Fri, February 12, 2016

Type in English and Give Space to Convert to Telugu

'వైజ్ఞానిక మైలురాయి''విశ్రమించిన వీరుడు''మేయర్‌ ఎన్నిక ఏకగ్రీవం''కారెక్కిన మరో తెదేపా ఎమ్మెల్యే''‘బేర్‌’మన్న స్టాక్‌ మార్కెట్లు''‘ఆధార్‌’ ఇక తప్పనిసరి కాదు''కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయం''ఎంపీల జీతభత్యాలు త్వరలో రెట్టింపు!''మార్చి మొదటి వారంలో ‘పుర’ ఎన్నికలు''మేడారం జాతరను జాతీయ పండుగగా ప్రకటించండి'
వేసవికి ముందే దాహం
తెలంగాణ గ్రామాల్లో మొదలైన నీటి ఎద్దడి
వర్షాభావంతో అడుగంటిన భూగర్భ జలాలు
నదీ జలాలపై ఆధారపడిన ప్రాంతాల్లోనూ సమస్య తీవ్రం
కరవు మండలాల్లో దారుణమైన పరిస్థితులు
ప్రత్యేక కార్యాచరణకు సిద్ధమవుతున్న గ్రామీణ నీటి సరఫరా శాఖ
ఈనాడు - హైదరాబాద్‌
తెలంగాణ రాష్ట్రంలో పడగ విప్పిన కరవుతో తాగునీటి సంక్షోభం వేసవి కంటే ముందే ముంచుకొస్తోంది. తీవ్ర వర్షాభావ పరిస్థి్థతుల్లో భూగర్భ జలాలు అడుగంటాయి. ప్రధాన ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు తరిగిపోయాయి. దీంతో వేల గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నెలకొంది. ఇప్పటికే పలు గ్రామాల ప్రజలు తాగునీటి సమస్యతో సతమతమవుతున్నారు. ముఖ్యంగా కరవు మండలాల పరిధిలోని 75 శాతం గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాల్సిన పరిస్థితులు నెలకొని ఉన్నట్లుగా తెలంగాణ రాష్ట్ర గ్రామీణ నీటిసరఫరా శాఖ అంచనా వేసింది. ఈ నెల వరకూ ఏదో రూపంలో నెట్టుకు వచ్చినా ఎండలు తీవ్రమయ్యే ఫిబ్రవరి నుంచి ఈ సమస్య మరింత జఠిలం కానుంది.

నిజామాబాద్‌ జిల్లాలోని వందలాది గ్రామాల్లో తాగునీటి కొరత నెలకొంది. గిరిజన ప్రాంతాలతో బాటు తాగునీటి అవసరాలకు నదులపై ఆధారపడిన గ్రామాల ప్రజలు గుక్కెడు నీటి కోసం మైళ్లదూరం వెళ్లాల్సి వస్తోంది. కరీంనగర్‌, మెదక్‌, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లోనే పదివేలకు పైగా గ్రామాల్లో తాగునీటి సమస్య పొంచి ఉందని గుర్తించారు. ఆదిలాబాద్‌, ఖమ్మం జిల్లాల్లో కరవు మండలాలు లేకున్నా సుమారు రెండు వేల గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు ఇప్పుడే మొదలయ్యాయి. వేసవి రాకముందే భూగర్భ జలాల మట్టం దారుణంగా పడిపోవడంతో వందల గ్రామాల్లోని గొట్టపు బావుల(బోర్ల)లో నీరు అందడంలేదు. ఈ సమస్యను పరిష్కరించటానికి సుమారు 17 వేలకు పైగా గొట్టపు బావుల లోతును పెంచాల్సి ఉంటుంది. సుమారు 400 బావుల్లో పూడిక తీయాల్సి ఉంటుందని గుర్తించారు. గతంలో ఎన్నడూ లేనంతగా ప్రాజెక్టుల్లోనూ నీటి లభ్యత లేకపోవడంతో గోదావరి, మానేరు, మంజీర, కృష్ణా నదులపై ఆధారపడిన వేల గ్రామాల్లో తాగునీటికి జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

బహుముఖ వ్యూహం తప్పనిసరి
వేసవిలో రాష్ట్రంలోని 75 శాతం పైగా గ్రామాలకు నీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయడం తప్పనిసరి అని గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులు అంచనా వేశారు. తాగునీటి సమస్యను అధిగమించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ఈ శాఖ దృష్టి సారించింది. ట్యాంకర్ల ద్వారా సరఫరా పెంచటం, ప్రైవేటు తాగునీటి వనరులను అద్దెకు తీసుకోవటం, గొట్టపు బావుల లోతు పెంచటం, బావుల్లో పూడిక తీయడం వంటి పనులు చేపడితే తప్ప వేసవిలో నీటి ఎద్దడిని గట్టెక్కే పరిస్థితి లేదని గుర్తించారు. ఆరు నెలల పాటు సుమారు సగానికిపైగా గ్రామాలకు తాగునీటిని సరఫరా చేయాల్సి ఉంటుంది. ఈ ప్రత్యేక కార్యాచరణ ఉంటే తప్ప తెలంగాణ రాష్ట్రంలో వేసవిలో తాగునీటి సమస్య గండం నుంచి గట్టెక్కే పరిస్థితి ఉండదు. ఇందుకోసం 300 కోట్ల రూపాయలుపైగా ప్రత్యేకంగా అవసరమవుతాయని గ్రామీణ నీటిసరఫరా శాఖ అంచనా వేసింది. వీటిలో రూ.200 కోట్లకుపైగా ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకే అవసరం కానుంది.


సమంత@100 కేజీలు

మొదటి సినిమాలో సన్నగా సన్నజాజి తీగలా కనిపించి..రెండో చిత్రానికి వచ్చేసరికి బొద్దుగుమ్మగా దర్శనమిచ్చారు ఎంతో మంది కథానాయికలు....

మణిరత్నం వీరాభిమానిని!

హను రాఘవపూడి... తీసింది ‘అందాల రాక్షసి’ ఒక్కటే. దాని చుట్టూ బోలెడు కామెంట్లు.. కాంప్లిమెంట్లు. ‘మణిరత్నం ప్రభావం కుర్రాడిపై చాలా ఎక్కువ ఉంది’ అనుకొన్నారు చాలామంది....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net