Mon, February 08, 2016

Type in English and Give Space to Convert to Telugu

'పట్టణాభిషేకం''వాస్తవాల ప్రతిబింబంగా బడ్జెట్‌''నీటిపై నిప్పుల వాన''సీఎం మొండి అయితే.. నేను జగమొండి''తీరప్రాంత దేశాల మధ్య సహకారం పెరగాలి''ఉత్తర కొరియా రాకెట్‌ ప్రయోగం''చిరుతకు చిక్కి .. ప్రాణాలతో బయటపడి''మౌఖికంలో మార్కులు ఖాయం''ఎయిమ్స్‌కు 220 ఎకరాలు కేటాయింపు''‘అంకుర’ భయాలొద్దు'
‘అచ్ఛేదిన్‌’ దిశగా అడుగులు పడాలి!
ఎగుమతులతోనే ఆర్థికాభివృద్ధి
ఆన్‌లైన్‌ వ్యాపారం ద్వారా భారీసంఖ్యలో ఉద్యోగావకాశాలు
ఉపాధి కల్పించనున్న సేవారంగం
గురుచరణ్‌దాస్‌
ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఈ ఏడాది అత్యంత కీలకం. ఆర్థికాభివృద్ధి పుంజుకొని, ఉద్యోగాల కల్పన జరగకపోతే ‘అచ్ఛేదిన్‌’ను (మంచిరోజుల్ని) మనం మర్చిపోవాల్సిందే. ఆర్థికాభివృద్ధి ఉన్న వ్యవస్థలు మాత్రమే ఉద్యోగాల్ని సృష్టించగలవు. ఉద్యోగాల్ని సృష్టించాలన్నా, పేదదేశాన్ని సంపన్నదేశంగా మార్చాలన్నా ఏకైకమార్గం.. తక్కువ సాంకేతికతతో, ఎక్కువమంది కార్మికుల శ్రమతో తయారైన సరుకులను ఎగుమతి చేయటమే. తూర్పు ఆసియా, చైనా, ఆగ్నేయాసియా దేశాలు మధ్యతరగతి వ్యవస్థలుగా వృద్ధి చెందింది ఈ మార్గంలోనే. ‘తయారీరంగం బస్సును’ అందుకోవటంలో భారత్‌ గత 60 ఏళ్లుగా విఫలమవుతూనే ఉంది. ఫలితంగా ప్రపంచంలోనే అత్యంత పేద, అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఈరోజు నిలబడింది. భారతీయుల సగటు ఆదాయం ప్రపంచ సగటు ఆదాయంలో ఆరోవంతుకన్నా తక్కువ. ఇది లావోస్‌, జాంబియా, సూడాన్‌ దేశాలకన్నా తక్కువ.

1960లలో జపాన్‌ ఒక ఆర్థికశక్తిగా ముందుకురావటాన్ని ప్రపంచం గమనించింది. ఆటబొమ్మలను, బూట్లను, సాదాసీదా వస్తువులను ఎగుమతి చేయటం ద్వారా ఆ దేశం తనప్రజలకు భారీఎత్తున ఉద్యోగాలను కల్పించింది. జపాన్‌ విజయాన్ని గుర్తించిన దక్షిణకొరియా, తైవాన్‌, హాంకాంగ్‌, సింగపూర్‌ అదేబాటన నడిచి పేదరికాన్ని నిర్మూలించాయి. కొత్త ఆర్థికశక్తులుగా ఆవిర్భవించి సంపన్నదేశాల సరసన నిలిచాయి. ఇండొనేసియా, మలేసియా, ఫిలిప్పీన్స్‌, థాయ్‌లాండ్‌ తదితర ఆగ్నేయాసియా దేశాలు 1970లలో ఈ పరిణామాన్ని గుర్తించాయి. జపాన్‌ మార్గాన్ని అనుసరించి గౌరవప్రదమైన మధ్యతరగతి ఆర్థికవ్యవస్థలుగా రూపొందాయి. జపాన్‌ చూపించిన దారిలో.. ఇటీవలికాలంలో ప్రయాణించి అభివృద్ధి సాధించిన దేశం చైనా. ఆ దేశం అత్యద్భుతమైన విజయాన్ని మూటగట్టుకొని ప్రపంచ కర్మాగారంగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు చైనా జనాభాలో 60 శాతం మంది మధ్యతరగతికి స్థాయిలో ఉన్నారు.

‘తయారీరంగం బస్సు’ను మనదేశం అందుకునేలా చూస్తానంటూ ఇచ్చిన హామీ కారణంగానే మోదీని మనం ఎన్నుకున్నాం. కానీ ఇప్పటివరకైతే ఉద్యోగాలు రాలేదు. 2014 మే నెలలో ఆయన ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పుడు భారీఎత్తున అంచనాలు ఉన్నాయి. అదేసమయంలో.. ఆయనకు వారసత్వంగా లభించిన ఆర్థికరంగం దారుణమైన స్థితిలో ఉందని, అది కోలుకోవటానికి సమయం పడుతుందని ఆర్థికవేత్తలు జాగ్రత్తలు చెప్పారు. ‘పెట్టుబడి చక్రం’ ఒక నిర్ణీతకాలవ్యవధి ప్రకారం తిరుగుతుందని, మరో రెండేళ్లలో మంచి అభివృద్ధి నమోదవుతుందని వారు తెలిపారు. ఇదే విషయాన్ని ప్రజలకు మోదీ నాడు వివరించి చెబితే అవాస్తవ అంచనాలు మాయమయ్యేవి. ఇప్పుడున్న నిరాశాపూరిత వాతావరణం నెలకొనేది కాదు. కానీ, ఆయన ఆ పని చేయలేదు. అయినప్పటికీ.. ఈ మధ్యకాలంలో ఆర్థికరంగం పుంజుకుంది. కానీ వినియోగదారుల డిమాండ్‌ మాత్రం చాలాబలహీనంగానే ఉంది. భారీరుణభారంతో కంపెనీలు కునారిల్లుతున్నాయి. దీంతో కొత్తగా పెట్టుబడులు పెట్టటానికి, ఉద్యోగులను తీసుకోవటానికి అవి ముందుకు రావటం లేదు. దీనివల్లే డిమాండ్‌ బలహీనపడిపోయింది. కంపెనీలు రుణాలను చెల్లించకపోవటంతో బ్యాంకులు సమస్యల్లో ఉన్నాయి. నూతన పారిశ్రామికవేత్తలకు అప్పులు ఇవ్వటం లేదు. దీంతో కొత్తగా పరిశ్రమల ఏర్పాటు, ఉద్యోగాల కల్పన సాధ్యంకాని పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు.. మోదీకి పరీక్షాకాలం మించిపోతోంది. ‘రెండేళ్ల మార్కెట్‌ మందగమన దశ’ ముగిసిపోనుంది. ఇకపై ఆర్థికరంగాన్ని ప్రతీ త్రైమాసికం చొప్పున వేగవంతం చేయాల్సి ఉంటుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆర్థికాభివృద్ధిని మరోరెండుశాతం పెంచాలి. అంటే.. ఏటా 1.2 కోట్ల ఉద్యోగాలను సృష్టించాలి.

కానీ ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? తయారీ రంగానికి రోజులు ముగిశాయని, ఇప్పుడున్నదంతా ‘ఆటోమేటెడ్‌’ యుగం కాబట్టి నైపుణ్యంలేని కార్మికులకు ఉద్యోగాలు దొరకటం అసాధ్యమనే వాదనలు వినిపిస్తున్నాయి. కొంతవరకు ఇది నిజమే అయినా పూర్తి వాస్తవం కాదు. గతేడాది ప్రపంచవ్యాప్తంగా సరుకుల ఎగుమతుల మొత్తం విలువ రూ.1,221 లక్షల కోట్లు. దీంట్లో కేవలం చైనా వాటానే రూ.156 లక్షల కోట్లు. మనం కూడా ఈ రంగంపై ఎందుకు దృష్టి పెట్టకూడదు? మనం తయారీరంగం విప్లవాన్ని ఒడిసిపట్టుకోలేకపోయామన్నది నిజమే కానీ సేవారంగం ద్వారా కూడా ఆర్థికరంగాన్ని కొత్తపుంతలు తొక్కించే అవకాశాలకూ కొదవలేదు. ఉదాహరణకు.. మనదేశంలో విక్రయించే ప్రతీమూడుకార్లకు ఒక డ్రైవర్‌ ఉద్యోగం అవసరమవుతోందని అంచనా. ఏటా 25 లక్షల కార్ల అమ్మకాలు జరుగుతున్నాయి. ఈ లెక్కన ఏటా కొత్తగా 8 లక్షల మందికి డ్రైవర్‌ ఉద్యోగాలు లభిస్తాయి. వాణిజ్యవాహనాలను కూడా తీసుకుంటే ఏటా మరో ఏడు లక్షల డ్రైవర్‌ ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయి. మరోవైపు ఇంటర్నెట్‌ వేదికగా జరుగుతున్న వ్యాపారం (ఈ-కామర్స్‌) కూడా భారీసంఖ్యలో ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉంది. 2020 నాటికి ఆన్‌లైన్‌లో 13 లక్షల మంది అమ్మకందార్లు ఉంటారని, రూ.6,10,469 కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనాలున్నాయి. ప్రతీ ఆన్‌లైన్‌ ఆమ్మకందారు ప్రత్యక్షంగా నాలుగు ఉద్యోగాలను, పరోక్షంగా 12 ఉద్యోగాలను సృష్టిస్తారు. ఈ లెక్కన ఈ-కామర్స్‌ ద్వారా రెండు కోట్ల ఉద్యోగాలు ఉనికిలోకి వస్తాయి. దీంట్లో సగం వాస్తవరూపం దాల్చినా కొత్తగా కోటి ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అంకుర పరిశ్రమల (స్టార్టప్‌) హవా నడుస్తోంది. పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహమిచ్చి వారు ఎదిగేందుకు అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. మనదేశంలో ఈ అవసరాన్ని గుర్తించిన తొలిప్రభుత్వం ఇదే. మరోవైపు.. స్టార్టప్‌లను ఆకర్షించటానికి దక్షిణాదిన ఇప్పటికే పలురాష్ట్రాలు ఇంక్యుబేటర్లను, ఇన్నోవేషన్‌పార్కులను నెలకొల్పాయి. ఇవన్నీ సానుకూల పరిణామాలు.

రాజకీయ నాయకులను ఎందుకు ఎన్నుకున్నామో వారికి ఎప్పటికప్పుడు గుర్తుచేయాల్సి ఉంటుంది. ఉద్యోగాలకు, అవకాశాలకు ఒక సంకేతనామం ‘అచ్చేదిన్‌’. విదేశీ వ్యవహారాల్లో మోదీ మంచి ఫలితాలను సాధిస్తున్నారు. కానీ, దేశం ఆయనను ఎన్నుకొన్నది ఉద్యోగాల కోసం. కాబట్టి.. సమర్థురాలైన విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్‌కు ఆ వ్యవహారాలను అప్పగించి ఉద్యోగాల కల్పన, అభివృద్ధి, అచ్చేదిన్‌పైన మోదీ దృష్టి సారించటం మంచిది.

మాధవన్‌ పళ్లురాలగొట్టాను..!

సినిమా కోసం ఉత్తుత్తినే కాదు.. నిజంగానే అంతపని చేసిందట రితిక. గత వారం విడుదలై సంచలన విజయం సాధించిన ‘సాలా ఖడూస్‌’ చిత్రం కథానాయిక. అప్పుడెప్పుడో పరుగుల రాణీ...

‘శ్రీశ్రీ’ డబ్బింగ్‌ పూర్తి

అలనాటి తెలుగు సూపర్‌స్టార్‌ కృష్ణ, ఆయన భార్య విజయ నిర్మల కీలక పాత్రధారులుగా తెరకెక్కిన ‘శ్రీశ్రీ’ చిత్రం దాదాపు పూర్తయ్యింది....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net