Mon, February 08, 2016

Type in English and Give Space to Convert to Telugu

'పట్టణాభిషేకం''వాస్తవాల ప్రతిబింబంగా బడ్జెట్‌''నీటిపై నిప్పుల వాన''సీఎం మొండి అయితే.. నేను జగమొండి''తీరప్రాంత దేశాల మధ్య సహకారం పెరగాలి''ఉత్తర కొరియా రాకెట్‌ ప్రయోగం''చిరుతకు చిక్కి .. ప్రాణాలతో బయటపడి''మౌఖికంలో మార్కులు ఖాయం''ఎయిమ్స్‌కు 220 ఎకరాలు కేటాయింపు''‘అంకుర’ భయాలొద్దు'
క్షేత్రస్థాయికి మంత్రుల బృందం
రాజధానిపై ముమ్మరంగా కసరత్తు
వచ్చే నెల మొదటి వారంలో రైతులతో భేటీ
అవసరం మేరకు హాజరుకానున్న చంద్రబాబు
భూమి ఇస్తే లభించే ప్రయోజనాలపై వివరణ
రెండో వారం నుంచే సమీకరణకి శ్రీకారం
అంతర్జాతీయ సంస్థలతో డిజైన్ల రూపకల్పన
అప్పుడే ఏ నిర్మాణం ఎక్కడన్నది ఖరారు
ఈనాడు - హైదరాబాద్‌
ఆంధ్రప్రదేశ్‌ కొత్త రాజధాని నిర్మాణానికి అవసరమైన భూసమీకరణ కోసం మంత్రివర్గ ఉప సంఘం నవంబర్‌ మొదటి వారంలో క్షేత్రస్థాయిలో పర్యటించబోతోంది. భూమి యజమానులైన రైతులతో సమావేశం కాబోతోంది. సమీకరణ విధానంలో భూములిస్తే లభించే ప్రయోజనాలను వారికి వివరించనుంది. వరుసగా పది రోజులపాటు అక్కడే మకాం వేసి ప్రతిపాదిత రాజధాని నిర్మాణ ప్రాంతం పరిధిలోకొచ్చే రైతులతో సమావేశాలు నిర్వహించాలని భావిస్తోంది. రైౖౖతులు సుముఖత చూపినచోట రెండో వారం నుంచే భూసమీకరణ ప్రక్రియను ప్రారంభించాలనుకుంటోంది. క్షేత్రస్థాయి అవసరాన్నిబట్టి రైతులతో జరిగే సమావేశాలకు సీఎం చంద్రబాబు సైతం హాజరయ్యే అవకాశం లేకపోలేదని ఉన్నతాధికార వర్గాల కథనం. సమీకరణకు ముందుకొచ్చిన రైతులకు... అభివృద్ధి చేసిన భూమిని కేటాయించే విస్తీర్ణం, నగదు రూపంలో పరిహారం, రిజిస్ట్రేషన్‌ వంటి ఫీజుల రాయితీతోసహా అన్ని అంశాలపై తుదినిర్ణయం తీసుకునేందుకు ఈనెల 29 లేదా 30 తేదీల్లో మంత్రివర్గ ఉప సంఘం సమావేశం కానుంది. ప్రకాశం బ్యారేజీ నుంచి గుంటూరు జిల్లా వైపు సీతానగరం పక్క నుంచి బ్యారేజీ బ్యాక్‌ వాటర్‌ పొడవునా 20 కిలోమీటర్ల పొడవు, 10 కిలోమీటర్ల వెడల్పున మొత్తం 200 చదరపు కిలోమీటర్ల ప¾రిధిని ప్రాథమికంగా రాజధాని నిర్మాణం కోసం గుర్తించారు. ఈ ప్రాంతం గుంటూరు జిల్లా పరిధిలోని తాడేపల్లి, తుళ్లూరు, తాడికొండ, మంగళగిరి మండలాల పరిధిలో ఉంటుంది. ఇందులో నుంచే రైతులు సుముఖత చూపినచోట్ల 30వేల ఎకరాల్ని సమీకరించాలని భావిస్తున్నారు. సమీకరించాల్సిన విస్తీర్ణం కొంత తగ్గే అవకాశమూ ఉందని ఈ వ్యవహారాల్ని పర్యవేక్షిస్తున్న సీనియర్‌ అధికారి ఒకరు ‘ఈనాడు’కి తెలిపారు. ఈ ప్రాంతంలో వందల కిలోమీటర్ల పొడవున రకరకాల రహదారులున్నాయి. ఆర్‌ అండ్‌ బీ, ప¾ంచాయతీరాజ్‌ శాఖల పరిధిలోని వాటితోపాటు దశాబ్దాల నుంచి రైతులు వివిధ అవసరాల కోసం వినియోగిస్తున్న డొంక దారుల విస్తీర్ణమే 10-15శాతం ఉంటుందని ప్రాథమిక అంచనా. ప్రభుత్వ భూములు, అటవీశాఖ పరిధిలోని భూములు దీనికి అదనం. ఆ 200 చదరపు కిలోమీటర్ల పరిధిలో చిన్న, పెద్దవి కలిపి 16 చెరువులు ఉన్నాయి. చెరువుల్ని, చెరువు శిఖం భూముల్ని నిర్మాణాల కోసం వాడుకునే వీలులేకున్నా... అవకాశమున్నచోట్ల వీటి చుట్టూ పార్కులు అభివృద్ధి చేయొచ్చు. ఇవన్నీ రాజధానిలో భాగంగా కలసిపోతాయి. రహదారుల్ని అవసరాన్నిబట్టి అలాగే ఉంచొచ్చు. లేకుంటే నిర్మాణాలకు వాడుకునేలా మార్చుకోవచ్చు. గ్రామకంఠం వంటి ప్రజలు ఉమ్మడిగా వాడుకునే భూముల్ని మినహాయించి మిగిలిన ప్రభుత్వ భూమిని రాజధాని పరిధిలోకి తీసుకోవచ్చని అధికార వర్గాల కథనం. అటవీ భూమికి మాత్రం కేంద్రంతోపాటు సుప్రీంకోర్టు అనుమతి అవసరమవుతుంది. రాజధాని నిర్మాణానికి అటవీ భూముల్ని డీ-నోటిఫై చేయొచ్చని రాష్ట్ర పునర్‌విభజన చట్టంలో ఉన్న విషయం విదితమే. దీనికి అనుగుణంగా ఇప్పటికే అటవీ భూముల డీ-నోటిఫికేషన్‌కి సంబంధించిన ప్రక్రియను జిల్లా యంత్రాంగం ప్రారంభించింది. ఇలా ఎంత భూమి అందుబాటులోకి వస్తుందన్నదాన్ని బట్టి కూడా సమీకరణ ఆధారపడుతుంది. ప్రతిపాదిత స్థలం పరిధిలో 17కాలనీలు ఉన్నాయి. చిన్న, పెద్ద గ్రామాలు 15పైగానే ఉన్నాయని సమాచారం. వీటిని అలాగే ఉంచి రాజధానికి ధీటుగా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తారు. భూసమీకరణకి ముందుకొచ్చినచోట్ల రైతులతో ఒప్పందాలు కుదిరిన తరువాత అవసరాన్నిబట్టి చివరి ప్రయత్నంగా మాత్రమే భూసేకర½ణ చేయాలని భావిస్తున్నారు. ఈలోగానే రాజధాని నిర్మాణానికి డిజైన్లను రూపొందించే బాధ్యతను అంతర్జాతీయ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించనుంది. ప్రస్తుతం 200చదరపు కిలోమీటర్ల పరిధిని గుర్తించినప్పటికీ సమీకరణ, సేకరణ తరువాత భూమి వాస్తవ స్వరూపం తెలుస్తుంది. అంటే ఇప్పటికే ప్రాథమికంగా గుర్తించినట్లు దీర్ఘచతురస్రాకారంలోనే ఉంటుందా, చతురస్రమవుతుందా, కాస్త అటుఇటుగా వృత్తాకారంగా ఉంటుందా అన్నది తేలుతుంది. దీన్నిబట్టి డిజైన్లు రూపొందుతాయి. ఏ నిర్మాణం ఎక్కడ వస్తుందన్నది అప్పుడే తెలుస్తుంది. అంతర్జాతీయ సంస్థలు అందించే అయిదారు డిజైన్ల నుంచి ఒక దానిని రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేస్తుంది. సచివాలయం, శాసనసభ, రాజ్‌భవన్‌, ముఖ్యమంత్రి, మంత్రుల నివాసాలు వంటి కీలక నిర్మాణాల నుంచి ప్రకాశం బ్యారేజీ బ్యాక్‌ వాటర్‌ కనిపించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీని ప్రకారం బ్యారేజీ నుంచి సుమారు అర కిలోమీటర్‌ నుంచి కిలోమీటర్‌ దూరంలోనే ఈ నిర్మాణాలొచ్చే వీలుందని అంచనా.

మాధవన్‌ పళ్లురాలగొట్టాను..!

సినిమా కోసం ఉత్తుత్తినే కాదు.. నిజంగానే అంతపని చేసిందట రితిక. గత వారం విడుదలై సంచలన విజయం సాధించిన ‘సాలా ఖడూస్‌’ చిత్రం కథానాయిక. అప్పుడెప్పుడో పరుగుల రాణీ...

‘శ్రీశ్రీ’ డబ్బింగ్‌ పూర్తి

అలనాటి తెలుగు సూపర్‌స్టార్‌ కృష్ణ, ఆయన భార్య విజయ నిర్మల కీలక పాత్రధారులుగా తెరకెక్కిన ‘శ్రీశ్రీ’ చిత్రం దాదాపు పూర్తయ్యింది....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net