Sat, February 06, 2016

Type in English and Give Space to Convert to Telugu

'అత్యవసరాదేశం''‘మహా’ ఫలితం నేడే''హైదరావాణి''29న కేంద్ర బడ్జెట్‌''సాగరంలో సింహగర్జన''పేదలకు వరం''అతివలకు అర్ధబలం''ఎవరినీ ఉపేక్షించొద్దు''‘ఉదయ్‌’లో చేరుదామా!''సవరణల్ని చట్టసభలే చేయాలి'
ఈ జీతాలు చాలవు
యువతలో అసంతృప్తి.. సర్వేలో వెల్లడి
ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో యువత వేతనం విషయంలో అసంతృప్తితో ఉంది. ప్రస్తుతం పొందుతున్న జీతాలు ఏ మూలకూ సరిపోవడం లేదని చెబుతోంది. తాము పనిచేస్తున్న సంస్థల్లో వేతనాల్లో వృద్ధి లేకపోవడంతో వారిలో నిరాశ నెలకొంది. రోజురోజుకీ పెరుగుతున్న నిత్యావసరాల ధరలు, జీవన వ్యయాన్ని భరించలేకపోతున్నామని అంటున్నారు. వివిధ రంగాల్లో వేతన జీవులుగా పనిచేస్తున్న యువతలో దాదాపు 65 శాతం మంది వేతనాలు సంతృప్తికర స్థాయిలో లేవని వెల్లడైంది. ప్రస్తుత అసంతృప్తి నుంచి బయటపడటానికి సగటున నెలకు రూ.4,837 పెరగాల్సిన అవసరముందని కోరుతోంది. వేతనాల విష యంలో యువత ఆకాంక్షను జాతీయ నైపుణ్య అభివృద్ధి మండలి తన నివేదికలో వివరించింది.

రెండు జిల్లాల్లోనే సంతృప్తి: కార్మిక నిబంధనల ప్రకారం ప్రతి ఏడాదీ వేతనంలో వృద్ధి ఉండాల్సిందే. ఇందుకోసం ఇంక్రిమెంట్ల పద్ధతి అమల్లో ఉంది. ఈ నిబంధన చాలా సంస్థల్లో అమలు కావడం లేదని ఈ సర్వే ద్వారా వెల్లడైంది. తాము పనిచేస్తున్న సంస్థల్లో ఇంక్రిమెంట్లు లేవంటూ 50 శాతం మంది చెప్పారు. రాష్ట్రంలోని 23 జిల్లాల్లో శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లా్లల్లోని యువత మాత్రమే తాము పొందుతున్న వేతనాలపై సంతృప్తి వ్యక్తం చేసింది. అక్కడ ఇంక్రిమెంట్లు కూడా అందుకుంటున్నారు. రంగారెడ్డి, ప్రకాశం, నిజామాబాద్‌ జిల్లాల్లోని యువత.. వేతనాల విషయాన్ని పక్కన పెట్టి, తమకు మెరుగైన నైపుణ్య శిక్షణ కావాలని తేల్చి చెప్పింది. మిగతా 18 జిల్లాల్లో వేతన పెరుగుదల ఆకాంక్ష వేర్వేరుగా ఉంది. ఇక్కడి యువత సరాసరి వేతనం నెలకు రూ.7వేల నుంచి రూ.13వేల వరకు ఉంది. వీరిలో అత్యధికంగా గుంటూరు జిల్లాకు చెందిన యువత ప్రస్తుత వేతనంలో నెలకు రూ.13,223, ఆ తరువాత చిత్తూరులో నెలకు రూ.11,625 పెరుగుదల కోరుకుంటోంది. ఉపాధి రాజధానిగా పేరున్న హైదరాబాద్‌లోని యువత మాత్రం తమకు నెల వేతనంలో రూ.6వేల పెరుగుదల ఉంటే చాలని సంతృప్తి చెందుతోంది. చిత్తూరు జిల్లాలోని యువత తాము పొందుతున్న వేతనాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. అసంతృప్తి వ్యక్తం చేస్తున్న జిల్లాల్లో ఆ తరువాత విజయనగరం, హైదరాబాద్‌, కరీంనగర్‌, అనంతపురం, గుంటూరు జిల్లాలు ఉన్నాయి.
యువత ఏం కోరుకుంటోంది..!
* తొలి ప్రాధాన్యం ఉద్యోగ భద్రత.
* కుటుంబ అవసరాలను తీర్చేలా, ఆకాంక్షలు నెరవేర్చే కొలువు.
* మెరుగైన వేతనం, ప్రతియేటా ఇంక్రిమెంట్లు.
* చేస్తున్న పనిలో ఆనందం, సంతృప్తి.
* అన్ని సౌకర్యాలున్న జీవన విధానం.
* ఉద్యోగంలో చేరిన తరువాత కూడా శిక్షణ.
* ఉద్యోగానికి అవసరమైన సాంకేతిక శిక్షణ.

జీన్స్‌ ప్రభ!

కొన్నిరోజులు వాడగానే జీన్స్‌ బిగుతైపోతాయి. అలాగని వాటిని పారేయలేం. ఎందుకంటే చూడ్డానికేమో కొత్తగా ఉంటాయి. అలాంటి జీన్స్‌నే రీసైకిల్‌ చేసి కొత్త ఉత్పత్తులుగా మార్కెట్‌లోకి...

మనసంతా పొరుగు కథలపైనే!

మహేష్‌బాబు లాంటి ఒకరిద్దరు కథానాయకులు తప్ప దాదాపుగా మిగిలిన తెలుగు హీరోలందరూ రీమేక్‌ చిత్రాలపై మోజు ప్రదర్శించేవాళ్లే. పొరుగు భాషలో ఒక మంచి సినిమా...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net