Sun, February 07, 2016

Type in English and Give Space to Convert to Telugu

'కడలి వేదికగా కదన విన్యాసం''కల్తీల నుంచి కాపాడాలి''ఎస్సై కొలువులకు సై''వాట్సన్‌ @ రూ. 9.5 కోట్లు''హామీలు నెరవేర్చే వరకు దీక్ష''అన్నయ్యే వారసుడు..''ప్రజల మనసులు చూరగొంటూ..''సాగర జలాల్లో స్నేహబంధం''కాగిత రహిత టికెట్ల దిశగా రైల్వే''అనుమతి లేకుండా ప్రాజెక్టులు'
ఆయకట్టుకు ఆయువు పోశారు
లక్షిత చెరువుల కింద సాగు విస్తీర్ణం రెట్టింపు
నీటి సామర్థ్యం, దిగుబడి పెంపు
చేపల ఉత్పత్తిలోనూ భారీ వృద్ధి
తెలుగురాష్ట్రాల్లో ప్రపంచబ్యాంకు పథకం విజయవంతం
తాజా నివేదికలో వెల్లడి
ఈనాడు - హైదరాబాద్‌
ప్రపంచ బ్యాంకు నిధులతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చెరువుల అభివృద్ధి, నీటి వినియోగ సామర్థ్యం పెంపు, పంటల ఉత్పాదకత పెంచేందుకు చేపట్టిన పథకం విజయవంతమైంది. దీనిద్వారా నీటి వృథా నలభై శాతానికి తగ్గింది. ఆయకట్టులో సాగు విస్తీర్ణం రెట్టింపైంది. వరి ఉత్పాదకత 36 శాతం పెరిగింది. మొక్కజొన్న, వేరుసెనగ, సోయాబీన్‌, పొద్దుతిరుగుడు దిగుబడీ గణనీయంగా వృద్ధి చెందింది. గతంలో హెక్టారుకు 125 కిలోల చేపలు ఉత్పత్తయితే అది ఏకంగా 443 కిలోలకు పెరిగింది. ప్రజల భాగస్వామ్యంతో చెరువుల అభివృద్ధి కింద చేపట్టిన కార్యక్రమం సంతృప్తికరంగా సాగడం వల్లే ఇది సాధ్యమైందని ప్రపంచబ్యాంకు తన తాజా నివేదికలో పేర్కొంది.

ప్రపంచ బ్యాంకు నిధులతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చెరువుల అభివృద్ధిపై చేపట్టిన ఈ పథకం ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో అమలవుతోంది. మొత్తం 2,157 చెరువుల అభివృద్ధి చేపట్టారు. వీటిలో 1,829 చెరువుల పనులు పూర్తయ్యాయి. 2,16,164 హెక్టార్ల ఆయకట్టు కలిగిన 1,604 చెరువులను నీటి వినియోగదారుల సంఘాలకు అప్పగించినట్లు ప్రపంచబ్యాంకు పేర్కొంది. వచ్చే ఏడాది జులై ఆఖరుకు మొత్తం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నట్లు తెలిపింది. ఈ నెల 2 నుంచి 10వ తేదీ వరకు నల్గొండ, విశాఖపట్నం, శ్రీకాకుళం, నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాల్లో ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందం పర్యటించింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కృష్ణారావు, నీటిపారుదల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌, తెలంగాణ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాజీవ్‌శర్మ, నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌.కె.జోషిలతో పాటు ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికారి భాస్కర్‌దాస్‌గుప్తాతో సమావేశమై చర్చించింది. తాజాగా ఇందుకు సంబంధించిన నివేదికను అందజేసింది.

ఇవీ ఫలితాలు
‘‘పనులు చేపట్టిన చెరువుల కింద 40 శాతం ఆయకట్టు మాత్రమే సాగవుతుండడంతో 75 శాతానికి పెంచాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నాం. దీన్ని 80 శాతం వరకు సాధించాం. నిర్వహణకు తీసుకొన్న చర్యలతో నీటి వృథా 40 శాతం తగ్గింది. స్థానికంగా సాగు చేసే పంటలను ప్రోత్సహించడం, నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచడానికి చర్యలు తీసుకోవడం వల్ల ఇది సాధ్యమైంది. పంటల దిగుబడి, చేపల ఉత్పత్తిలో మంచి ఫలితాలు సాధించాం. వరి ఉత్పాదకత 36 శాతం, మొక్కజొన్న 65, వేరుసెనగ 75 శాతం పెరిగింది. రబీ వరి విస్తీర్ణంలో 4.5 శాతం పంటల మార్పిడి జరిగి మొక్కజొన్న, సోయాబీన్‌, పొద్దుతిరుగుడు, కంది సాగు చేశారు. 42,693 హెక్టార్ల విస్తీర్ణంలోని చెరువుల పరిధిలో 1,126 మత్స్య సహకార సంఘాలను అభివృద్ధి చేశాం. చేపల ఉత్పత్తి ద్వారా ఆదాయం హెక్టారుకు రూ.7,500 నుంచి రూ.27,300కు పెరిగింది. ఈ పథకం ద్వారా 17 శాతం మంది మహిళలకు నేరుగా లబ్ధి చేకూరింది’’ అని ప్రపంచబ్యాంకు తన నివేదికలో వెల్లడించింది.

వెలుగు వైపు నా అడుగులు...

బడిగంట కొట్టగానే పిల్లలందరూ బిలబిలమంటూ బయటకు పరుగుతీశారు. టీచర్లూ ఇంటిదారిపట్టారు. ఒకరిద్దరు తప్ప నిర్మానుష్యంగా మారిన ఆ బడిలో..

పరిశ్రమ వదిలి వెళ్లిపోదామనుకున్నా!

మానవీయ కోణాల్ని స్పృశిస్తూ సినిమాలు తీయడంలో దర్శకుడు మదన్‌ది ప్రత్యేక శైలి. మనిషి, మనసు, అనుబంధాల మధ్య సంఘర్షణల్ని ఆయన తెరపైకి తీసుకొచ్చే విధానం బాగుంటుంది.

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net