Fri, February 12, 2016

Type in English and Give Space to Convert to Telugu

'వైజ్ఞానిక మైలురాయి''విశ్రమించిన వీరుడు''మేయర్‌ ఎన్నిక ఏకగ్రీవం''కారెక్కిన మరో తెదేపా ఎమ్మెల్యే''‘బేర్‌’మన్న స్టాక్‌ మార్కెట్లు''‘ఆధార్‌’ ఇక తప్పనిసరి కాదు''కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయం''ఎంపీల జీతభత్యాలు త్వరలో రెట్టింపు!''మార్చి మొదటి వారంలో ‘పుర’ ఎన్నికలు''మేడారం జాతరను జాతీయ పండుగగా ప్రకటించండి'
కోతల కాలం మొదలైంది
ఈనాడు - హైదరాబాద్‌
లికాలంలో విద్యుత్తు ఉక్కపోత మొదలైంది. జల, థర్మల్‌ విద్యుదుత్పత్తి తగ్గుముఖం పట్టడంతో కోతలు మొదలుపెట్టారు. గ్రామీణ ప్రాంతాలకు పగటిపూట ఏడు గంటలు విద్యుత్తు సరఫరా చేస్తున్నట్లు చూపిస్తున్నారు. అది కూడా రెండు దఫాలగా ఇవ్వడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పల్లెలకు చాలాచోట్ల గరిష్ఠంగా నాలుగు గంటలకు మించి సరఫరా ఉండడం లేదు. రాష్ట్రంలో ఉన్న ముఖ్య నగరాలను కోతల నుంచి మినహాయించారు. మండల కేంద్రాల్లో ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలపాటు కోతలు విధిస్తున్నారు. జిల్లా కేంద్రం, పురపాలక సంఘాల్లో ఉదయం ఒక గంట, సాయంత్రం ఒక గంటపాటు కోత విధిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న నాలుగు విద్యుత్తు పంపిణీ సంస్థల పరిధిలో ఉన్న జిల్లాల్లో శాఖా పరంగా ఇవి అమలవుతున్నాయి. అధికారికంగా ప్రకటించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా గురువారం నాటికి 11,079 మెగావాట్ల డిమాండ్‌ ఉంటే 10,829 మెగావాట్ల విద్యుత్తు మాత్రమే అందుబాటులో ఉంది. 250 మెగావాట్ల విద్యుత్తు లోటు ఏర్పడింది.

జెన్‌కో విద్యుత్కేంద్రాలకు బొగ్గు గండం
ఏపీ జెన్‌కోకు బొగ్గు కొరత కారణంగా చాలా యూనిట్లలో ఉత్పత్తి నిలిపేస్తున్నారు. థర్మల్‌ విద్యుత్కేంద్రాల్లో 15 రోజులు వరకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండాల్సి ఉండగా.. చాలా విద్యుత్కేంద్రాల్లో రెండు, మూడు రోజులకు సరిపడా బొగ్గు మాత్రమే అందుబాటులో ఉంది. సింగరేణి నుంచి నాసిరకం బొగ్గు సరఫరా కారణంగా కొన్నిసార్లు విద్యుదుత్పత్తికి ఆటంకం ఏర్పడుతోంది. ఒడిశాలోని మహానది బొగ్గు గనుల నుంచి సరఫరా కావాల్సిన బొగ్గుకు ఇటీవల కాలంలో కొంత అంతరాయం ఏర్పడింది. దాని ప్రభావం విజయవాడ థర్మల్‌ విద్యుత్కేంద్రం, రాయలసీమ థర్మల్‌ విద్యుత్కేంద్రంపై ఉంది. జెన్‌కో విద్యుత్కేంద్రాల్లో ప్రస్తుతం ఉన్న బొగ్గు నిల్వలు, రోజువారీ వినియోగం వివరాలు ఇలా ఉన్నాయి...

సమంత@100 కేజీలు

మొదటి సినిమాలో సన్నగా సన్నజాజి తీగలా కనిపించి..రెండో చిత్రానికి వచ్చేసరికి బొద్దుగుమ్మగా దర్శనమిచ్చారు ఎంతో మంది కథానాయికలు....

40ల నాటి సెట్స్‌లో ఫరా ఖాన్‌, విశాల్‌ భరద్వాజ్‌

ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు విశాల్‌ భరద్వాజ్‌ దర్శకత్వంలో కంగనా రనౌత్‌, షాహిద్‌ కపూర్‌, సైఫ్‌ అలీ ఖాన్‌లు ప్రధాన తారాగణంగా........

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net