Thu, February 11, 2016

Type in English and Give Space to Convert to Telugu

'ఈ హనుమంతుడు మృత్యుంజయుడు!''విద్యా విలీనం''ఆ నాటి హామీలను నెరవేర్చండి''తెరాస గూటికి కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే''కాల్పుల్లో అనూహ్య మలుపు''ఉగ్ర మూలం ఐఎస్‌ఐ''వెనక్కు పంపాం.. బహిష్కరణ కాదు''సుశీల్‌ కొయిరాలా కన్నుమూత''వెళ్లిరా నేస్తమా...''రాజ్యాంగం పవిత్రతను కాపాడాలి'
తిరుగుబాట్లతో మాలి సతమతం
నైసర్గిక స్వరూపం: పశ్చిమాఫ్రికాలో సముద్ర తీరం లేని దేశం మాలి. చుట్టూ ఇతర దేశాల భూభాగాలతో మూసుకుని ఉంటుంది. సగానికి పైగా భూభాగం ఎడారే(సహారా). విస్తీర్ణం: 12,40,000 చ.కి.మీ. రాజధాని బమాకో.

భాషా సంస్కృతులు: జనాభా సంఖ్య 1.4 కోట్లు. భిన్న జాతుల సమ్మేళనం. బంబారా జాతి వారి సంఖ్య అధికం (మొత్తం జనాభాలో దాదాపు 36.5శాతం). దాదాపు 40 భాషలు వాడుకలో ఉన్నాయి. అధికారిక భాష ఫ్రెంచి. బంబారా సహా 12 భాషలకు జాతీయ గుర్తింపు. 80శాతం మంది బంబారాలో మాట్లాడగలరు. దాదాపు 90శాతం మంది అనుసరించే మతం ఇస్లాం. సాధారణంగా ఇతర ముస్లిం దేశాల్లో కనిపించే విశ్వాసభేదాలు ఇక్కడ పెద్దగా కనిపించవు. సాధారణ సమాజం సహనశీలంగా ఉంటుంది. ఇతర మతస్తులతో అన్యోన్యంగా ఉంటారు.

ఆర్థిక స్థితి: ప్రపంచంలోనే 25 అత్యంత పేద దేశాల్లో ఒకటి. జనాభాలో సగం మంది అంతర్జాతీయ దారిద్య్రరేఖకు (రోజు సంపాదన 1.25 డాలర్లకు కన్నా తక్కువ) దిగువనే జీవిస్తున్నారు. బంగారం వెలికితీత, పత్తి వంటి వ్యవసాయోత్పత్తుల ఎగుమతులపై ఎక్కువగా ఆధారపడి ఉంది. ఎక్కువ భూభాగం బంజరు, ఎడారి అయినప్పటికీ నైజర్‌, సెనెగల్‌ నదీ పరివాహక ప్రాంతాల్లో సారవంతమైన భూమి ఉండడంతో ఆహారం విషయంలో స్వయం సమృద్ధి సాధించింది. చేపల వేట మరో ప్రధాన వృత్తి.

రాజకీయాలు, సంక్షోభాలు: 1855కు పూర్వం వివిధ స్థానిక రాజ్యాల కింద ప్రస్తుత మాలి ప్రాంతం ఉండేది. 1855 నుంచి 1960 వరకు ఫ్రాన్స్‌ పాలన. 1960లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పలు దశాబ్దాల పాటు కరవులు, తిరుగుబాట్లు, సైనిక పాలనలతో సతమతం. 1991లో సైనిక జనరల్‌ టౌరే సైనిక పాలనకు అంతం పలికి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించారు. 1992 నుంచి బహుళ పార్టీ వ్యవస్థలతో కూడిన ఎన్నికలు ఐదేళ్లకోసారి జరుగుతున్నాయి. అయితే 2007లో పౌర ప్రభుత్వాన్ని సైన్యం గద్దె దింపింది. 2012లో తువారెగ్‌ వర్గాలు ఉత్తర ప్రాంతం(సహారా)లో స్వాతంత్య్రం కోరుతూ తిరుగుబాట్లు చేయడంతో దేశంలో అశాంతి పరిస్థితులు ఏర్పడ్డాయి. 2013లో ఫ్రెంచి దళాల సహకారంతో ఉత్తర ప్రాంతంలో తిరుగుబాటుదారులను అణిచేసినా పూర్తిగా పరిస్థితి సద్దుమణగలేదు. తొలుత స్వీయపాలన అంశం శాంతియుత రాజకీయ ఉద్యమంగానే ప్రారంభమయినా క్రమంగా ఆయుధ బాటను పట్టి ఉగ్రవాద రూపాన్ని సంతరించుకుంది. తువారెగ్‌లోని మరో వర్గమైన అన్సార్‌ డినె వర్గం సహారా ప్రాంతానికి స్వాతంత్య్రం కోరడం కాకుండా మాలి మొత్తం షరియా (ఇస్లామిక్‌ చట్టం) అమలు చేయాలని పోరు ప్రారంభించింది. ఈ వర్గానికి అల్‌ఖైదాతో సంబంధాలున్నాయి. దీంతో అక్కడ ఉగ్రవాదం వేళ్లూనుకుంది. తాజా దాడులకు పూర్వం కూడా అక్కడ అడపాదడపా ఉగ్రవాద దాడులు జరుగుతూనే ఉన్నాయి.

-ఈనాడు, ప్రత్యేక విభాగం

మమ్మల్నీ ఉద్యోగులే అనుకున్నారు!

బయోటెక్నాలజీ రంగాన్ని చాలా ఇష్టంగా ఎంచుకున్నారా ఇద్దరు..!కానీ ఆ చదువుకు తగ్గ ఉద్యోగాల్లేవు.. ఈ పరిస్థితుల్లో ఎవరయినా ఉన్నచోటే వేరే ఉద్యోగాలు చూసుకోవడమో...

ఉగ్రవాదులకు శ్రీకాంత్‌ ‘టెర్రర్‌’

హీరో శ్రీకాంత్‌ ఇంటెలిజెన్స్‌ పోలీస్‌ అధికారిగా ఉగ్రవాదంపై చేసే పోరాటమే ‘టెర్రర్‌’. ఓ పోలీస్‌ అధికారి నగరాన్ని ముట్టడించిన ఉగ్రవాదులను ఎలా ఎదుర్కొన్నాడు అనే అంశాన్ని దర్శకుడు ఎంతో...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net