Fri, February 12, 2016

Type in English and Give Space to Convert to Telugu

'వైజ్ఞానిక మైలురాయి''విశ్రమించిన వీరుడు''మేయర్‌ ఎన్నిక ఏకగ్రీవం''కారెక్కిన మరో తెదేపా ఎమ్మెల్యే''‘బేర్‌’మన్న స్టాక్‌ మార్కెట్లు''‘ఆధార్‌’ ఇక తప్పనిసరి కాదు''కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయం''ఎంపీల జీతభత్యాలు త్వరలో రెట్టింపు!''మార్చి మొదటి వారంలో ‘పుర’ ఎన్నికలు''మేడారం జాతరను జాతీయ పండుగగా ప్రకటించండి'
తస్మాత్‌ జాగ్రత్త.. నిఘా కళ్లున్నాయ్‌!
పోలీసులకు సామాజిక మాధ్యమాల ద్వారా పలువురు తోడ్పాటు
దీనిద్వారానే పెద్దఎత్తున ఫిర్యాదులు
ఇలా అందిన ఫిర్యాదుతోనే కిడ్నీ రాకెట్‌ వెలుగులోకి
వాహనదారులకు ఈ ఫిర్యాదు ఆధారంగానే చలానాలు
ఈనాడు - సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి
ప్పుడు పోలీసులకు కొండంత భరోసా! వేలాదిమంది శిక్షణలేని పోలీసులుగా మారి పలువిధాల తోడ్పాటు అందించడమే దీనికి కారణం. హైదరాబాద్‌ పోలీసులు సామాజిక మాధ్యమాలను జనానికి అందుబాటులోకి తేవడంతో.. పోలీసుల దృష్టికిరాని అనేక నేరాలు, నిబంధనల ఉల్లంఘనలు వెలుగులోకి వస్తున్నాయి. ఫలితంగా గత ఏడాదికాలంలో ఈ మాధ్యమాల ద్వారా అందిన ఫిర్యాదుల ఆధారంగా దాదాపు వెయ్యికిపైగా కేసులను నమోదు చేశారు. ఏడాది కిందట పోలీసులు శ్రీలంకలో కిడ్నీ రాకెట్‌ను వాట్సాప్‌ ద్వారా అందిన ఫిర్యాదు ఆధారంగానే ఛేదించారు. ఇటువంటి ఫిర్యాదుల ఆధారంగానే రోజుకు 100మందికి పైగా వాహనదారుల నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి ఈ-చలానాలు ఇంటికి చేరుతున్నాయి.

గత ఏడాదిన్నర కాలంగా నగర పోలీసు కమిషనర్‌ ఎం.మహేందర్‌ రెడ్డి సామాజిక మాధ్యమాలపై దృష్టిపెట్టారు. నగర ప్రజల నుంచి పూర్తిస్థాయిలో ఫీడ్‌బ్యాక్‌ తీసుకోవడం కోసం వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, హాక్‌ఐలను ప్రారంభించారు. తాజాగా ట్విట్టర్లను కూడా అందుబాటులోకి తేబోతున్నారు. దీనివల్ల గత ఏడాదికాలంలో దాదాపు అయిదారువేల మంది పోలీసులతో సంబంధాలను పెంచుకున్నారు. అనేకవివరాలను వీటిద్వారా పోలీసులకు అందిస్తున్నారు. హాక్‌ఐ అనే మొబైల్‌ యాప్‌ను 2014 డిసెంబర్‌లో ఏర్పాటు చేశారు. ఈ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని పోలీసులకు రకరకాల ఫిర్యాదులను దీనిద్వారా చేయొచ్చు. దాదాపు 7198 ఫిర్యాదులు దీనిద్వారానే అందాయి. నేరస్థులకు సంబంధించిన సమాచారం పెద్దఎత్తున పోలీసులకు అందింది. అనేకచోట్ల నిబంధనలకు విరుద్ధంగా వాహనాలను నిల్పివేస్తే.. స్థానికులు గానీ, అటుగావెళ్లేవారు చరవాణుల్లో చిత్రం(ఫొటో) తీసి దీనికి సంబంధించిన వివరాలను జతచేసి ఈయాప్‌లో పోలీసులకు పంపిస్తున్నారు. దీనిపై వారు వెంటనే స్పందించి సంబంధిత వాహనదారునికి ఈచలానా పంపిస్తున్నారు. ఇలా యాప్‌ద్వారా 3,986మంది వాహనదారులపై ఫిర్యాదులు అందితే 1118మందికి ఈచలనాలు ఇంటికి చేరాయి. మహిళలను ఏడిపిస్తున్న వారిపై కూడా సుమారు 470మందిపై ఫిర్యాదులందాయి. 332మంది పోలీసులు వివిధరకాల నిబంధనలు ఉల్లంఘించారంటూ ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో 20మంది ఫిర్యాదులకు సంబంధించి పోలీసులకు ఈచలానాలను పంపించారు. ఇదేవిధంగా హైదరాబాద్‌ పోలీసు పేరుతో ఏడాది కిందట ఫేస్‌బుక్‌ పేజీని ప్రారంభించారు. దీనికి గత ఏడాదికాలంలో రెండువేలకు పైగా ఫిర్యాదులందాయి. తెలంగాణలో కొన్నిజిల్లాలకు చెందిన కొంతమందిని శ్రీలంక తీసుకెళ్లి అక్కడ కిడ్నీని విక్రయించే ముఠాను ఫేస్‌బుక్‌ ద్వారా అందిన ఫిర్యాదు ఆధారంగానే కొన్నినెలల కిందట పోలీసులు చేధించారు. 9490616555 నెంబర్‌తో వాట్సాప్‌ను ప్రారంభించారు. దీనికి కూడా వందల సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయి. దీనిద్వారా వాహనదారులకు చలానాలను పంపించడంతోపాటు మహిళలను వేధిస్తున్న అనేకమంది పోకిరీలపై కేసులు నమోదు చేస్తున్నారు. హాక్‌ఐ యాప్‌లో ఏదైనా అత్యవసరమైతే ఇందులో ఉండే అత్యవసర సహాయం అన్న బటన్‌ నొక్కితే చాలు.. సంబంధిత వ్యక్తి ఏప్రాంతంలో ఉన్నాడన్నది గూగుల్‌మ్యాప్‌ ద్వారా తెలుసుకుని పోలీసులు అక్కడికి వెళ్లే ఏర్పాట్లను చేశారు. ట్విట్టర్‌ను కొద్దిరోజుల్లో ప్రారంభించబోతున్నారు. ఈ సామాజిక మాధ్యమాల ద్వారా అందే ఫిర్యాదుల కోసం కమిషనర్‌ కార్యాలయంలో ఇన్‌స్పెక్టర్‌ శ్రీనాథ్‌రెడ్డి నేతృత్వంలో నిపుణులు కొంతమంది పనిచేస్తున్నారు. దీనినుంచి ఫిర్యాదు అందిన వెంటనే సంబంధిత పోలీసుస్టేషన్‌కు ఇది చేర్చడంతోపాటు ఎస్‌ఐ ఎలాంటిచర్యలు తీసుకున్నారన్న వివరాల్ని ఫిర్యాదుదారులకు పంపిస్తున్నారు. ఈ ఫిర్యాదులపై కొన్నిగంటల్లోనే స్పందన ఉండటంతో సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవారు ఈ మాధ్యమాలను చక్కగా ఉపయోగించుకుంటున్నారు.

సైబరాబాద్‌లోనూ సమర్థంగా వినియోగం..
సామాజిక మాధ్యమాలను సైబరాబాద్‌ పోలీసుస్టేషన్‌లో చక్కగా ఉపయోగించుకుంటున్నారు. కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ప్రత్యేకంగా దీనిపై దృష్టిసారించడంతో వాట్సాప్‌, ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ తదితర వాటిని ప్రజల కోసం వినియోగంలోకి తెచ్చారు. వీటికి కూడా వందల సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయని ఐటీసెల్‌ ఇన్‌స్పెక్టర్‌ చంద్రకాంత్‌ తెలిపారు. ఈఫిర్యాదుల ఆధారంగా తక్షణం చర్యలు తీసుకుంటున్నారు. అనేకకేసులను నమోదు చేస్తున్నారు. నేరగాళ్లను పట్టుకుంటున్నారు. ఈనేపథ్యంలో ఐటీ విభాగాన్ని మరింత పటిష్ఠం చేయాలని కమిషనర్‌ ఆనంద్‌ నిర్ణయించారు.

సమంత@100 కేజీలు

మొదటి సినిమాలో సన్నగా సన్నజాజి తీగలా కనిపించి..రెండో చిత్రానికి వచ్చేసరికి బొద్దుగుమ్మగా దర్శనమిచ్చారు ఎంతో మంది కథానాయికలు....

చైనాలో విడుదలకు సిద్ధమవుతున్న బాహుబలి

బాహుబలి ది బిగినింగ్‌ చిత్రాన్ని చైనాలో విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధమయిన సంగతి తెలిసిందే. అంతేకాదు అంతర్జాతీయ స్థాయిలో విడుదల చేసేందుకు చిత్రానికి కొన్ని మార్పులు చేయనున్నట్లు దర్శకుడు ....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net