Mon, February 08, 2016

Type in English and Give Space to Convert to Telugu

'పట్టణాభిషేకం''వాస్తవాల ప్రతిబింబంగా బడ్జెట్‌''నీటిపై నిప్పుల వాన''సీఎం మొండి అయితే.. నేను జగమొండి''తీరప్రాంత దేశాల మధ్య సహకారం పెరగాలి''ఉత్తర కొరియా రాకెట్‌ ప్రయోగం''చిరుతకు చిక్కి .. ప్రాణాలతో బయటపడి''మౌఖికంలో మార్కులు ఖాయం''ఎయిమ్స్‌కు 220 ఎకరాలు కేటాయింపు''‘అంకుర’ భయాలొద్దు'
మిగిలేది ప్లాస్టిక్‌ పుష్పాలే!
ప్పటి వరకూ అందరూ జల పుష్పాలంటే చేపలని భావిస్తున్నారు. కానీ మరో నాలుగు దశాబ్దాల్లో ఈ అర్థాలు మారిపోవచ్చు. ఎందుకంటే మనం సముద్రాల్లోకి తోసిపారేస్తున్న ప్లాస్టిక్‌ వ్యర్ధాల వల్ల 2050 నాటికి జల పుష్పాల కంటే కూడా.. మన మహాసాగరాలన్నీ ప్లాస్టిక్‌ డబ్బాలూ, సీసాలతోనే నిండిపోతాయని తీవ్ర హెచ్చరికలు చేస్తున్నారు నిపుణులు.
ఇది ప్లాస్టిక్‌ కడలి గండం!

మొత్తం ప్లాస్టిక్‌లో 40% పైగా ‘ప్యాకేజింగ్‌’ రంగంలోనే వినియోగిస్తున్నారు
స్వర్ణ యుగాలనూ, లోహ యుగాలనూ దాటుకుని ఇప్పుడు మనం ‘ప్లాస్టిక్‌ యుగం’లోకి వచ్చిపడ్డాం. మన జీవితాలే కాదు, మన ఆర్థిక రంగ మూలాలే ఇప్పుడు ప్లాస్టిక్‌లో ఉన్నాయంటున్నారు నిపుణులు. అయితే ఈ ప్లాస్టిక్‌ వస్తువులను మనం విచ్చలవిడిగా వాడేస్తూ.. ఇష్టారాజ్యంగా సముద్రాల్లో విసిరి పారేస్తుండటం వల్ల మొత్తం పర్యావరణమే పెను ముప్పులో పడిపోతోందనీ, పరిస్థితి ఇలాగే కొనసాగితే 2050 నాటికి మన మహాసముద్రాల్లో చేపలు, ఇతర జల చరాల కంటే కూడా ప్లాస్టిక్‌ వ్యర్థాలే అధికంగా ఉంటాయని, అప్పటి విపరిణామాలను వూహించటం కూడా కష్టమని తాజా నివేదిక హెచ్చరిస్తోంది.

ప్లాస్టిక్‌ అనేది ఆధునిక బంగారం అనుకుంటే ప్రస్తుతం మన ప్రపంచ ఆర్థిక రంగాన్ని నడుపుతున్నది అదే! అందుకే ఇప్పుడు ‘ప్లాస్టిక్‌ ఎకానమీ’ని నిపుణులు ప్రత్యేకంగా అధ్యయనం చేస్తున్నారు. చౌకగా ఉత్పత్తి చేసే వీలుండటం, వివిధ రూపాల్లో సమర్థంగా వాడుకునే అవకాశం ఉండటం వల్ల ప్లాస్టిక్‌ పరిశ్రమ.. ఆహార రంగం నుంచి కంప్యూటర్ల వరకూ సకల రంగాలనూ ఆవరించేసింది. గత యాభై ఏళ్లలో ప్లాస్టిక్‌ వాడకం దాదాపు 20 రెట్లు పెరిగిందని, ఇక రానున్న 20 ఏళ్లలోనే ఇది రెట్టింపైపోవటం తథ్యమని మెకార్థర్‌ నివేదిక అంచనా వేసింది. ప్లాస్టిక్‌ వస్తువులకు గిరాకీ ఇంతగా పెరుగుతున్నా వీటిని పునర్వినియోగించటం మీద మాత్రం ఎవరూ సరిగా శ్రద్ధ పెట్టటం లేదు. ప్రస్తుతం తయారవుతున్న మొత్తం ప్లాస్టిక్‌లో కేవలం 5% ప్లాస్టిక్‌ మాత్రమే సమర్ధంగా పునర్వినియోగానికి వెళుతోంది, దాదాపు 40% భూగోళం మీద వ్యర్థం రూపంలో మిగిలిపోతోంది. పైగా దీన్ని అడ్డూఅదుపూ లేకుండా పారెయ్యటం, సముద్రాల్లోకి తోసెయ్యటం వంటివే జరుగుతున్నాయని, ఇది అత్యంత ప్రమాదకరమైన ధోరణి అని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది.

పుడుతూనే వ్యర్థం.. అనర్థం!
ప్లాస్టిక్‌ వినియోగంలో ఉదాసీన వైఖరి వల్ల పర్యావరణ పరంగానే కాదు.. ఆర్థికంగా కూడా చాలా నష్టం జరుగుతోంది. ఎందుకంటే ప్లాస్టిక్‌ను సీసాలు, డబ్బాలు, ప్లేట్లు, గ్లాసులు, ప్యాకెట్లు, సంచులు.. ఇలా రకరకాల రూపాల్లో వాడుతున్నారుగానీ వీటన్నింటినీ కొద్ది నిమిషాలు మాత్రమే వాడి వెంటనే పారేస్తున్నారు. ఇలా వినియోగంలోకి వచ్చిన కొద్ది నిమిషాల్లోనే అది వ్యర్థం రూపానికి మారిపోతోంది, దాన్ని మళ్లీ వినియోగంలోకి తెచ్చే ప్రయత్నాలే ఉండటం లేదు. తయారవుతున్న మొత్తం ప్లాస్టిక్‌లో దాదాపు 95% పరిస్థితి ఇంతేననీ, ఒక రకంగా ఇదంతా కూడా ఆర్థికంగా నష్టంగానే పరిణమిస్తోందని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. విచ్చలవిడిగా పారేస్తున్న ప్లాస్టిక్‌ వస్తువులు, సంచుల వంటివన్నీ పట్టణాల్లో మురుగు ప్రవాహానికి అవరోధంగా తయారవుతున్నాయి. అదొక్కటే కాదు.. సముద్రాల్లోకి తోసేస్తున్న కోట్ల టన్నుల ప్లాస్టిక్‌ వస్తువుల వల్ల మొత్తం జీవకోటికే ముప్పు పొంచి ఉంది. ‘‘నిమిషానికి దాదాపు 80 లక్షల టన్నుల ప్లాస్టిక్‌ సముద్రాల్లో కలుస్తోంది. ఎలాంటి చర్యలూ తీసుకోకపోతే 2030 నాటికి ఇది రెండు రెట్లు, 2050 నాటికి నాలుగు రెట్లవుతుంది. దానర్థం 2025 నాటికి సముద్రంలోని ప్రతి టన్ను చేపలకు 3 టన్నుల ప్లాస్టిక్‌ ఉంటుంది, 2050 నాటికి అయితే సముద్ర జలాల్లో చేపల కంటే కూడా ప్లాస్టిక్కే ఎక్కువగా ఉంటుంది’’ అని అంచనా వేసింది.
జీవానికీ, జనానికీ నష్టమే!
సాగరంలో కలుస్తున్న ప్లాస్టిక్‌.. సాగర జలాలు వేడెక్కినప్పుడు కరుగుతుంది. ఈ క్రమంలో ప్రమాదకర రసాయనాలు విడుదల అవుతాయి. వీటి వల్ల చేపలు, సాగర జీవాలన్నీ కలుషితమవుతున్నాయి. ఇలా ఈ రసాయనాలు మన ఆహార చక్రంలో కూడా కలిసి మరింత ప్రమాదకర వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. సాగరజలాల్లో తేలియాడుతున్న ప్లాస్టిక్‌ వస్తువులను సీళ్లు, తాబేళ్ల వంటి జీవులు మింగి ప్రాణాలకు ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నాయి. అలాగే చిన్నచిన్న ప్లాస్టిక్‌ ముక్కలు సాగర గర్భంలో చేరి, అడుగుకు వెళ్లి మొత్తం అక్కడి పర్యావరణాన్నే మార్చేస్తున్నాయి. ఇంతటి చేటుకు మూలం ప్లాస్టిక్‌ను పునర్వినియోగంలోకి తెచ్చే విధానాలు సమర్థంగా లేకపోవటమే. కాబట్టి ఆవృత ఆర్థిక విధానాలను (సర్క్యులర్‌ ఎకానమీ) విధానాలను అమలుపరుస్తూ, వ్యర్థంలా పారెయ్యకుండా దీన్ని తిరిగి విలువైన వనరుగా సేకరించటం, స్వీకరించటం ఆరంభించినప్పుడే ఈ ప్రపంచానికి మేలు జరుగుతుందని నివేదిక తేల్చిచెప్పింది. ముఖ్యంగా ప్యాకేజింగ్‌ రంగంలో ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించటం, దీనికి ప్రత్యామ్నాయాలను గుర్తించటం వల్ల తక్షణం మేలు జరుగుతుందని సూచించటం విశేషం.

సాగర శోధన
ఈమె పేరు డేమ్‌ ఎలెన్‌ మెకార్థర్‌. ప్రపంచ సముద్రాలన్నింటినీ చుట్టివచ్చిన అరుదైన రికార్డు ఈమె సొంతం. ఈమె కేవలం ఓ సాహసిలా సాగరాలను చుట్టి రావటమే కాదు, సముద్రాలపై అనంతమైన ప్రేమతో.. తన పేరుతోనే ఒక ప్రత్యేక ఫౌండేషన్‌ ఏర్పాటు చేసి, సముద్రాలను లోతుగా అధ్యయనం చెయ్యటం ఆరంభించారు. ఈ క్రమంలో ప్రస్తుతం దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో ‘ద న్యూ ప్లాస్టిక్స్‌ ఎకానమీ: రీ థింకింగ్‌ ద ఫ్యూచర్‌ ఆఫ్‌ ప్లాస్టిక్స్‌’ పేరుతో ప్రత్యేక నివేదిక విడుదల చేశారు. ప్లాస్టిక్‌ వస్తువుల పారబోతపై తీవ్ర హెచ్చరికలు చేస్తున్నారీమె.


 
-ఈనాడు ప్రత్యేక విభాగం

మాధవన్‌ పళ్లురాలగొట్టాను..!

సినిమా కోసం ఉత్తుత్తినే కాదు.. నిజంగానే అంతపని చేసిందట రితిక. గత వారం విడుదలై సంచలన విజయం సాధించిన ‘సాలా ఖడూస్‌’ చిత్రం కథానాయిక. అప్పుడెప్పుడో పరుగుల రాణీ...

‘శ్రీశ్రీ’ డబ్బింగ్‌ పూర్తి

అలనాటి తెలుగు సూపర్‌స్టార్‌ కృష్ణ, ఆయన భార్య విజయ నిర్మల కీలక పాత్రధారులుగా తెరకెక్కిన ‘శ్రీశ్రీ’ చిత్రం దాదాపు పూర్తయ్యింది....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net