Sat, February 06, 2016

Type in English and Give Space to Convert to Telugu

'గులాబీ.. సునామీ''మాట నిలబెట్టుకుంటాం''నౌకా సంరంభం నేడే''కక్షతోనే పార్లమెంటులో రగడ!''వ్యూహాత్మక విజయం''ఆఖర్లో వచ్చారు.. అదరగొట్టారు!''సమర సేనాని''పర్యాటకులకు మణిహారం''ముద్రగడ ఆమరణ దీక్ష''హైదరాబాద్‌లో మరో రెండు పెద్దాసుపత్రులు'
పదవీ విరమణ చేసినా అదే కేడర్‌లో..
సీనియర్‌ ఇంజినీర్ల కొనసాగింపు
నీటిపారుదల శాఖలో తంతు
ఈనాడు, హైదరాబాద్‌: నీటిపారుదల శాఖలో పదవీ విరమణ చేసిన సీనియర్‌ ఇంజినీర్లను తిరిగి అదే స్థానాల్లో కొనసాగిస్తుండటంపై ఆర్థిక శాఖ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. వాస్తవానికి అనుభవం ఉన్న వారి సేవలను వినియోగించుకోవడానికి సలహాదారులుగానో లేదా ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ(ఓఎస్డీ)గా నియమించుకోవచ్చు. అయితే ఇక్కడ ఏకంగా క్యాడర్‌ పోస్టుల్లోనే కొనసాగించడం, కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం కల్పించారు. ఈ పద్ధతి సరైంది కాదని ఆర్థికశాఖ అంటోంది. పదవీ విరమణ చేసిన వారిని క్యాడర్‌ పోస్టుల్లో నియమించడం వల్ల పదోన్నతుల్లో కొందరికి అన్యాయం జరుగుతుందని చాలా కాలంగా నీటిపారుదల శాఖలోని ఇంజినీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నా సంబంధిత అధికారులు సిఫార్సు చేస్తూనే ఉన్నారు. అధికారులు కాదంటే మంత్రి సిఫార్సు చేయడం, మంత్రి కాదంటే నేరుగా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయడం ఇలా ఏదోరకంగా పదవీ విరమణ చేసిన ఇంజినీర్లు మళ్లీ అదే పోస్టుల్లో కొనసాగుతున్నారు. ఇటీవల తెలంగాణ క్వాలిటీ కంట్రోల్‌ విభాగం చీఫ్‌ ఇంజినీర్‌గా పదవీ విరమణ చేసిన శ్రీరామరెడ్డిని తిరిగి అదే పోస్టులో నియమించడానికి ప్రతిపాదనలు వెళ్లాయి. దీనిని పరిశీలించిన ఆర్థిక శాఖ అభ్యంతరం వ్యక్తం చేయడంతోపాటు సాధారణ పరిపాలనా శాఖ (జీఏడీ) పరిశీలనలకు కూడా పంపింది. చివరకు ఈయనను అదే పోస్టులో కొనసాగించడం మంచిది కాదని, అవసరమైతే కాంట్రాక్టు పద్ధతిలో నియమించుకోవాలని అనుమతించింది. దీంతో ఏడాది పాటు ఆయనను కాంట్రాక్టు పద్ధతిలో నియమిస్తూ రెండు రోజుల క్రితం నీటిపారుదల శాఖ కార్యదర్శి ఆదేశాలు చేశారు. అంటే అధికారికంగా తెలంగాణ క్వాలిటీ కంట్రోల్‌ పోస్టు ఖాళీగా ఉన్నట్లే. అయితే నీటిపారుదల శాఖ ఈ పోస్టును భర్తీ చేయకపోవడంతో అనధికారికంగా శ్రీరామరెడ్డే సీఈగా కొనసాగే అవకాశం ఉంది. నీటిపారుదల శాఖలో 33 మంది చీఫ్‌ ఇంజినీర్లు ఉండగా, ఇందులో ఏడుగురు పదవీ విరమణ చేసిన వారే ఉన్నారు. ప్రస్తుతం పదవీ విరమణ చేసిన తర్వాత క్యాడర్‌ పోస్టుల్లో కొనసాగుతున్నవారిలో ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌(నీటిపారుదల) మురళీధర్‌, మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రాజెక్టుల చీఫ్‌ ఇంజినీర్‌ ప్రకాశ్‌, కృష్ణా డెల్టా సీఈ సాంబయ్య, గోదావరి డెల్టా సీఈ గోపాలకృష్ణారెడ్డి, చిన్ననీటి వనరుల విభాగం వేణుగోపాలాచార్య, ఎ.ఐ.బి.పి. విభాగం సీఈ రామకృష్ణ తదితరులున్నారు. ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌ సర్వీసు పొడిగింపునకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపినా, ఆర్థిక శాఖ ఇప్పటివరకు అంగీకరించలేదు. గుత్తేదారులకు సంబంధించిన అంశాలు, గడువు పొడిగింపులకు సంబంధించిన సిఫార్సులతో పాటు కీలకమైన నిర్ణయాలు తీసుకొనే రాష్ట్ర స్థాయి స్టాండింగ్‌ కమిటీకి ఈయన ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. అన్ని ప్రాజెక్టులకు సంబంధించి ఈయనకు అనుభవం ఉన్నందున సర్వీసు పొడిగించాలని నీటిపారుదల శాఖ అధికారులు ప్రతిపాదించారు. ఆర్థికశాఖ మాత్రం దీంతో ఏకీభవించలేదని తెలిసింది. పులిచింతల ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసే పేరుతో కృష్ణాడెల్టా చీఫ్‌ ఇంజినీర్‌ సాంబయ్య సర్వీసును పొడిగించారు. పొడిగించిన సమయంలో కూడా పూర్తికాకపోవడంతో మళ్లీ పొడిగించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రాజెక్టుల చీఫ్‌ ఇంజినీర్‌ది కూడా ఇదే పరిస్థితి. ఇటీవల ప్రాణహిత-చేవేళ్ల చీఫ్‌ ఇంజినీర్‌గా పదవీ విరమణ చేసిన సత్యానంద్‌ పదవీ కాలాన్ని కూడా పొడిగింపుపై నిర్ణయం తీసుకున్నారు. సీఎం అంగీకరించినా మంత్రి నుంచి ఆమోదం లభించడంలో జాప్యంతో మరొకరిని నియమించారు. దీంతో సత్యానంద్‌ను తెలంగాణ ప్రాజెక్టుల సలహాదారుగా నియమించారు. పదవీ విరమణ చేసిన తర్వాత వారిని మళ్లీ క్యాడర్‌ పోస్టులో నియమించే పద్ధతికి ఆరేళ్ల క్రితం ప్రభుత్వం ప్రారంభించింది.

జీన్స్‌ ప్రభ!

కొన్నిరోజులు వాడగానే జీన్స్‌ బిగుతైపోతాయి. అలాగని వాటిని పారేయలేం. ఎందుకంటే చూడ్డానికేమో కొత్తగా ఉంటాయి. అలాంటి జీన్స్‌నే రీసైకిల్‌ చేసి కొత్త ఉత్పత్తులుగా మార్కెట్‌లోకి...

మనసంతా పొరుగు కథలపైనే!

మహేష్‌బాబు లాంటి ఒకరిద్దరు కథానాయకులు తప్ప దాదాపుగా మిగిలిన తెలుగు హీరోలందరూ రీమేక్‌ చిత్రాలపై మోజు ప్రదర్శించేవాళ్లే. పొరుగు భాషలో ఒక మంచి సినిమా...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net