Thu, February 11, 2016

Type in English and Give Space to Convert to Telugu

'హైదరాబాద్‌కు యాపిల్‌''కారెక్కిన ఎర్రబెల్లి''మేయర్‌ బొంతు రామ్మోహన్‌!''హనుమంతప్ప పరిస్థితి మరింత విషమం''భాగ్యనగరం తరహాలో ఖేడ్‌ అభివృద్ధి''మహా జాతరకు శ్రీకారం''ఓటుకు నోటు కేసులో మరో తెదేపా ఎమ్మెల్యే అరెస్టు?''ప్రయాణికులపై మళ్లీ వడ్డింపు?''గవర్నర్లు రాష్ట్రాలకు ఉత్ప్రేరకాలు''మహానగర అభివృద్ధికి 100 రోజుల ప్రణాళిక!'
కనీస మట్టానికి శ్రీశైలం
సాగర్‌లో 531.6 అడుగుల నమోదు
రెండుచోట్ల అందుబాటులో ఉన్నది 40 టీఎంసీలే
ఈనాడు, హైదరాబాద్‌: శ్రీశైలం జలాశయం నీటిమట్టం 834 అడుగులకు చేరువలో ఉంది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, హైకోర్టు అభిప్రాయం ప్రకారం జలాశయంలో నిర్వహించాల్సిన కనీస నీటిమట్టం ఇది. ఈ స్థాయిలో జలాశయం నుంచి నీటి విడుదలకు ఆస్కారం ఉండదు. అత్యవసర పరిస్థితుల్లో కేవలం తాగునీటికి మాత్రమే ప్రభుత్వ ఆదేశాల మేరకు నీటిని విడుదల చేయడానికి అవకాశం ఉంటుంది. శ్రీశైలం జలాశయంలో శుక్రవారం 834.5 అడుగుల నీటిమట్టం నమోదైంది. 54.45 టీఎంసీల నీటి నిల్వ ఉంది. పై నుంచి ప్రవాహం లేదు. శనివారం నాటికి ఇది కనీస నీటిమట్టం స్థాయికి చేరనుంది. 834 అడుగుల కనీస నీటిమట్టం వద్ద 53.85 టీఎంసీల నీటిని నిల్వ ఉంచాలి. ఈ పరిస్థితుల్లో శ్రీశైలంలో ఒక టీఎంసీ నీరు కూడా అందుబాటులో లేనట్లే. నాగార్జునసాగర్‌లో ప్రస్తుతం 531.6 అడుగుల నీటిమట్టం ఉంది. 171.29 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇక్కడ 510 అడుగుల కనీస నీటిమట్టం నిర్వహించాల్సి ఉంది. 510 అడుగుల వద్ద 131.67 టీఎంసీల నీటిని నిల్వ ఉంచాలి. అంటే సాగర్‌లో 39.62 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ లెక్కన రెండు జలాశయాల్లో కలిపి ప్రస్తుతం 40 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది.

డిమాండ్‌ ఎక్కువే..: సాగర్‌ కుడి కాలువ కింద ఆయకట్టు అవసరాలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నీరు తీసుకుంటోంది. ఇంకా డిమాండ్‌ ఉందని వివరిస్తోంది. సాగర్‌ ఎడమ కాలువ కింద రెండో పంట సాగులో ఉంది. ఆ పంటకు నీరందించాల్సి ఉంది. సాగర్‌ ఎడమ కాలువ కింద జోన్‌ 3లో కృష్ణా జిల్లాలో పంటల కోసం ఇంకా 14 టీఎంసీల నీరు రావాల్సి ఉందని ఆంధ్రప్రదేశ్‌ చెబుతోంది. పులిచింతలలో నీటి నిల్వలు పూర్తిగా అడుగంటాయి. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న 40 టీఎంసీలను రెండు రాష్ట్రాలు జాగ్రత్తగా పంచుకోవాల్సి ఉంది. ముఖ్యమంత్రుల స్థాయిలో గవర్నర్‌ సమక్షంలో జరిగిన సమావేశం నిర్ణయం మేరకు రెండు రాష్ట్రాల ఈఎన్‌సీలు సంప్రదించుకుంటూ నీటి విడుదలను పర్యవేక్షిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లోనూ ఇంకా తాగునీటి అవసరాలు ఉన్నాయి.

నీళ్ల సీసాలపై మీ పేర్లు!

‘మంచి వ్యాపారవేత్త కావాలంటే ఎంబీఏలే చదవాల్సిన అవసరంలేదు. సామాజిక చొరవ ఉంటే చాలు! చక్కటి ఆలోచనతో ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేకుండా ఈ ఏడాదిన్నరలో రెండు...

వెండితెరపై కోట్ల ‘కాంతి’

సినిమా అనేది కచ్చితంగా వ్యాపారమే. ఏ కథానాయకుడికి ఎంత మార్కెట్‌ ఉంది? అనే లెక్కలు ఎప్పుడూ అవసరమే. పెట్టిన ప్రతీపైసాకీ గ్యారెంటీ ఉందన్న నమ్మకం కుదిరిన...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net