Mon, February 08, 2016

Type in English and Give Space to Convert to Telugu

'కడలి వేదికగా కదన విన్యాసం''కల్తీల నుంచి కాపాడాలి''ఎస్సై కొలువులకు సై''వాట్సన్‌ @ రూ. 9.5 కోట్లు''హామీలు నెరవేర్చే వరకు దీక్ష''అన్నయ్యే వారసుడు..''ప్రజల మనసులు చూరగొంటూ..''సాగర జలాల్లో స్నేహబంధం''కాగిత రహిత టికెట్ల దిశగా రైల్వే''అనుమతి లేకుండా ప్రాజెక్టులు'
అత్యవసరంగా నొక్కేశారు!
పనులు చేయకుండానే చేసినట్లు చూపిన ఇంజినీర్లు
15 రోజుల్లో 600 పనులకు అనుమతి
ఆ వెంటనే బిల్లుల మంజూరు
తుంగభద్ర కాలువల మరమ్మతులో ఇదో మాయాజాలం
ఈనాడు - హైదరాబాద్‌
కేవలం 15 రోజులు.. 600కు పైగా పనులు... పరిపాలనా అనుమతులు రావటం... పనులు ప్రారంభించటం... పూర్తిచేయటం అన్నీ చకచకా జరిగిపోయాయి. ఆ వెంటనే బిల్లుల చెల్లింపులూ! భళా...మన అధికారులు ఎంత వేగంగా పని చేశారు?! ఇన్ని పనులు అంత తక్కువ సమయంలో చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది కదూ. నిజంగానే కాలువల మరమ్మతులు అంత వేగంగా జరిగి ఉంటే అధికారులను అభినందించాల్సిందే. కానీ...ఈ పనులన్నీ జరిగింది కాగితాల్లోనే. కొందరు ఇంజినీరింగ్‌ అధికారులు కుమ్మక్కై పనులు చేయకుండానే చేసినట్లుగా రికార్డులు సృష్టించి రూ.కోట్లు స్వాహా చేశారు. కాలువల మరమ్మతులు పూర్తి చేసి రైతుల భూములకు సక్రమంగా నీరందేలా చూడాల్సిన ఇంజినీర్లే నిధులను భోంచేసి అవినీతికి పాల్పడిన ఘటన తుంగభద్ర ప్రాజెక్టులో జరిగింది. ఇందులో ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహించిన ఓ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ కీలక సూత్రధారి కాగా, మరో పది మంది ఇంజినీర్లకు ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధం ఉన్నట్లు తెలిసింది. ఈ వ్యవహారం తుంగభద్ర బోర్డు ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో విచారణ చేపట్టినట్లు సమాచారం.

బడ్జెట్‌ తగ్గించినా ఆగని అక్రమాలు
తుంగభద్ర ప్రాజెక్టు పరిధిలో కాలువల మరమ్మతు కోసం ప్రతి ఏడాది రూ.కోట్ల నిధులను ఖర్చు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బడ్జెట్‌ కేటాయిస్తే.. ఖర్చు చేసిన తర్వాత కర్ణాటక తన వాటాను చెల్లించేది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తెలంగాణలు తమ వాటాను బట్టి నిధులను ఇస్తున్నాయి. కాలువల మరమ్మతు పేరుతో జరుగుతున్న అక్రమాలను పరిగణనలోకి తీసుకొని బడ్జెట్‌ను రూ.100 కోట్ల నుంచి రూ.50 కోట్లకు తగ్గించాలని సంబంధిత చీఫ్‌ ఇంజినీరు రెండేళ్ల క్రితం ప్రభుత్వానికి సూచించారు. అయితే, బడ్జెట్‌ను తగ్గించినా అక్రమాలు మాత్రం ఆగలేదు.

విజిలెన్స్‌ విచారణతో వెలుగులోకి...: ఈ ఏడాది జూన్‌లో అత్యవసరం పేరుతో భారీగా పనులు మంజూరయ్యాయి. తనకున్న అధికార పరిధిని అడ్డుపెట్టుకొని సుమారు 600కు పైగా పనులకు తుంగభద్ర దిగువ కాలువ(ఎల్లెల్సీ)లో ఇన్‌ఛార్జి ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ ఆ పనులకు అనుమతించారు. ఆయా పనులను చేయకుండానే చేసినట్లుగా కాగితాల్లో చూపించి నిధులు స్వాహా చేశారు. కాలువలకు నీటిని విడుదల చేసే ముందుగా పనులు చేపట్టి పూర్తి చేసినట్లు చూపించారు. ఆ వివరాలను ఎం.బుక్కులోనూ నమోదు చేశారు. కానీ, వాస్తవానికి అక్కడ పనులేవీ చేయనట్లు తేలింది. విజిలెన్స్‌ విచారణలో కొంత సమాచారం బయటకు పొక్కడంతో తుంగభద్ర బోర్డు అధికారులు రంగంలోకి దిగి లోతుగా దర్యాప్తు చేయడంతో అక్రమాల గుట్టు రట్టయ్యింది. డిప్యూటీ ఇ.ఇ.గా ఉంటూ ఇన్‌ఛార్జి ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహించిన జి.వి.ప్రసాద్‌తో సహా మొత్తం పది మంది ఇంజినీర్లకు ఇందులో సంబంధం ఉన్నట్లు బోర్డు వర్గాలు నిర్ధిరించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ ఇంజినీర్లపై చర్యకు బోర్డు సిఫార్సు చేసినా అమలు చేయాల్సింది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే.

జోరుగా పైరవీలు: ప్రజాప్రతినిధులు సిఫార్సు ఉన్న ఇంజినీర్లకే తుంగభద్ర బోర్డులో ఎక్కువుగా పోస్టింగులు లభిస్తుండటంతో పైరవీలు జోరుగా సాగుతున్నాయి. గుత్తేదారులు, ఇంజినీర్లు, ప్రజాప్రతినిధులకు తుంగభద్ర కాలువ పనుల మరమ్మతులు ఆదాయ వనరులుగా మారాయి. నాసిరకంగా పనులు చేసి నిధులు స్వాహా చేసే స్థాయి నుంచి చేయకుండానే బిల్లులు పొందే స్థితికి పరిస్థితి దిగజారినట్లు తాజాగా అధికారుల పరిశీలనలోనే తేటతెల్లమైంది.

మాధవన్‌ పళ్లురాలగొట్టాను..!

సినిమా కోసం ఉత్తుత్తినే కాదు.. నిజంగానే అంతపని చేసిందట రితిక. గత వారం విడుదలై సంచలన విజయం సాధించిన ‘సాలా ఖడూస్‌’ చిత్రం కథానాయిక. అప్పుడెప్పుడో పరుగుల రాణీ...

ఉప్పల్‌లో పరుగుల పండగ

మ్యాచ్‌ అంటే ఇదీ.. ఆడేది సినిమావాళ్లే అయినా, అంతర్జాతీయ మ్యాచ్‌కి ఏమాత్రం తీసిపోదు. టీ ట్వంటీలో ఉండే అసలైన మజా... మరోసారి తెలిసొచ్చింది....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net