Sun, February 07, 2016

Type in English and Give Space to Convert to Telugu

'గులాబీ.. సునామీ''మాట నిలబెట్టుకుంటాం''నౌకా సంరంభం నేడే''కక్షతోనే పార్లమెంటులో రగడ!''వ్యూహాత్మక విజయం''ఆఖర్లో వచ్చారు.. అదరగొట్టారు!''సమర సేనాని''పర్యాటకులకు మణిహారం''ముద్రగడ ఆమరణ దీక్ష''హైదరాబాద్‌లో మరో రెండు పెద్దాసుపత్రులు'
బాలబడులపై ఇక పక్కాగా లెక్క..!
తేల్చే పనిలో పాఠశాల విద్యాశాఖ
వాటిని గుర్తించి నోటీసులు ఇవ్వాలని డీఈవోలకు ఆదేశం
1994 నాటి జీవో.1 అమలుపై దృష్టి
‘ఈనాడు’ కథనంతో కదిలిన యంత్రాంగం
ఈనాడు - హైదరాబాద్‌
ప్పటివరకు అనుమతి లేకుండా, తగిన వసతులు, భద్రత పట్టించుకోకుండా కొనసాగుతున్న పూర్వ ప్రాథమిక పాఠశాలలపై.. ఎట్టకేలకు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ దృష్టిసారించింది. ఎక్కడెక్కడ ఎన్ని ఉన్నాయి? మౌలిక వసతుల ఏ తీరున ఉన్నాయి.. వంటి అంశాలను గుర్తించి నోటీసులు జారీచేయాలని విద్యాశాఖ ఆయా జిల్లాల విద్యాశాఖాధికారులకు ఆదేశాలిచ్చింది. ‘ఉన్న చట్టాన్నే గాలికొదిలేశారు’ శీర్షికన గురువారం ‘ఈనాడు’ ప్రధానపత్రికలో కథనం రావడంతో అధికార యంత్రాంగం జీవో అమలుపై వేగంగా కదిలింది.

రాజధాని హైదరాబాద్‌లో ఓ ప్లేస్కూల్‌లో చదువుతున్న బాలిక లిఫ్టులో ఇరుక్కొని మృతిచెందిన విషయం తెలిసిందే. దీంతో అసలు బాలబడులపై నియంత్రణాధికారం ఎవరిదన్న ప్రశ్న తలెత్తింది. బాలబడుల పర్యవేక్షణ, నియంత్రణ పాఠశాల విద్యాశాఖకే ఉంటుందని..ఉమ్మడి రాష్ట్రంలో 1994లో జారీచేసిన జీవో.1లో ఆ విషయం స్పష్టంగా ఉందని ‘ఈనాడు’లో కథనం రావడంతో అధికారులు స్పందించారు. ఎక్కడెక్కడ బాలబడులున్నాయి? జీవో.1 ప్రకారం మౌలిక వసతులున్నాయా? ఆటస్థలం, ఖాళీ స్థలం ఉన్నాయా? గ్రౌండ్‌ఫ్లోర్‌లోనే నిర్వహిస్తున్నారా? ఎంత మంది పిల్లలున్నారు? తదితర విషయాలను గుర్తించి అనుమతుల కోసం నోటీసులు జారీచేయాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు కిషన్‌ ఆయా డీఈవోలకు ఆదేశాలిచ్చారు. తెలంగాణవ్యాప్తంగా సుమారు 4000కు పైగానే బాలబడులు ఉండొచ్చని అంచనా. వీటన్నింటి వద్ద అనుమతి ఫీజు వసూలుచేస్తే ప్రభుత్వానికి ఆదాయం కూడా సమకూరనుంది.

సవరణలకు విద్యాశాఖ ప్రతిపాదన: జీవోలో బాలబడులంటే కిండర్‌ గార్టెన్‌, నర్సరీ, మాంటిస్సోరి లాంటివని పేర్కొన్నారు. అంటే అక్కడ 3-5 సంవత్సరాల పిల్లలుండాలి. అనుమతికి రూ.25వేలు ఫీజు చెల్లించాలి. ఆనాడు జీవోలో లేకున్నా.. నేటి పరిస్థితులను బట్టి బాలబడుల్లో ఆయాలు ఉండాలని, భద్రతపరంగా ఎలక్ట్రానిక్‌ వస్తువులను దూరంగా ఉంచాలని ప్రతిపాదించాలని విద్యాశాఖ నిర్ణయించింది. వీటన్నింటిపై చర్చించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు కిషన్‌ తెలిపారు.

పూర్వ ప్రాథమిక విద్యకు డిమాండ్‌: ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు డీఎడ్‌, ఉన్నత పాఠశాలల్లోని వారికి బీఈడీ కోర్సు అర్హతగా ఉంది. బాలబడుల్లో ఉండేది 3-6 ఏళ్ల పిల్లలే కాబట్టి టీచర్లకు ప్రీ ప్రైమరీ విద్యను అర్హతగా నిర్ణయించాల్సి ఉంటుంది. అక్కడ పనిచేసే ఉపాధ్యాయులకు అర్హత నిబంధన విధిస్తే ఇంటర్‌స్థాయిలోని ఒకేషనల్‌ కోర్సులో పూర్వ ప్రాథమిక విద్య కోర్సుకు మళ్లీ ఆదరణ పెరిగే అవకాశం ఉంది.

జీన్స్‌ ప్రభ!

కొన్నిరోజులు వాడగానే జీన్స్‌ బిగుతైపోతాయి. అలాగని వాటిని పారేయలేం. ఎందుకంటే చూడ్డానికేమో కొత్తగా ఉంటాయి. అలాంటి జీన్స్‌నే రీసైకిల్‌ చేసి కొత్త ఉత్పత్తులుగా మార్కెట్‌లోకి...

బుల్డోజర్స్‌పై విజయం మాదే: అఖిల్‌

సినీతారల క్రికెట్‌ మ్యాచ్‌లకు అభిమానుల నుంచి విశేష స్పందన లభిస్తోందని తెలుగు వారియర్స్‌ జట్టుకు సారథ్యం వహిస్తున్న యువ కథానాయకుడు అఖిల్‌....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net