Thu, February 11, 2016

Type in English and Give Space to Convert to Telugu

'హైదరాబాద్‌కు యాపిల్‌''కారెక్కిన ఎర్రబెల్లి''మేయర్‌ బొంతు రామ్మోహన్‌!''హనుమంతప్ప పరిస్థితి మరింత విషమం''భాగ్యనగరం తరహాలో ఖేడ్‌ అభివృద్ధి''మహా జాతరకు శ్రీకారం''ఓటుకు నోటు కేసులో మరో తెదేపా ఎమ్మెల్యే అరెస్టు?''ప్రయాణికులపై మళ్లీ వడ్డింపు?''గవర్నర్లు రాష్ట్రాలకు ఉత్ప్రేరకాలు''మహానగర అభివృద్ధికి 100 రోజుల ప్రణాళిక!'
ఉన్న చట్టాన్నే గాలికొదిలేశారు..!
జిల్లా విద్యాశాఖ పరిధిలోనే పూర్వ ప్రాథమిక పాఠశాలలు
జీవో నం.1లో సెక్షన్‌3 చెప్తున్నదిదే
తమకు సంబంధం లేదంటున్న డీఈవోలు
అనుమతుల్లేకుండానే వేలాది ప్లే స్కూళ్ల నిర్వహణ
ఈనాడు, హైదరాబాద్‌: పాఠశాలల నిర్వహణలో ఆ చట్టం, జీవోలను భగవద్గీతలాంటివని చెబుతారు. పాతికేళ్లకు పైగా వాటిలోని నిబంధనలనే ప్రామాణికంగా పరిగణిస్తున్నారు. అదే జీవోలోని ఓ అంశాన్ని మాత్రం ఇన్నేళ్లుగా విద్యాశాఖ విస్మరిస్తూనే ఉంది. ఆజీవో నంబరు 1.ఆ అంశం పూర్వ ప్రాథమిక విద్య. జీవోలోని మూడో సెక్షన్‌ ప్రకారం పూర్వ ప్రాథమిక పాఠశాలల నియంత్రణ బాధ్యత.. కచ్చితంగా జిల్లా విద్యాశాఖాధికారులదే. వారు మాత్రం ఆ బడులకు అనుమతులివ్వటం, నిర్వహణను పర్యవేక్షించటం.. తమ పరిధిలోనిదే కాదని తేల్చేస్తుండటాన్ని బట్టి చట్టం అమలుపై వారి చిత్తశుద్ధి తేటతెల్లమవుతోంది. హైదరాబాద్‌లోని సైదాబాద్‌లో చైతన్య స్టార్‌కిడ్స్‌ప్లేస్కూల్‌ లిఫ్టులో ఇరుక్కుని చిన్నారి జైనబ్‌ మృత్యువాత పడిన ఘటనపై హైదరాబాద్‌ డీఈవో సోమిరెడ్డి స్పందిస్తూ.. ప్లేస్కూళ్ల పర్యవేక్షణ తమ పరిధిలో లేదని చెప్పడం విమర్శలకు తావిచ్చింది.

అసలు చట్టం, జీవోలో ఏముంది..?
ఆంధ్రప్రదేశ్‌ విద్యాచట్టం(1982) ఉమ్మడి రాష్ట్రంలో 1987 జూన్‌1 నుంచి అమల్లోకి వచ్చింది. అలాగే 1994 జనవరి1 నుంచి జీవో ఎంఎస్‌ నం.1ని అమలుచేస్తున్నారు. పాఠశాలస్థాయి విద్యాసంస్థల నిర్వహణలో ఈ చట్టాన్నే ప్రామాణికంగా తీసుకొంటున్నారు. ఇటీవలి విద్యాహక్కు చట్టంతోపాటు దీనిలోని నిబంధనల మేరకే విద్యాశాఖ విధులు నిర్వర్తిస్తోంది. దీని ప్రకారం..
* చాప్టర్‌ 1, సెక్షన్‌ 1.3 మేరకు ఉమ్మడి రాష్ట్ర్రంలోని అన్ని విద్యాసంస్థల నిర్వహణకు ఈ చట్టంలోని నిబంధనలు వర్తిస్తాయి.

* చాప్టర్‌ 1, సెక్షన్‌ 2లోని సబ్‌క్లాజ్‌ 32(ఎ) మేరకు పూర్వ ప్రాథమిక విద్య అనేది ప్రాథమిక తరగతులకు ముందు నిర్వహించేది. నర్సరీ, కిండర్‌గార్టెన్‌ మాంటెస్సోరి, అంగన్‌వాడీ, బాల్వాడీ.. వంటివి పూర్వప్రాథమిక విద్య కిందకు వస్తాయి.

* చాప్టర్‌ 3, సెక్షన్‌ 7లోని సబ్‌క్లాజ్‌ 2(ఎ) ప్రకారం మూడేళ్ల వయసుకు తక్కువ కాని పిల్లల్ని ఈ బడుల్లో చేర్పించుకోవచ్చు.

* చాప్టర్‌ 6, సెక్షన్‌ 20 క్లాజ్‌4 మేరకు ఈ చట్టం పరిధిలో లేకుండా ఏ విద్యాసంస్థనూ నిర్వహించేందుకు వీల్లేదు. అతిక్రమిస్తే ఆర్నెల్లకు తక్కువ కాకుండా సాధారణ జైలుశిక్షకు అర్హులు.

* జీవో నం.1లోని సెక్షన్‌1 - క్లాజ్‌ 2(ఎ) ప్రకారం విద్యాచట్టం:1982ను అనుసరించి 3-5 ఏళ్లలోపు పిల్లలను ప్లేస్కూళ్లలో చేర్పించొచ్చు.

* సెక్షన్‌.3 ప్రకారం జిల్లా విద్యాశాఖాధికారులే ఈ పాఠశాలలను పర్యవేక్షించాల్సి ఉంటుంది.

ఎవరి ఇష్టం వారిది!
పూర్వ ప్రాథమిక విద్య పాఠశాలలపై నియంత్రణ విషయంలో విద్యాశాఖ యంత్రాంగం చేతులెత్తేయడంతో నిర్వాహకులది ఇష్టారాజ్యంగా మారింది. ముఖ్యంగా హైదరాబాద్‌ పరిధిలో గల్లీకో పాఠశాల వెలిసింది. కొన్ని సంస్థల యాజమాన్యాలైతే గొలుసుకట్టు పాఠశాలలను తెరిచి తోచినట్లుగా వ్యవహరిస్తున్నాయి. వీటిల్లో ప్రవేశరుసుమును రూ.5000 నుంచి 50వేలకు మించి గుంజుతున్నా సౌకర్యాల కల్పనలో మాత్రం నిబంధనల్ని గాలికొదిలేశాయి. వాస్తవానికి ప్లేస్కూళ్లను తప్పనిసరిగా కింద(గ్రౌండ్‌ఫ్లోర్‌లో)నే నిర్వహించాల్సి ఉన్నా.. రెండు, మూడు అంతస్తుల్లో ఉండటం పిల్లల ప్రాణాలతో చెలగాటమాడే పరిస్థితిని తెచ్చింది. మరోవైపు ఈ పాఠశాలల్లో లిఫ్టులుండటానికి నిబంధనలు అంగీకరించకున్నా ఇష్టారాజ్యం నడుస్తోంది. జంటనగరాల్లోనే ఈ పాఠశాలలు రెండు వేలకుపైగా ఉంటాయని అంచనా. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ పాఠశాలల నిర్వహణ విషయంలో నిబంధనల అమలును కఠినతరం చేయాలని హైదరాబాద్‌ స్కూల్‌ పేరెంట్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు ఆశిష్‌, విక్రాంత్‌ డిమాండ్‌ చేశారు. మరోవైపు వీటి నిర్వహణలో విధివిధానాలు ప్రకటించాలని గురువారం కార్పొరేట్‌ విద్యాసంస్థల బంద్‌కు ఏబీవీపీ పిలుపునిచ్చింది.

ప్రభుత్వంలో కదలిక..
సైదాబాద్‌ ఘటనతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. పాఠశాల విద్యాశాఖ, మహిళా శిశుసంక్షేమశాఖల అధికారులు చర్చించి ఈ సమస్యకు పరిష్కారం సూచించాలని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి రంజీవ్‌ ఆచార్య ఆదేశించారు. ఈక్రమంలో పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు కిషన్‌ అధికారులతో బుధవారం చర్చించారు. ప్లేస్కూళ్లకు అనుమతులు ఎవరివ్వాలి? అనుసరించాల్సిన నిబంధనలు, మార్గదర్శకాలు ఏమిటి?.. వంటి అంశాలపై ఆయన అభిప్రాయాలు తీసుకున్నారు.

నీళ్ల సీసాలపై మీ పేర్లు!

‘మంచి వ్యాపారవేత్త కావాలంటే ఎంబీఏలే చదవాల్సిన అవసరంలేదు. సామాజిక చొరవ ఉంటే చాలు! చక్కటి ఆలోచనతో ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేకుండా ఈ ఏడాదిన్నరలో రెండు...

వెండితెరపై కోట్ల ‘కాంతి’

సినిమా అనేది కచ్చితంగా వ్యాపారమే. ఏ కథానాయకుడికి ఎంత మార్కెట్‌ ఉంది? అనే లెక్కలు ఎప్పుడూ అవసరమే. పెట్టిన ప్రతీపైసాకీ గ్యారెంటీ ఉందన్న నమ్మకం కుదిరిన...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net