలో చక్కెర రూ.26 ఉండగా రూ.31కి కొనుగోలు చేయడం గమనార్హం. ఈ అంశంలో అధికారి కొడుకు నిర్ణయాల మేరకే కొనుగోళ్లు జరిగాయనే ఆరోపణలున్నాయి.

* తితిదే కల్యాణకట్టలకు అవసరమయ్యే బ్లేడ్లను టెండర్ల ద్వారా కొనుగోలు చేస్తారు. ఇవి కూడా ఉత్పత్తిదారుల నుంచే కొనుగోలు చేయాలని నిర్ణయించారు. బ్రహ్మోత్సవాల సమయంలో తాత్కాలికంగా వీటిని పెద్దఎత్తున కొనుగోలు చేయడం వివాదాస్పదమైంది. గతంలో తిరస్కారానికి గురైన సంస్థ నుంచే కొనుగోలు చేయడం విమర్శలకు తావిచ్చింది. దీనిలోనూ అధికారి కొడుకు ఆదేశాల మేరకే నిర్ణయాలు జరిగాయనే ఆరోపణలున్నాయి.

* తిరుమల రాంబగీచా వద్ద ఉన్న కొన్ని దుకాణాలను భద్రతా కారణాల రీత్యా తొలగించారు. అక్కడి దుకాణదారులకు తిరుమలలో మరో చోట దుకాణాలు కేటాయించాల్సి వచ్చింది. కొందరికి ప్రాధాన్యం లేని చోట దుకాణాలు కేటాయించడంతో వ్యతిరేకతలు మొదలయ్యాయి. ఇదే క్రమంలో ఒక చిరుద్యోగి తెరవెనుక కథ నడిపించాడు. ముందటి కేటాయింపుల తరువాత మార్పులు జరగడం, రెవెన్యూ విభాగం తీసుకున్న నిర్ణయాలు ఇక్కడ తారుమారు కావడం గమనార్హం.

జీన్స్‌ ప్రభ!

కొన్నిరోజులు వాడగానే జీన్స్‌ బిగుతైపోతాయి. అలాగని వాటిని పారేయలేం. ఎందుకంటే చూడ్డానికేమో కొత్తగా ఉంటాయి. అలాంటి జీన్స్‌నే రీసైకిల్‌ చేసి కొత్త ఉత్పత్తులుగా మార్కెట్‌లోకి...

మనసంతా పొరుగు కథలపైనే!

మహేష్‌బాబు లాంటి ఒకరిద్దరు కథానాయకులు తప్ప దాదాపుగా మిగిలిన తెలుగు హీరోలందరూ రీమేక్‌ చిత్రాలపై మోజు ప్రదర్శించేవాళ్లే. పొరుగు భాషలో ఒక మంచి సినిమా...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net