Thu, February 11, 2016

Type in English and Give Space to Convert to Telugu

'హైదరాబాద్‌కు యాపిల్‌''కారెక్కిన ఎర్రబెల్లి''మేయర్‌ బొంతు రామ్మోహన్‌!''హనుమంతప్ప పరిస్థితి మరింత విషమం''భాగ్యనగరం తరహాలో ఖేడ్‌ అభివృద్ధి''మహా జాతరకు శ్రీకారం''ఓటుకు నోటు కేసులో మరో తెదేపా ఎమ్మెల్యే అరెస్టు?''ప్రయాణికులపై మళ్లీ వడ్డింపు?''గవర్నర్లు రాష్ట్రాలకు ఉత్ప్రేరకాలు''మహానగర అభివృద్ధికి 100 రోజుల ప్రణాళిక!'
నామ్‌ భవితవ్యం ప్రశ్నార్థకం?
రెండు రాష్ట్రాల్లో విస్తరించిన రహదారి
నిర్వహణ బాధ్యతలు చూస్తున్న తెలంగాణ
ఏపీలో నిలిచిన బైపాస్‌ల నిర్మాణం
కమిటీ యోచనలో సర్కారు
ఈనాడు, ఒంగోలు: రాష్ట్ర విభజన అనంతరం నామ్‌(నార్కట్‌పల్లి-అద్దంకి, మేదరమెట్ల) నాలుగు వరుసల ఎక్స్‌ప్రెస్‌ రహదారి అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారింది. మొత్తం 212.5 కిలోమీటర్ల ఈ రహదారి ఆంధ్రప్రదేశ్‌లో 123.5 కి.మీ., తెలంగాణలో 89 కి.మీ. మేర ఉంది. దీని నిర్వహణ తెలంగాణ సీఈ పరిధిలో ఉండడంతో ఆంధ్రప్రదేశ్‌ అధికారులు నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి. ఫలితంగా మూడు చోట్ల బైపాస్‌ల నిర్మాణంతోపాటు మిగిలిన పనులూ నిలిచిపోయాయి.

ప్రకాశం జిల్లా మేదరమెట్ల, అద్దంకి నుంచి నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి వరకు మొత్తం 212.5 కి.మీ. దూరం రూ.1196.84 కోట్ల వ్యయంతో నామ్‌ రహదారి చేపట్టారు. దీనికి కేంద్రం నుంచి రూ.467.02 కోట్ల నిధి వచ్చింది. ప్రకాశం, గుంటూరు, నల్గొండ మీదుగా సాగే రహదారి నిర్మాణాన్ని రామ్‌కీ ఆధ్వర్యంలోని సంస్థల బృందం(కన్సార్టియం) చేపట్టింది. రెండున్నరేళ్లలో నిర్మాణం పూర్తి చేసి తర్వాత 22 ఏళ్ల ఆరు నెలల పాటు సుంకం(టోల్‌) వసూలు చేసుకోవాల్సి ఉంది. గడువులోగా పనులు పూర్తికాకపోయినా ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి సుంకం వసూలుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో నల్గొండ జిల్లా మోదుగలపల్లె, గుంటూరు జిల్లా బ్రాహ్మణపల్లి, ప్రకాశం జిల్లా ఏల్చూరు వద్ద సుంకం వసూలు కేంద్రాలు(టోల్‌గేట్లు) ఏర్పాటు చేసి వసూళ్లు ప్రారంభించారు.

పూర్తికాని బైపాస్‌ల నిర్మాణం
నాలుగు వరుసల ఈ రహదారి నిర్మాణంలో ఇంకా 9 శాతం పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఇందులో అధిక భాగం గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిలోనే ఉన్నాయి. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల, బ్రాహ్మణపల్లిలో 9 కి.మీ. బైపాస్‌ల నిర్మాణం పూర్తికాలేదు. ప్రకాశం జిల్లాలో అద్దంకి మీదుగా రోడ్డు వేయాల్సి ఉన్నా స్థానికుల అభ్యంతరంతో బైపాస్‌ ప్రతిపాదన తెచ్చారు.. దాంతో నిర్మాణం నిలిచిపోయింది. పిడుగురాళ్లలో 6 కి.మీ. బైపాస్‌కు సంబంధించి ఇంకా 37 ఎకరాలు సేకరించాల్సి ఉంది. బ్రాహ్మణపల్లిలో 3 కి.మీ బైపాస్‌లో విద్యుత్తు స్తంభాలు తొలగించలేదు. అద్దంకిలో 6 కి.మీ దూరం బైపాస్‌ నిర్మిస్తామని నాటి ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చారు. సర్వే పూర్తయినా అనుమతి రాలేదు. ఇప్పుడు దీనికి అవసరమైన 90 ఎకరాలు సేకరించాలంటే కొత్త భూసేకరణ చట్టం ప్రకారం కనీసం రూ.100 కోట్ల నుంచి రూ.120 కోట్ల వరకు అవసరం. దీంతో పట్టణంలోనే రహదారి విస్తరించే దిశగా అధికారులు ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు.

ఎవరి పరిధిలోకి ఎంత?
మొత్తం 212.5 కి.మీ. ఈ రహదారి రెండు రాష్ట్రాల్లో విస్తరించి ఉండడంతో ఎవరి ఆస్తులెంత అనేది తేలాల్సిఉంది. కృష్ణా నదిపై వాడపల్లి వద్ద ఉన్న వంతెన ఎవరి పరిధిలోకి వస్తుంది? ఏ రాష్ట్రంలో ఎంత ఖర్చు చేశారనే లెక్కలు తయారు చేసి విభజించాల్సిన అవసరం ఉందని అధికారులు అంటున్నారు. ఇవన్నీ పూర్తయితే కానీ నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదంటున్నారు.

కమిటీ వేసే యోచనలో రాష్ట్ర సర్కారు: నామ్‌ రహదారి ప్రారంభమై ఏడాది కూడా కాకముందే గుంతలు ఏర్పడుతున్నాయి. దీంతోపాటు పనులు పూర్తవకుండానే టోల్‌ వసూలుకు ఎలా సిఫార్సు చేశారనే ప్రశ్నా ఉత్పన్నమవుతోంది. ఈ నేపథ్యంలో నామ్‌ రహదారిపై త్వరలో కమిటీ వేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ రోడ్లు, భవనాలు, రవాణాశాఖ మంత్రి శిద్దా రాఘవరావు తెలిపారు. నిలిచిపోయిన పనులపైనా సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించారు.

నీళ్ల సీసాలపై మీ పేర్లు!

‘మంచి వ్యాపారవేత్త కావాలంటే ఎంబీఏలే చదవాల్సిన అవసరంలేదు. సామాజిక చొరవ ఉంటే చాలు! చక్కటి ఆలోచనతో ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేకుండా ఈ ఏడాదిన్నరలో రెండు...

‘బాహుబలి’ ఈ యేడాదే?!

‘బాహుబలి’ ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన అద్భుతం ఇంకా కళ్లముందు కదులుతూనే ఉంది. ఇప్పుడు అందరి దృష్టీ ‘బాహుబలి 2’పైనే. ...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net