Tue, February 09, 2016

Type in English and Give Space to Convert to Telugu

'ఔషధనగరిలో ప్రపంచశ్రేణి విశ్వవిద్యాలయం''భూసేకరణ, పునరావాసాలకేరూ. 8,000 కోట్లు''నెట్‌ సమానత్వానికే ట్రాయ్‌ మొగ్గు!''ముద్రగడ దీక్ష విరమణ''తెలంగాణ ప్రణాళిక భేష్‌''విద్వేషాలు రెచ్చగొడుతూ రాజకీయాలా?''డాక్టర్‌.. ధనాధన్‌..''రసాయన పరిశ్రమలో పేలుడు''నడి వీధిలో పైశాచికం''పాక్‌ నుంచే కుట్ర'
కకావికలం..!

భారీ వర్షాలకు ఏపీలో 13 మంది మృతి
దాదాపు 200 చెరువులకు గండ్లు
కొట్టుకుపోయిన రహదారులు
రోడ్లపైనే వేల వాహనాలు, ప్రయాణికులు
నేడూ భారీ వర్షాలకు అవకాశం
చెన్నైలో ఇంకా వరద ముప్పు, 8 మంది మృతి
ఈనాడు, న్యూస్‌టుడే యంత్రాంగం
ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కుండపోత.. కుంభవృష్టి అనే పదాలు చిన్నబోయేలా నేల, నింగి ఏకమైనంతగా వర్షం ఏకధాటిగా కురుస్తునే ఉంది. వూళ్లు ఏరులయ్యాయి. రహదారులు ఉన్నపళంగా కొట్టుకుపోయాయి.. ఇప్పటికే వివిధ జిల్లాల్లో 13 మంది మృతి చెందారు. నాలుగు లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు అంచనా. రైళ్ల రాకపోకలకూ తీవ్ర అంతరాయం కలిగింది. పులిమీద పుట్రలా బుధవారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించడంతో జనం తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
నెల్లూరు, కడప, చిత్తూరు, ప్రకాశం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలు, తమిళనాడులోని చెన్నై చుట్టపక్కల ప్రాంతాలు వర్షాలకు చిగురుటాకుల్లా వణకుతున్నాయి. ఈ ప్రాంతాల్లో ఇప్పటికే భారీ ఎత్తున వర్షాలు కురిశాయి. చాలా కోట్ల ఇంకా వర్షం కొనసాగుతోంది. దీంతో ఎప్పుడు ఎటువైపు నుంచి ఎలాంటి ముప్పు పొంచుకొస్తుందోనని ఇక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మంగళవారం ఆంధ్రప్రదేశ్‌లో 13 మంది మృతి చెందారు. చెన్నైలో ఎనిమిది మంది చనిపోయారు. ఏపీలో దాదాపు 200 చెరువులకు గట్లుతెగాయి. జాతీయ రహదారి సహా 950 కిలోమీటర్ల మేర రోడ్లు ఛిద్రమయ్యాయి. వేల కొద్దీ బస్సులు, లారీలు, ఇతర వాహనాలు రోడ్లపైనే ఆగిపోయాయి. అందులో ప్రయాణికులు తిరిగి వెళ్లలేక.. గమ్యస్థానం చేరలేక తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. దాదాపు నాలుగు లక్షల ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లింది. ముంపు ప్రాంతాలు, వరదలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు విపత్తు నిర్వహణ దళాలు రంగంలోకి దిగాయి. వర్షం కురుస్తూనే ఉండటం.. వరద పెరగడంతో చాలా చోట్ల సహాయకార్యక్రమాలూ చేపట్టలేని పరిస్థితి. ఇదిలా ఉంటే బుధవారం కూడా భారీ వర్షాలు కురుస్తాయనే సూచనలు అందాయి. కోస్తా, చిత్తూరు, కడప జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా. ఈనేపథ్యంలో చాలా అప్రమత్తంగా ఉండాలని సీఎంచంద్రబాబునాయుడు అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. చెన్నై నుంచి ఏపీ, ఇతర ప్రాంతాలకు వెళ్లే పలు రైళ్లు రద్దయ్యాయి. చాలావాటిని దారిమళ్లించారు. చెన్నైలో వర్షం తగ్గినా శివారు ప్రాంతాల్లో వరద ముప్పు కొనసాగుతోంది.

భారీ వర్షాలపై ప్రధానికి వివరించిన వెంకయ్య
ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలకు కలిగిన నష్టాలపై ప్రధాని మోదీకి కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు వివరించారు. ప్రధానితో ఫోన్‌లో సంభాషించిన వెంకయ్యనాయుడు నెల్లూరు, చిత్తూరు, కడప, ఉభయగోదావరి జిల్లాల్లో వర్ష బీభత్సం, పంటనష్టాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్‌, కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీలతోనూ వెంకయ్యనాయుడు వర్షాలపై చర్చించారు.

పదుగురి కోసం ఆరుగురం!

కాలేజీ స్నేహితులకో వాట్స్‌యాప్‌ గ్రూప్‌ చిన్నప్పటి మిత్రులకో ఫేస్‌బుక్‌ గ్రూప్‌ బంధువులందరినీ కలిపేందుకు గూగుల్‌ ప్లస్‌.. ఇలా నేటి సామాజిక మాధ్యమాలని మస్తుగా వాడుకుంటోంది...

ఆటో నడిపిన సినీనటుడు అఖిల్‌

సినీనటుడు అఖిల్‌ మంగళవారం ఖమ్మం నగరంలో ఆటో నడిపి సందడి చేశాడు. స్థానిక నరసింహస్వామి దేవాలయ సమీపంలో కిడ్నీ వ్యాధితో.....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net