Fri, February 12, 2016

Type in English and Give Space to Convert to Telugu

'వైజ్ఞానిక మైలురాయి''విశ్రమించిన వీరుడు''మేయర్‌ ఎన్నిక ఏకగ్రీవం''కారెక్కిన మరో తెదేపా ఎమ్మెల్యే''‘బేర్‌’మన్న స్టాక్‌ మార్కెట్లు''‘ఆధార్‌’ ఇక తప్పనిసరి కాదు''కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయం''ఎంపీల జీతభత్యాలు త్వరలో రెట్టింపు!''మార్చి మొదటి వారంలో ‘పుర’ ఎన్నికలు''మేడారం జాతరను జాతీయ పండుగగా ప్రకటించండి'
దూరదృష్టితో రాజధాని నిర్మాణం
భవిష్యత్తు అవసరాల కోసం భూముల కేటాయింపు
మూడు విభాగాలుగా ప్రణాళిక రూపకల్పన
ఈనాడు, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని అభివృద్ధి, భవిష్యత్తు అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా భూములను కేటాయించి, భూ నిధి (లాండ్‌ బ్యాంకు) పేరిట నిర్వహించనుంది. వీటి పర్యవేక్షణ బాధ్యతలను రాజధాని ప్రాంతీయ అభివృద్ధి ప్రాధికారిక సంస్థ (సీఆర్‌డీఏ) చూస్తుంది. సమీకరించిన, సేకరించిన, కొనుగోలు చేసిన, కేటాయించిన, స్వాధీనం చేసుకున్న భూములన్నీ దీని పరిధిలోకి వస్తాయి. అవసరమైతే భూమిని సేకరించి అందుకు పరిహారం ఇవ్వడంగానీ, అభివృద్ధి చేసిన స్థలంలో భాగస్వామ్యం కల్పించడంగానీ చేస్తారు. రాజధాని నిర్మాణ బృహత్‌ ప్రణాళిక రూపకల్పనలో మూడు భాగాలు ఉంటాయి. ముందుగా రాజధాని ఎలా ఉండాలన్నదానిపై ఒక అవగాహన కలిగేలా భావాత్మక ప్రణాళిక తయారు చేస్తారు. ఆ తరువాత ఏప్రాంతంలో ఏవి ఉండాలనే ప్రాదేశిక ప్రణాళిక, ఏయే సౌకర్యాలు ఉండాలన్న మౌలిక సదుపాయాల ప్రణాళికను తయారు చేస్తారు. సీడీఆర్‌ఏ చట్టం అములులోకి వచ్చిన రెండేళ్లలో ముందుగా వూహాచిత్ర ప్రణాళికను రూపొందిస్తారు. రానున్న 30 ఏళ్లలో జరిగే మార్పులను దృష్టిలో పెట్టుకొని ఎక్కడ ఏమి నిర్మించాలనేదానిపై ఒక అంచనాకు వస్తారు. దీని ప్రకారం ప్రాదేశిక, మౌలిక సదుపాయాల కల్పనకు సవివరంగా ప్రణాళిక రూపొందిస్తారు. చట్టం అమలులోకి వచ్చే మూడేళ్లలోగా ఈ ప్రణాళికలకు ఆమోదం తెలపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రజల జీవన ప్రమాణాలు, ఉపాధి, రవాణా, పర్యావరణ సుస్థిరత తదితర అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఈ ప్రణాళికలు తయారు చేస్తారు. ఆమోదం పొందిన ఈ ప్రణాళికల్లో ఏవైనా మార్పులు చేసే అధికారాన్ని సీఆర్‌డీఏకు కట్టబెట్టారు. అయిదే ఇందుకుగల సమగ్ర కారణాలు, సవరణ ప్రణాళికపై నివేదిక రూపొందించాల్సి ఉంటుంది. దీనిపై ప్రకటన జారీ చేసి 15 రోజుల్లోగా అభ్యంతరాలు, సలహాలు స్వీకరించాల్సి ఉంటుంది.

ప్రాదేశిక ప్రణాళిక
ఎక్కడ ఏ నిర్మాణాలు ఉండాలన్నది ప్రాదేశిక ప్రణాళికలో భాగంగా ఉంటాయి. నివాస, వాణిజ్య, పారిశ్రామిక, వ్యవసాయ, ప్రజా ప్రయోజన అవసరాలకు ప్రత్యేకంగా భూ వినియోగ ప్రణాళికలు సిద్ధం చేయనుంది. తాగునీటి సరఫరా, విద్యుత్తు, గ్యాస్‌, వరద నీటి కాలువలు, మురుగునీటి కాలువ, వ్యర్థాల నిర్వహణ, విద్యా సంస్థలు, వైద్య, ఆరోగ్యం, సాంఘిక సంక్షేమం, సాంస్కృతిక కేంద్రాలు, క్రీడామైదానాలు, ఆధ్యాత్మిక కట్టడాలు, జంతు ప్రదర్శనశాలలు తదితర అంశాలన్నీ ఇందులో చోటుచేసుకుంటాయి.

మౌలిక సదుపాయాల ప్రణాళిక
నివాస ప్రాంతాలన్నీ కలుపుతూ రింగురోడ్లు, రేడియల్‌, గ్రిడ్‌ రోడ్ల నిర్మాణం, కమ్యూనికేషన్‌, విద్యుత్తు కేంద్రాలు, రైల్వే, మెట్రో, విమానాశ్రయాలు తదితరాలన్నీ మౌలిక సదుపాయాల ప్రణాళికలో ప్రధానంగా ఉంటాయి.

సమంత@100 కేజీలు

మొదటి సినిమాలో సన్నగా సన్నజాజి తీగలా కనిపించి..రెండో చిత్రానికి వచ్చేసరికి బొద్దుగుమ్మగా దర్శనమిచ్చారు ఎంతో మంది కథానాయికలు....

మణిరత్నం వీరాభిమానిని!

హను రాఘవపూడి... తీసింది ‘అందాల రాక్షసి’ ఒక్కటే. దాని చుట్టూ బోలెడు కామెంట్లు.. కాంప్లిమెంట్లు. ‘మణిరత్నం ప్రభావం కుర్రాడిపై చాలా ఎక్కువ ఉంది’ అనుకొన్నారు చాలామంది....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net