Sun, February 14, 2016

Type in English and Give Space to Convert to Telugu

'భారత్‌లో తయారీకి బ్రహ్మరథం''ఐపీఎస్‌లను పెంచండి''పాకిస్థాన్‌కు అధునాతన ఎఫ్‌-16 యుద్ధవిమానాలు''ఖేడ్‌లో 81.72 శాతం పోలింగ్‌''దిండి మొదటి దశ పనులకు త్వరలో టెండర్లు''మెదక్‌ నిమ్జ్‌లో చైనా పెట్టుబడులు..''చెలకల్లో.. అవినీతి మొలకలు!''మార్చి 10 నుంచి శాసనసభ సమావేశాలు''మళ్లీ తెరపైకి ఓటుకు నోటు కేసు''కళతో సామాజిక సందేశం'
ఫేస్‌బుక్‌కు తగ్గిన ఆదరణ
టీసీఎస్‌ యూత్‌ సర్వేలో వెల్లడి
హైదరాబాద్‌, విశాఖపట్నం వివరాలను వెల్లడించిన
టీసీఎస్‌ ఉపాధ్యక్షుడు వి.రాజన్న
యువతరం డిజిటల్‌ అలవాట్లకు తగ్గట్టుగా నియామకాల్లో మార్పులు
ఈనాడు - హైదరాబాద్‌
సామాజిక మాధ్యమం ‘ఫేస్‌బుక్‌’కు హైదరాబాద్‌ యువత ఆదరణ తగ్గింది! నిరుడు 91 శాతం మంది ఈ మాధ్యమంపై ఆసక్తి చూపించగా... ఈసారి అది 83 శాతానికి పడిపోయింది. ట్విట్టర్‌కూ ఇదే పరిస్థితి. గతేడాది 47% మంది నవతరం దీనిని వినియోగించగా, ఇప్పుడది 42 శాతానికి పడిపోయింది. హైదరాబాద్‌లో శుక్రవారం విడుదలచేసిన టీసీఎస్‌ యూత్‌ సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

* తాజా ఫలితాల ప్రకారం 83% మంది వినియోగదారులతో ఫేస్‌బుక్‌ ముందుండగా, గూగుల్‌ ప్లస్‌(74), ట్విట్టర్‌(42)లు తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

* ఆసక్తికర విషయమేంటంటే.. గూగుల్‌ ప్లస్‌ను అమ్మాయిలు అధికంగా 78% మంది వినియోగిస్తుండటం. వారిలో ఫేస్‌బుక్‌ వినియోగం 67 శాతానికే పరిమితమైపోయింది.

* క్రీడాకారులను 59% మంది, ప్రముఖులను 52% మంది ట్విటర్‌లో అనుసరిస్తున్నారు. సినిమా తారలను ట్విట్టర్‌లో అనుసరిస్తున్న టీనేజర్లు కేవలం 4 శాతంగానే వెల్లడైంది!

* మొత్తంగా టీనేజర్లు 84% మంది స్మార్ట్‌ఫోన్లను వాడుతున్నారు. వీరిలో డెస్క్‌టాప్‌, ల్యాప్‌టాప్‌లలో 48% మంది, స్మార్ట్‌ఫోన్లలో 33% మంది అంతర్జాలాన్ని వినియోగిస్తున్నారు.* తక్షణ సమాచారం చేరవేతకు వ్యాట్సాప్‌ను హైదరాబాద్‌ టీనేజర్లు 66 శాతం మంది ఉపయోగిస్తున్నారు. యవతరం ఎలక్ట్రానిక్‌ పరికరాల(59) కంటే ఎక్కువగా పుస్తకాలను(62) ఆన్‌లైన్లో కొనుగోలు చేస్తుండటం మరో విశేషం. సినిమా టిక్కెటు ్ల(55శాతం), ప్రయాణ టిక్కెట్లు (42 శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

వృత్తివిద్యపై అమ్మాయిల ఆసక్తి
పరీక్ష ఫలితాలు, ర్యాంకుల్లో ముందంజలో ఉంటున్న అమ్మాయిలు.. వృత్తివిద్య (ప్రొఫెషనల్‌) కోర్సులను ఎంపిక చేసుకోవడంలోనూ అబ్బాయిలను వెనక్కి నెట్టేశారు. అబ్బాయిల కంటే (48% మంది), అమ్మాయిలు (61%) ఎక్కువగా ఈ కోర్సులను ఎంపిక చేసుకుంటున్నారు. వృత్తివిద్య కోర్సులు ఆదరణ కోల్పోతున్నాయనేది కేవలం అపోహ మాత్రమేనని తమ సర్వేలో వెల్లడైందని టీసీఎస్‌ ఉపాధ్యక్షుడు వి.రాజన్న పేర్కొన్నారు. గచ్చిబౌలిలోని టీసీఎస్‌ ప్రాంగణంలోని శుక్రవారం ఆయన హైదరాబాద్‌ యూత్‌ సర్వేలోని అంశాలను మీడియాకు వెల్లడించారు. దేశంలో అతిపెద్ద సర్వేల్లో ఇది ఒకటని, 12 నుంచి 18 సంవత్సరాల వయసు పిల్లల డిజిటల్‌ అలవాట్లను తెలుసుకునేందుకు ‘జనరేషన్‌ జెడ్‌’ పేరుతో ఈ సర్వే చేపట్టినట్లు ఆయన వివరించారు. దేశంలోని 15 నగరాల్లో టీసీఎస్‌ ఐటీ విజ్‌ క్విజ్‌లో భాగంగా సర్వే నిర్వహించినట్లు తెలిపారు. హైదరాబాద్‌లో 100 పాఠశాలలకు చెందిన వెయ్యి మంది విద్యార్థులు సర్వేలో పాల్గొన్నారన్నారు. భవిష్యత్తు వృత్తినిపుణులైన టీనేజర్ల అలవాట్లను తెలుసుకునేందుకు దేశవ్యాప్తంగా తాము నిర్వహిస్తున్న సర్వే దోహదపడుతుందని చెప్పారు. నేటితరం పిల్లల డిజిటల్‌ అలవాట్లకు అనుగుణంగా తమ కంపెనీలో లెర్నింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ విభాగంలో పలు మార్పులు చేశామన్నారు. పాఠశాలల్లోనూ బోధన తీరులో మార్పు రావాల్సిన అవసరం ఉందని సర్వే ద్వారా వెల్లడైందన్నారు. తాము కాగితాన్ని ఉపయోగించకుండా నియామక పరీక్షలను ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తున్నామని, నియామక పత్రాలనూ అలాగే పంపుతున్నామన్నారు. ఉద్యోగార్థుల కోసం ‘క్యాంపస్‌ కమ్యూన్‌’ అందుబాటులో ఉందన్నారు. దీనిద్వారా ఐటీ పరిశ్రమ, టీసీఎస్‌ ఎలాంటి అభ్యర్థులను కోరుకుంటున్నాయో తెలుసుకుని, అలా సన్నద్ధం కావచ్చన్నారు. ప్రాంగణ నియామకాల్లో ఎంపికైనవారికి ‘ఐ ఎవ్వాల్‌’ పేరుతో శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. ఇంటి నుంచి కార్యాలయానికి వస్తూ కూడా నేర్చుకునేలా సాంకేతికతపై నానో వీడియోలను రూపొందించినట్లు ఆయన చెప్పారు. హైదరాబాద్‌లో 30 వేల ఉద్యోగాలతో గ్లోబల్‌గా నాలుగో స్థానంలో ఉన్నామని, వీరిలో 9,500 మంది మహిళా ఉద్యోగులు ఉన్నారన్నారు. 2007లో తమ ఉద్యోగుల సంఖ్య 4,500 అని పేర్కొన్న ఆయన... భవిష్యత్తులో ఇదే స్థాయిలో కొత్త ఉద్యోగాల భర్తీ ఉంటుందనే సంకేతాలను ఇచ్చారు. ఇంటెల్‌తో కలిసి ఆరోగ్య, రిటైల్‌, ఉత్పత్తి రంగాల్లో ‘ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐవోటీ)’ అభివృద్ధికి 100 మంది నిపుణులు పనిచేస్తున్నట్లు చెప్పారు.

సర్వే విశేషాలివీ...
ఆన్‌లైన్‌ యుగంలోనూ పిల్లలు ఎక్కువమంది సంప్రదాయ మీడియావైపే మొగ్గుచూపుతున్నారు. హైదరాబాద్‌లో వార్తల కోసం పత్రికలు, టీవీలు చూసేవారు 80 శాతం మంది ఉన్నారు. విశాఖపట్నంలో ఇది 84 శాతం. హైదరాబాద్‌లో 42% మంది సామాజిక మాధ్యమాలు, 41% మంది ఆన్‌లైన్‌ ద్వారా స్నేహితులతో సంప్రదిస్తుండగా, విశాఖలో అవి వరుసగా 33%, 27% నమోదయ్యాయి. హైదరాబాద్‌లోని స్పందనదారుల్లో 75% మంది రోజూ గంటైనా ఆన్‌లైన్లో గడుపుతున్నారు. 29% మంది పాఠశాల అసైన్‌మెంట్‌ను పూర్తిచేయడానికి ఉపయోగిస్తుంటే, అభిరుచులకు పదును పెట్టుకోవడానికి 19% మంది ఆన్‌లైన్‌లో ఉంటున్నారు. ఆన్‌లైన్‌లో రోజు గంటసేపు గడిపే విషయంలో హైదరాబాద్‌ను విశాఖపట్నం మించిపోయింది! ఇక్కడ 77% మంది ఆన్‌లైన్‌లో ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఫోన్‌కాల్స్‌, సామాజిక మాధ్యమాల్లో కంటే నేరుగా స్నేహితులతో సంభాషించడానికి హైదరాబాద్‌లో 38%, విశాఖలో 43% యువత ప్రాధాన్యం ఇస్తున్నారు.

వలచి...గెలిచి..

ప్రేమికుల రోజూ.. అదే సూర్యుడు. అవే ఇరుసంధ్యలు. అదే గాలి. అవే దిక్కులు. ఎప్పట్లాగే ఇరవై నాలుగ్గంటలు!! మరేమిటీ ప్రత్యేకం? ఏముంది? ప్రేమే!!...

సీసీఎల్‌-6 విజేత తెలుగు వారియర్స్‌

సెలెబ్రిటీ క్రికెట్‌ లీగ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ తెలుగు వారియర్స్‌ ఫైనల్లో అదిరిపోయే ప్రదర్శనతో కర్ణాటక బుల్డోజర్స్‌ను మట్టికరిపించి రెండోసారి విజేతగా నిలిచింది. ఉప్పల్‌లో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో 208 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన అఖిల్‌...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net