Sun, February 07, 2016

Type in English and Give Space to Convert to Telugu

'కడలి వేదికగా కదన విన్యాసం''కల్తీల నుంచి కాపాడాలి''ఎస్సై కొలువులకు సై''వాట్సన్‌ @ రూ. 9.5 కోట్లు''హామీలు నెరవేర్చే వరకు దీక్ష''అన్నయ్యే వారసుడు..''ప్రజల మనసులు చూరగొంటూ..''సాగర జలాల్లో స్నేహబంధం''కాగిత రహిత టికెట్ల దిశగా రైల్వే''అనుమతి లేకుండా ప్రాజెక్టులు'
పర్యటన ముగిసింది... ప్రస్థానం మొదలైంది
ఆస్ట్రేలియాతో సంబంధాల్లో కొత్త శకం
ఇక్కడ ప్రసంగించడం... శతకం కొట్టినట్లుంది
ప్రపంచకప్‌ క్రికెట్‌ తుదిపోరులో ఇరుదేశాలూ తలపడాలి
క్రీడా దౌత్యం నెరిపిన భారత ప్రధాని మోదీ
మెల్‌బోర్న్‌: భారత ప్రధాని నరేంద్ర మోదీ- ఆస్ట్రేలియా పర్యటనలో చివరిరోజైన మంగళవారం క్రికెట్‌ దౌత్యం నెరిపారు! రెండు దేశాలకూ ఈ క్రీడపై అమితాసక్తి ఉండడంతో తన పర్యటన బృందంలో క్రికెట్‌ దిగ్గజాలనూ చేర్చుకున్న ఆయన... ప్రతిష్ఠాత్మక మెల్‌బోర్న్‌ మైదానంలో మాటలతోనే ఫోర్లు, సిక్స్‌లు కురిపించారు. వాటితో క్రీడాపిపాసులైన ఆస్ట్రేలియన్ల మనసు దోచేసుకున్నారు. తన ప్రసంగాన్నీ రసవత్తరమైన క్రికెట్‌ పోటీతోనే సరిపోల్చుకున్నారు. శతకం కొట్టినట్లుగా ఉందని అన్నారు. వచ్చే ఏడాది ప్రపంచకప్‌ క్రికెట్‌ తుది పోటీలో మన రెండు దేశాలూ తలపడాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియా ప్రధానికి ఇచ్చిన కానుకల్లోనూ క్రికెట్‌ బంతుల్ని చేర్చారు. ఆతిథ్య దేశ ప్రధాని అబాట్‌ కూడా మోదీ ఆకాంక్షల్ని క్రికెట్‌ స్కోర్‌బోర్డుతో పోల్చి చెప్పడం విశేషం..!

‘నా పర్యటన ఈరోజుతో ముగుస్తుంది. కానీ మన రెండు దేశాల మధ్య సంబంధాల్లో నూతన శకం ఇప్పుడు మొదలవుతుంది.’ అని మోదీ పేర్కొన్నారు. ఆయన గౌరవార్థం చరిత్రాత్మక మెల్‌బోర్న్‌ క్రికెట్‌ మైదానం (ఎం.సి.జి.)లో ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్‌ మంగళవారం అరుదైన విందు ఇచ్చారు. రెండు దేశాల క్రికెట్‌ దిగ్గజాలైన సునీల్‌ గావస్కర్‌, కపిల్‌దేవ్‌, అలెన్‌ బోర్డర్‌, డీన్‌ జోన్స్‌ తదితరులు దీనికి హాజరయ్యారు. ఆస్ట్రేలియా క్రీడా సంస్కృతిని మోదీ అభినందించారు. తన పర్యటనలో ఘనమైన ఆతిథ్యాన్ని ఇచ్చిన దేశానికి కృతజ్ఞతలు తెలిపారు. అబాట్‌ భారత దేశానికి వచ్చిన కొద్దిరోజుల్లోనే తాను ఆస్ట్రేలియాకు రావడంపై కొందరు అడిగారనీ, తమ దేశానికి రావాల్సిందిగా టోనీ అడిగినప్పుడు కాదనలేనని తాను బదులిచ్చానని చెప్పారు. 161 ఏళ్ల చరిత్ర ఉన్న ఎం.సి.జి. మైదానంలో తాను ప్రసంగించడం... మెక్‌గ్రాత్‌, బ్రెట్‌లీ వంటి క్రీడాకారులపై వంద పరుగులు చేసినట్లుగా అనిపిస్తోందన్నారు. ‘ఇక్కడ జరిగే క్రీడాపోటీలను టీవీల ద్వారా వీక్షించడానికి శీతాకాలంలోనూ భారత క్రీడాభిమానులు ఉదయాన్నే నిద్రలేస్తారు. ఈ మైదానంలో భారత్‌ అద్భుతంగా రాణించలేకపోయిందని నాకు తెలుసు. అయితే 1985 ఛాంపియన్స్‌ ట్రోఫీని మాత్రం ఈ మైదానంలోనే మేం గెల్చుకున్నాం. గావస్కర్‌, కపిల్‌దేవ్‌ ఇప్పుడు ఇక్కడే ఉన్నారు’ అని మోదీ చెప్పారు. తానూ గుజరాత్‌ క్రికెట్‌ సంఘానికి నాయకత్వం వహించిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ మైదానం 2015 ప్రపంచకప్‌ తుది పోటీలకు వేదిక అవుతుందని, భారత్‌-ఆస్ట్రేలియా జట్లు ఆ పోటీల్లో తలపడాలని ఆకాంక్షించారు. మహాత్మాగాంధీ చరఖా నమూనాను, మూడు క్రికెట్‌ బంతుల్ని అబాట్‌కు బహుమతిగా మోదీ ఇచ్చారు. ఈ బంతులపై ఆయన, ప్రపంచ కప్‌ నెగ్గినప్పటి భారత్‌ క్రికెట్‌ జట్ల సారథులు-కపిల్‌దేవ్‌, ఎం.ఎస్‌.ధోని సంతకాలు చేశారు. భారత ప్రజల ఆకాంక్షలు క్రికెట్‌లో స్కోర్‌బోర్డు మాదిరిగా మోదీ ముందున్నాయనీ, వాటిని చేరుకునేందుకు ఆయన తపిస్తున్నారని అబాట్‌ కితాబిచ్చారు.

క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటు: క్రికెట్‌తో పాటు ఇతర రంగాల్లోనూ ఆస్ట్రేలియాకు నైపుణ్యం ఉందనీ, దాని నుంచి భారత్‌ నేర్చుకోదగ్గ అంశాలు అనేకం ఉన్నాయని మోదీ చెప్పారు. భారత్‌లో ఒక క్రీడా విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పడానికి ఇరుదేశాలూ అంగీకరించినట్లు వెల్లడించారు. ‘తన జీవితం, చుట్టూ ఉన్న పర్యావరణం మెరుగుపడ్డాయని ప్రతీ భారతీయుడూ భావించేలా భవిష్యత్తును నిర్మించాలనేది నా తపన. భారత ప్రజల సహకారంతో, మార్పును ఆకాంక్షిస్తున్న 80 కోట్ల యువ జనాభా ప్రతిభాపాటవాలతో దీనిని తప్పకుండా సాధించగలననే నమ్మకం నాలో ఉంది. గ్రామాల్లోనూ, నగరాల్లోనూ జీవన నాణ్యత ఒకే విధంగా ఉండేలా పరివర్తన తీసుకురావడానికి అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాం. 2031 నాటికి ప్రపంచంలో పట్టణ జనాభాలో 11% భారత్‌లోనే ఉంటుంది. ఆ స్థాయిలో పట్టణీకరణ జరుగుతోంది. 10 లక్షలు పైబడిన జనాభాతో ఇప్పటికే 50 నగరాలు భారత్‌లో ఉన్నాయి. పట్టణీకరణ అనేక అవకాశాలను కల్పిస్తుంది. 100 స్మార్ట్‌ సిటీల అభివృద్ధి, సాంస్కృతిక వారసత్వం ఉన్న నగరాల పునరుద్ధరణ, ఘన వ్యర్థాల యాజమాన్యంలో అధునాతన విధానాలు, 500 నగరాల్లో మురుగునీటి శుద్ధి, నదుల ప్రక్షాళన వంటి అనేక కార్యక్రమాలను మా సర్కారు చేపడుతోంది’ అని మోదీ వివరించారు.

పర్యటన మేలిమలుపు: ఆస్ట్రేలియా వంటి మిత్రులతో మరింత సన్నిహిత భాగస్వామ్యం కోసం భారత్‌ పరితపిస్తోందనీ, గత కొద్ది రోజుల్లో ఈ దిశగా చాలా సాధించామని మోదీ చెప్పారు. రాజకీయ నేతల్ని, వ్యాపార దిగ్గజాలను, భారత సమాజాన్ని తాను కలవడాన్ని గుర్తు చేస్తూ అందరూ చేతులు కలపడం ద్వారా బంధాలు బలోపేతం అవుతున్నాయని చెప్పారు. క్రీడలు, పర్యాటకం, విద్య, సాంస్కృతిక రంగాల్లో ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా బంధాలను పరిపుష్టం చేసుకుంటున్నామని చెప్పారు. పర్యటనలో తనకు కనిపించిన ఆర్ద్రపూరిత స్నేహభావం చూస్తుంటే భవిష్యత్తులో ఇరుదేశాల బంధాలపై గొప్ప నమ్మకం కలుగుతోందన్నారు.

వెలుగు వైపు నా అడుగులు...

బడిగంట కొట్టగానే పిల్లలందరూ బిలబిలమంటూ బయటకు పరుగుతీశారు. టీచర్లూ ఇంటిదారిపట్టారు. ఒకరిద్దరు తప్ప నిర్మానుష్యంగా మారిన ఆ బడిలో..

పరిశ్రమ వదిలి వెళ్లిపోదామనుకున్నా!

మానవీయ కోణాల్ని స్పృశిస్తూ సినిమాలు తీయడంలో దర్శకుడు మదన్‌ది ప్రత్యేక శైలి. మనిషి, మనసు, అనుబంధాల మధ్య సంఘర్షణల్ని ఆయన తెరపైకి తీసుకొచ్చే విధానం బాగుంటుంది.

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net