Mon, February 08, 2016

Type in English and Give Space to Convert to Telugu

'పట్టణాభిషేకం''వాస్తవాల ప్రతిబింబంగా బడ్జెట్‌''నీటిపై నిప్పుల వాన''సీఎం మొండి అయితే.. నేను జగమొండి''తీరప్రాంత దేశాల మధ్య సహకారం పెరగాలి''ఉత్తర కొరియా రాకెట్‌ ప్రయోగం''చిరుతకు చిక్కి .. ప్రాణాలతో బయటపడి''మౌఖికంలో మార్కులు ఖాయం''ఎయిమ్స్‌కు 220 ఎకరాలు కేటాయింపు''‘అంకుర’ భయాలొద్దు'
వెబ్‌కౌన్సెలింగ్‌ కట్టుదిట్టం
ఈనాడు, హైదరాబాద్‌: ఇంజినీరింగ్‌, ఎంబీఏ, ఎంసీఏ తదితర కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే వెబ్‌ కౌన్సెలింగ్‌లో దళారులు, మధ్యవర్తులను నిరోధించేందుకు ఉన్నతస్థాయి నిపుణుల కమిటీ కీలక సిఫార్సులు చేసింది. ప్రస్తుత వెబ్‌కౌన్సెలింగ్‌ విధానంలో సమూల మార్పులకు కొన్ని ప్రతిపాదనలు సూచించింది. ఈ ప్రతిపాదనల ప్రకారం విద్యార్థి ద్రువపత్రాల పరిశీలన పూర్తయిన వెంటనే సహాయ కేంద్రంలోనే ప్రవేశాలకు వెబ్‌ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మేరకు శనివారం రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ వేణుగోపాల్‌ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు పాల్గొన్నారు. వెబ్‌, గత ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌లోని మెరుగైన అంశాలు, లోపాలపై చర్చించారు. ప్రస్తుత వెబ్‌కౌన్సెలింగ్‌ విధానాన్నే కొనసాగిస్తూ అందులో మార్పులకు సవరణలు, మార్గదర్శకాలను కమిటీ సూచించింది. సహాయ కేంద్రాలను బలోపేతం చేయాలని, అధిక సామర్థ్యం గల కంప్యూటర్లు ఎక్కువ సంఖ్యలో సమకూర్చాలని తెలిపింది. ఇప్పుడు సహాయకేంద్రాల్లో అంతర్జాల వేగం 2ఎంబీపీఎస్‌గా ఉందని.. దీన్ని 10 ఎంబీపీఎస్‌కు పెంచాలని పేర్కొంది.

ఇవీ సవరణలు...
*ప్రస్తుతం కౌన్సెలింగ్‌ సహాయ కేంద్రాలను రిజిస్ట్రేషన్‌, విద్యార్థుల ద్రువీకరణ పత్రాల పరిశీలనకు మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఇక నుంచి కళాశాల, బ్రాంచి(కోర్సు) ఎంపిక కోసం విద్యార్థులు అదేరోజు స్క్రాచ్‌కార్డు సహాయంతో అక్కడే ఆప్షన్లు ఇచ్చేలా చూడాలి.

* ద్రువపత్రాల పరిశీలన రోజునే ఆప్షన్లకు సిద్ధమై రావాలి. కౌన్సెలింగ్‌ కేంద్రంలోకి వెళ్లిన అభ్యర్థిని ఆప్షన్లు ఇవ్వడం పూర్తిచేశాకే కేంద్రం నుంచి బయటకు వెళ్లనిస్తారు.

* ఆప్షన్లు పూర్తయిన తరువాత ఆ వివరాలను ప్రింట్‌ తీసి దానిపై అభ్యర్థి, సంబంధిత అధికారి సంతకం చేస్తారు.

* సహాయ కేంద్రంలోకి అభ్యర్థి వెంట తల్లిదండ్రులు/సంరక్షకులను అనుమతిస్తారు. తమ వెంట వచ్చేవారి గుర్తింపు కార్డును ముందుగా నమోదు చేసుకోవాలి.

* ఆప్షన్లు నమోదు చేసిన తరువాత, అందులో మార్పులకూ అనుమతిస్తారు. ఉన్నత విద్యామండలి సూచించిన రోజున ఏదేని సహాయ కేంద్రానికి వెళ్లి మార్పులు చేయొచ్చు.

మాధవన్‌ పళ్లురాలగొట్టాను..!

సినిమా కోసం ఉత్తుత్తినే కాదు.. నిజంగానే అంతపని చేసిందట రితిక. గత వారం విడుదలై సంచలన విజయం సాధించిన ‘సాలా ఖడూస్‌’ చిత్రం కథానాయిక. అప్పుడెప్పుడో పరుగుల రాణీ...

ఉప్పల్‌లో పరుగుల పండగ

మ్యాచ్‌ అంటే ఇదీ.. ఆడేది సినిమావాళ్లే అయినా, అంతర్జాతీయ మ్యాచ్‌కి ఏమాత్రం తీసిపోదు. టీ ట్వంటీలో ఉండే అసలైన మజా... మరోసారి తెలిసొచ్చింది....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net