Tue, February 09, 2016

Type in English and Give Space to Convert to Telugu

'ఔషధనగరిలో ప్రపంచశ్రేణి విశ్వవిద్యాలయం''భూసేకరణ, పునరావాసాలకేరూ. 8,000 కోట్లు''నెట్‌ సమానత్వానికే ట్రాయ్‌ మొగ్గు!''ముద్రగడ దీక్ష విరమణ''తెలంగాణ ప్రణాళిక భేష్‌''విద్వేషాలు రెచ్చగొడుతూ రాజకీయాలా?''డాక్టర్‌.. ధనాధన్‌..''రసాయన పరిశ్రమలో పేలుడు''నడి వీధిలో పైశాచికం''పాక్‌ నుంచే కుట్ర'
45 రోజుల్లో భూసమీకరణ
30న యనమల కమిటీ భేటీ
కృష్ణా, గుంటూరు కలెక్టర్లకూ ఆహ్వానం
చండీగఢ్‌ తరహాలో సెక్టార్లుగా రాజధాని
పారిశ్రామిక జోన్లు ఉండవు
ఏటా ఎకరాకు రూ.25వేల పరిహారం
భవానీ ద్వీపం ఎదురు నుంచి భూమి గుర్తింపు
ఈనాడు - హైదరాబాద్‌
ఆంధ్రప్రదేశ్‌ రాజధాని తొలి దశ నిర్మాణానికి అవసరమయ్యే 30వేల ఎకరాల భూ సమీకరణను 45 రోజుల్లో పూర్తిచేయాలని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలోని భూసమీకరణ కమిటీ భావిస్తోంది. ఈనెల 30న సాయంత్రం హైదరాబాద్‌లో సమావేశం కాబోతున్న ఈ మంత్రివర్గ ఉపసంఘం భూ సమీకరణకు సంబంధించిన విధివిధానాలపై తుది నిర్ణయం తీసుకోనుంది. అదేరోజు ఉదయం జరిగే మంత్రివర్గ సమావేశంలో రాజధాని భూసమీకరణకు అనుసరించబోయే విధివిధానాల గురించి ప్రస్తావించి, సాయంత్రం జరిగే ఉపసంఘంలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు అధికారవర్గాల ద్వారా తెలిసింది. వీటిపై మంత్రివర్గం ఆరోజు ఆమోదముద్ర వేయదని సమాచారం. మంత్రివర్గ ఉపసంఘమే విధివిధానాలను అధికారికంగా వెల్లడిస్తుందని, వాటిపై ప్రజల నుంచి వచ్చే అభిప్రాయాలు స్వీకరించి, రైతులతో చర్చోపచర్చలు జరిపిన అనంతరం తీసుకొనే తుది నిర్ణయాలనే మంత్రివర్గ సమావేశంలో పెట్టి ఆమోదించనున్నట్లు తెలిసింది.

శ్రీకారం ఇలా..: విజయవాడలోని భవానీ ద్వీపం ఎదురుగా, కృష్ణానదీతీరం నుంచి భూ సమీకరణ మొదలుపెట్టబోతున్నట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి అవసరమైన ముఖ్యమైన ప్రభుత్వ భవనాలన్నీ గుంటూరు జిల్లాలోనే ఉంటాయని సమాచారం. కృష్ణాజిల్లావైపునా కొన్ని ప్రభుత్వ సంస్థలు ఏర్పాటవుతాయని తెలిసింది. గుంటూరు, కృష్ణా రెండు జిల్లాలను కలుపుతూ రాజధాని నిర్మించాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు పేర్కొన్నారు. రైతుల నుంచి సేకరించే భూమిలో 50% అభివృద్ధికిపోను, మిగిలిన దాంట్లో 60% ప్రభుత్వానికి, 40% రైతులకు కేటాయించాలనుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ భూమిలోకూడా రోడ్లు, తాగునీరు, విద్యుత్తులాంటి అన్ని మౌలికవసతులనూ ప్రభుత్వమే కల్పించి ఇస్తుందని తెలిపారు. రాజధానిని చండీగఢ్‌ తరహాలో సెక్టార్లవారీగా నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోందని, రైతులకు భూములను సెక్టార్లవారీగా ఇస్తామని వెల్లడించారు. భూసమీకరణ చాలా సున్నితంగా జరిగిపోతుందని ప్రగాఢంగా నమ్ముతున్నామని, అక్కడక్కడా ఎవరైనా మొరాయిస్తే అలాంటివారి భూములను సేకరిస్తామని చెప్పారు.

పదేళ్లపాటు పరిహారం: రాజధాని కోసం భూములు ఇచ్చే రైతులు దానిపై వచ్చే ఆదాయాన్ని కోల్పోతారన్న ఉద్దేశంతో ఎకరాకు రూ.25వేలు ఇవ్వాలని ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. మొత్తం మౌలికవసతులు కల్పించి రైతులవాటాను వారికి తిరిగి ఇచ్చిన తర్వాత కూడా అయిదేళ్లపాటు ఈ పరిహారం చెల్లిస్తారు. మొత్తం పదేళ్లపాటు ఈ పరిహారం ఇస్తారు. ఒకవేళ ఎవరైనా మధ్యలోనే అమ్ముకుంటే మాత్రం నిలిపేస్తారు. భవానీ ద్వీపం ఎదురుగా ఉన్న ప్రాంతం నుంచి ప్రభుత్వ, అటవీ భూముల లెక్కలు తెలుసుకోవడానికి ఈనెల 30వ తేదీ నాటి మంత్రివర్గ ఉపసంఘం భేటీకి కృష్ణా, గుంటూరు జిల్లా కలెక్టర్లను ఆహ్వానించారు.

పరిశ్రమలన్నీ ఇతర ప్రాంతాలకు: రాజధానిప్రాంతంలో పారిశ్రామిక జోన్లు ఉండబోవని అధికారవర్గాలు వెల్లడించాయి. పరిశ్రమలన్నీ నూజివీడు, కాకినాడ, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లోని ప్రాంతాలకు వెళ్తాయని చెప్పాయి. రాజధాని మూడో రింగ్‌ పూర్తయ్యేనాటికి గుంటూరు-విజయవాడలు దాని పరిధిలోకే వస్తాయని వెల్లడించాయి. రాజధాని అభివృద్ధి కోసం ఇప్పటికే జపాన్‌, అమెరికా, ఆస్ట్రేలియా సంస్థలు ముందుకొచ్చినప్పటికీ ప్రభుత్వం అంతర్జాతీయ బిడ్డింగ్‌ ద్వారా కన్సల్టెన్సీలను ఖరారుచేసి డిజైన్‌ రూపొందిస్తుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. విభజన చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం భూమి చూపిస్తే, రాజధానిలోని ప్రధాన భవనాలు, ఇతర అత్యవసర మౌలిక వసతులకు అయ్యే ఖర్చంతా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశాయి.

వరద ముప్పు ఉండదు : నదీతీరంలో తలపెట్టిన రాజధానికి భవిష్యత్తులో వరద ముప్పు ఉంటుందన్న వాదనలను ప్రభుత్వ వర్గాలు కొట్టిపారేశాయి. గుంటూరు జిల్లాలోని భూభాగం నదికంటే చాలా ఎత్తున ఉంటుంది కాబట్టి ప్రకృతివైపరీత్య ప్రభావమేమీ ఉండదని ధీమా వ్యక్తంచేశాయి. రాజధాని తలపెట్టిన ప్రాంతం వాస్తురీత్యాకూడా అనుకూలంగా ఉంటుందని చెబుతున్నాయి. తూర్పు దిశగా నీటి ప్రవాహం ఉండి, ఈశాన్య ముఖంగా భవనాలు ఉంటాయని చెప్పాయి.

పదుగురి కోసం ఆరుగురం!

కాలేజీ స్నేహితులకో వాట్స్‌యాప్‌ గ్రూప్‌ చిన్నప్పటి మిత్రులకో ఫేస్‌బుక్‌ గ్రూప్‌ బంధువులందరినీ కలిపేందుకు గూగుల్‌ ప్లస్‌.. ఇలా నేటి సామాజిక మాధ్యమాలని మస్తుగా వాడుకుంటోంది...

ఆటో నడిపిన సినీనటుడు అఖిల్‌

సినీనటుడు అఖిల్‌ మంగళవారం ఖమ్మం నగరంలో ఆటో నడిపి సందడి చేశాడు. స్థానిక నరసింహస్వామి దేవాలయ సమీపంలో కిడ్నీ వ్యాధితో.....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net