Thu, February 11, 2016

Type in English and Give Space to Convert to Telugu

'హైదరాబాద్‌కు యాపిల్‌''కారెక్కిన ఎర్రబెల్లి''మేయర్‌ బొంతు రామ్మోహన్‌!''హనుమంతప్ప పరిస్థితి మరింత విషమం''భాగ్యనగరం తరహాలో ఖేడ్‌ అభివృద్ధి''మహా జాతరకు శ్రీకారం''ఓటుకు నోటు కేసులో మరో తెదేపా ఎమ్మెల్యే అరెస్టు?''ప్రయాణికులపై మళ్లీ వడ్డింపు?''గవర్నర్లు రాష్ట్రాలకు ఉత్ప్రేరకాలు''మహానగర అభివృద్ధికి 100 రోజుల ప్రణాళిక!'
రూ.14 వేల కోట్లతో పట్టణ తాగునీటి ప్రాజెక్టులు
ప్రపంచబ్యాంకు రుణం కోసం ప్రయత్నాలు
ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేసిన ఏపీ పురపాలకశాఖ
ఈనాడు, హైదరాబాద్‌
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు ఏపీ సర్కారు రూ.14 వేల కోట్లతో ప్రాజెక్టు ప్రణాళిక రూపొందించింది. రానున్న నాలుగేళ్లలో 4.82 కోట్ల మందికి పైపులైన్ల ద్వారా ఇంటింటికీ 24 గంటలపాటు రక్షిత తాగునీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టు నిధుల కోసం ప్రపంచబ్యాంకు, డీఐఎఫ్‌డీ, జైకా, ఏడీబీ, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకోవాలని ఇప్పటికే నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రపంచబ్యాంకు సహాయం కోరుతూ పురపాలకశాఖ ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేసింది. ఈ నివేదికను పురపాలకశాఖ ఆమోదించి, పరిశీలన కోసం ఆర్థిక శాఖకు పంపింది. అక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వం అనుమతితో ప్రపంచ బ్యాంకుకు అందజేయనుంది.

82 మున్సిపాలిటీల్లో...: రాష్ట్ర విభజన తరువాత ఏర్పడిన ఆర్థిక లోటును అధిగమించేందుకు ఏపీ ప్రభుత్వం రుణాలు తీసుకోవాలని నిర్ణయించింది. మరోవైపు సంక్షేమ పథకాలు, రాజధాని నిర్మాణం, అభివృద్ధి తదితర సవాళ్లున్నాయి. నగరాలు, పట్టణాల్లో మౌలిక సదుపాయాల కొరత అధికంగా ఉంది. రాయలసీమలో రక్షిత తాగునీటికి ప్రజలు ఇక్కట్లు పడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 111 మున్సిపాలిటీల్లో 82 మున్సిపాలిటీల్లో తాగునీటి కొరత, సరఫరాలో లోపాలున్నట్లు గుర్తించారు. మున్సిపాలిటీలతోపాటు చిత్తూరు జిల్లాల్లో కొన్ని గ్రామాలను ఎంపిక చేశారు. ఈ పట్టణాలు, గ్రామాల్లో రక్షిత తాగునీటి సౌకర్యం కల్పించేందుకు రూ.14,106 కోట్లు అవసరమని పురపాలకశాఖ లెక్కగట్టింది. జిల్లాలోని అందుబాటులోని తాగునీటి వనరులు, భూగర్భ జలాలు, మున్సిపాలిటీల్లో పరిస్థితి అధ్యయనం చేసిన అధికారులు ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేశారు. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలు, అమలు చేసిన సంస్కరణలు వివరించారు. ప్రాజెక్టు అమలు చేసే విధానం, నిర్వహణ తీరును పేర్కొన్నారు.

కేంద్రానికీ..: రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పునర్విభజన బిల్లులో ఇచ్చిన హామీలు, ఆర్థికలోటు నేపథ్యంలో సాధ్యమైనన్ని నిధులు కేంద్రం నుంచి రాబట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఈ మొత్తం ప్రాజెక్టులో కేంద్రం అంగీకరించే వాటాను తీసివేయగా, మిగతా వాటాలో రాష్ట్ర ప్రభుత్వం, పురపాలకశాఖలు కొంత మొత్తాన్ని భరించాల్సి ఉంటుంది. ప్రాథమిక అంచనా మేరకు ప్రాజెక్టు వ్యయంలో సర్కారు 20 శాతం, మున్సిపాలిటీలు 10 శాతం భరించాలి. ప్రస్తుతం రూ.855 కోట్ల ప్రపంచబ్యాంకు రుణంతో ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్‌ అభివృద్ధి ప్రాజెక్టు అమలవుతోంది. నూతన ప్రాజెక్టుకు ఆమోదం లభిస్తే ఏపీలో ఇంటింటికీ తాగునీటి సరఫరా సాధ్యమని పురపాలక శాఖ భావిస్తోంది.

ఇవీ ప్రభుత్వ లక్ష్యాలు..
* ఇంటింటికీ 24 గంటల రక్షిత తాగునీటి సరఫరా
* తాగునీటి వృథాను 20 శాతానికి తగ్గించడం
* ప్రతి వ్యక్తికి కచ్చితంగా 135 లీటర్ల తాగునీటిని అందించడం
* వచ్చే ఏడాదికి రక్షిత తాగునీటికి దూరంగా ఉన్న కుటుంబాల సంఖ్యను సగానికి తగ్గించడం
* తాగునీటి ప్రాజెక్టుల్లో మెరుగైన నిర్వహణ ద్వారా సుస్థిర ప్రాజెక్టులుగా తీర్చిదిద్దడం.

నీళ్ల సీసాలపై మీ పేర్లు!

‘మంచి వ్యాపారవేత్త కావాలంటే ఎంబీఏలే చదవాల్సిన అవసరంలేదు. సామాజిక చొరవ ఉంటే చాలు! చక్కటి ఆలోచనతో ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేకుండా ఈ ఏడాదిన్నరలో రెండు...

వెండితెరపై కోట్ల ‘కాంతి’

సినిమా అనేది కచ్చితంగా వ్యాపారమే. ఏ కథానాయకుడికి ఎంత మార్కెట్‌ ఉంది? అనే లెక్కలు ఎప్పుడూ అవసరమే. పెట్టిన ప్రతీపైసాకీ గ్యారెంటీ ఉందన్న నమ్మకం కుదిరిన...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net