Sun, February 14, 2016

Type in English and Give Space to Convert to Telugu

'భారత్‌లో తయారీకి బ్రహ్మరథం''ఐపీఎస్‌లను పెంచండి''పాకిస్థాన్‌కు అధునాతన ఎఫ్‌-16 యుద్ధవిమానాలు''ఖేడ్‌లో 81.72 శాతం పోలింగ్‌''దిండి మొదటి దశ పనులకు త్వరలో టెండర్లు''మెదక్‌ నిమ్జ్‌లో చైనా పెట్టుబడులు..''చెలకల్లో.. అవినీతి మొలకలు!''మార్చి 10 నుంచి శాసనసభ సమావేశాలు''మళ్లీ తెరపైకి ఓటుకు నోటు కేసు''కళతో సామాజిక సందేశం'
పోస్టులు తక్కువ... ఉద్యోగులు ఎక్కువ
అందరికీ కేటాయింపులు ఉంటాయన్న పునర్‌వ్యవస్థీకరణ శాఖ
సిబ్బంది ముందస్తు విభజనపై నేడు ఢిల్లీలో భేటీ
ఈనాడు, హైదరాబాద్‌: ఉభయ రాష్ట్రాలకు పోస్టుల కేటాయింపులో ఇప్పుడు కొత్త సమస్యలు ఉత్పన్నమయ్యాయి. కొన్ని శాఖల్లో పోస్టులు తక్కువగాను, ఉద్యోగుల సంఖ్య ఎక్కువగాను ఉన్నాయి. ప్రస్తుతం పునర్‌వ్యవస్థీకరణ శాఖ ఆయా శాఖల్లోని పోస్టులను మాత్రమే ఉభయ రాష్ట్రాలకు పంచుతోంది. దీంతో అధికంగా ఉన్న తమను రెండు రాష్ట్రాలకు ఎలా కేటాయిస్తారనే ఆందోళన ఉద్యోగుల్లో నెలకొంది. విభజించిన పోస్టులు తక్కువగానే ఉన్నా, ఉద్యోగులందరికీ కేటాయింపులు ఉంటాయని పునర్‌ వ్యవస్థీకరణశాఖ పేర్కొంది.

వివిధ శాఖలకు మంజూరైన పోస్టులను ఏపీ పునర్‌వ్యవస్థీకరణ శాఖ ఉభయ రాష్ట్రాలకు పంచుతోంది. గురువారం పరిశ్రమలు, రవాణాతో పాటు మరో ఆరు విభాగాధిపతులను విభజించింది. వీటితో కలిపితే, ప్రాథమిక పంపకం పూర్తయిన విభాగాధిపతుల సంఖ్య 13కు చేరింది. మరోవైపు పంపిణీ చేస్తున్న పోస్టులు తక్కువగా కనిపిస్తున్నాయంటూ అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. ఉదాహరణకు రెండు రాష్ట్రాలకు పంచిన డిప్యూటీ కలెక్టర్ల పోస్టులు 175 ఉండగా... ఆ హోదాతో 450 మంది పనిచేస్తున్నారు. ఉద్యోగుల విభజనకు అవసరమయ్యే సీనియార్టీ జాబితాల తయారీపైనా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. వివిధ రకాల తగాదాల కారణంగా సీనియార్టీలు ప్రస్తుతం సరిగ్గాలేవని ఉద్యోగులు అంటున్నారు. దీంతో అత్యవసరంగా సీనియార్టీ జాబితాలను అందజేయాలని శాఖాధిపతులకు వచ్చిన ఆదేశాలు సిబ్బందిలో గుబులు రేపుతున్నాయి. పోస్టుల తుదివిడత కేటాయింపులు, ఉద్యోగుల ప్రాథమిక విభజనను ఏకకాలంలో చేపట్టాలని కమలనాథన్‌ చేసే ప్రతిపాదనను కేంద్రం ఆమోదించాల్సి ఉంది. దీనిపై చర్చించేందుకు కమలనాథన్‌ కమిటీ శుక్రవారం ఢిల్లీలో భేటీ కానుంది.

ఉద్యోగులు ఉన్నారంటే పోస్టులు ఉన్నట్టే.. ప్రేమచంద్రారెడ్డి: ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఉద్యోగులు ఉన్నారంటే పోస్టులు కూడా ఉన్నట్టేనని పునర్‌వ్యవస్థీకరణ శాఖ కార్యదర్శి, కమలనాథన్‌ కమిటీ సభ్య కార్యదర్శి ఎల్‌.ప్రేమచంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఉద్యోగుల సందేహాలను ‘ఈనాడు’ ఆయన వద్ద ప్రస్తావించినప్పుడు.. డిప్యూటీ కలెక్టర్లు నీటిపారుదల శాఖలోనూ ఉన్నందున, కొన్ని పోస్టులు రెవెన్యూలో కాకుండా నీటిపారుదల శాఖలో పంపిణీ అవుతాయన్నారు. మిగతా శాఖల్లోనూ ఈ పరిస్థితి ఉందన్నారు. సీనియార్టీ జాబితాల విషయంలో ఆందోళన అవసరం లేదన్నారు.

వలచి...గెలిచి..

ప్రేమికుల రోజూ.. అదే సూర్యుడు. అవే ఇరుసంధ్యలు. అదే గాలి. అవే దిక్కులు. ఎప్పట్లాగే ఇరవై నాలుగ్గంటలు!! మరేమిటీ ప్రత్యేకం? ఏముంది? ప్రేమే!!...

ఫైనల్‌లో వారియర్స్‌

రెండోసారి సీసీఎల్‌ ట్రోఫీ గెలవాలన్న తెలుగు వారియర్స్‌ నెరవేరడానికి ఇంకా ఒక్క అడుగు దూరంలో ఉంది. శనివారం హైదరాబాద్‌లో ఉత్కంఠభరితంగా జరిగిన రెండో సెమీఫైనల్‌లో...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net