Tue, February 09, 2016

Type in English and Give Space to Convert to Telugu

'ఔషధనగరిలో ప్రపంచశ్రేణి విశ్వవిద్యాలయం''భూసేకరణ, పునరావాసాలకేరూ. 8,000 కోట్లు''నెట్‌ సమానత్వానికే ట్రాయ్‌ మొగ్గు!''ముద్రగడ దీక్ష విరమణ''తెలంగాణ ప్రణాళిక భేష్‌''విద్వేషాలు రెచ్చగొడుతూ రాజకీయాలా?''డాక్టర్‌.. ధనాధన్‌..''రసాయన పరిశ్రమలో పేలుడు''నడి వీధిలో పైశాచికం''పాక్‌ నుంచే కుట్ర'
విస్తృత చర్చ
సమస్యలపై సభ్యులందరికీ అవకాశం
రెండు పూటలా శాసనసభ సమావేశాలు
శనివారం కూడా కార్యకలాపాలు
కొత్త చట్టాల రూపకల్పన
సమీక్షలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయాలు
ఈనాడు - హైదరాబాద్‌
మస్యలపై విస్తృతస్థాయి చర్చల కోసం, సభ్యులందరికీ అవకాశం ఇచ్చేందుకు వీలుగా ప్రతీ రోజూ ఉదయం, సాయంత్రం రెండు పూటలా శాసనసభను నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. శనివారం కూడా సమావేశాలు జరపనుంది. సమావేశాల నిర్వహణపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంగళవారం రాత్రి నిర్వహించిన సమీక్షలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి హరీష్‌రావు, విద్యాశాఖ మంత్రి జగదీష్‌రెడ్డి, శాసనసభ కార్యదర్శి రాజాసదారాం, సీఎం కార్యాలయ ముఖ్య కార్యదర్శి ఎస్‌.నర్సింగ్‌రావు తదితరులు ఇందులో పాల్గొన్నారు. దాదాపు నెల రోజుల పాటు సమావేశాలు నిర్వహిస్తామని, తొలిరోజే(నవంబరు 5) ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్‌ శాసనసభలో, ఉపముఖ్యమంత్రి రాజయ్య శాసనమండలిలో బడ్జెట్‌ను ప్రవేశపెడతారని ముఖ్యమంత్రి చెప్పారు. బడ్జెట్‌పై అధ్యయనం కోసం నవంబరు ఆరో తేదీన ఉభయ సభలకు సెలవు ఉంటుంది. 7, 8, 10 తేదీలలో బడ్జెట్‌పై చర్చ, దానికి సమాధానం ఉంటుంది. ఆ తర్వాత వివిధ శాఖల పద్దులపై చర్చ జరుపుతారు. 40 పద్దులను ఎనిమిది భాగాలుగా విభజించి, ఒక్కో దానిపై ఒక్కో రోజు చర్చ జరపాలని సీఎం సూచించారు. బడ్జెట్‌పై చర్చ తర్వాత ఒక రోజు జీవో అవర్‌, మరో రోజు ఎమ్మెల్యేలు తమ నియోజక వర్గ సమస్యలను ప్రస్తావించడానికి సమయం కేటాయిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. శాసనసభలో, మండలిలో సభ్యుల సంఖ్యకు అనుగుణంగా ఆయా పార్టీలకు సమయాన్ని కేటాయిస్తామన్నారు.

కొత్త చట్టాలు: తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడినందున గతంలోని చట్టాలను మార్చి వాటి స్థానంలో కొత్త చట్టాలను తేవడంపై సమావేశాల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. కొత్త చట్టాలకు సంబంధించి రోజూ సాయంత్రం చర్చ జరుగుతుందని సీఎం వెల్లడించారు. చట్టాల మార్పిడిపై ప్రతిపాదనలను రూపొందించాలని ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, శాసనసభా కార్యదర్ళి రాజా సదారాంలను ఈ సందర్భంగా ఆదేశించారు. బుధవారం నుంచే కసరత్తు ప్రారంభించాలన్నారు. సభ్యులకు వీలైనంత ఎక్కువ సమయం కేటాయించాలని సీఎం అభిప్రాయపడ్డారు. సమావేశాల తీరుపై శాసనసభా కార్యకలాపాల నిర్వహణ సలహా కమిటీ(బీఏసీ)లో తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

మంత్రులకు సీఎం శాఖల బాధ్యతలు: శాసనసభ సమావేశాల దృష్ట్యా తాను నిర్వహించే శాఖల బాధ్యతలను మంత్రులకు కేటాయిస్తూ సీఎం ఈ సందర్భంగా నిర్ణయం తీసుకున్నారు. మంత్రులు తాము నిర్వహించే శాఖలతో పాటు వీటిపైనా జరిగే చర్చలో ప్రభుత్వం తరఫున సమాధానాలు ఇస్తారు.
శాంతిభద్రతలు- నాయిని నర్సింహారెడ్డి
ఎస్సీ, ఎస్టీ, బీసీ, దేవాదాయ శాఖలు- ఈటెల రాజేందర్‌
మైనారిటీ సంక్షేమం- మహమూద్‌ అలీ
క్రీడలు, యువజన, పర్యాటక, సాంస్కృతిక శాఖలు- టి.రాజయ్య
పురపాలన, నగరాభివృద్ధి- పోచారం శ్రీనివాస్‌రెడ్డి
విద్యుత్‌, సాధారణ పరిపాలన- హరీష్‌రావు
వాణిజ్య పన్నులు- మహేందర్‌రెడ్డి
పరిశ్రమలు, చేనేత, జౌళి- కేటీ రామారావు
పర్యావరణం, శాస్త్ర సాంకేతిక శాఖలు- జోగు రామన్న
మహిళాశిశు సంక్షేమం, న్యాయశాఖ- జగదీష్‌రెడ్డి
ఆర్‌అండ్‌ బి - పద్మారావు
సమావేశాల నోటిఫికేషన్‌ జారీ: వచ్చే నెల 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ రాష్ట్ర శాసనసభ, మండలి బడ్జెట్‌ సమావేశాలకు సంబంధించి మంగళవారం రాత్రి నోటిఫికేషన్‌ జారీ అయింది. రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ ఆమోదంతో ఈ నోటిఫికేషన్‌ను శాసనసభా వ్యవహారాల శాఖ విడుదల చేసింది.

పదుగురి కోసం ఆరుగురం!

కాలేజీ స్నేహితులకో వాట్స్‌యాప్‌ గ్రూప్‌ చిన్నప్పటి మిత్రులకో ఫేస్‌బుక్‌ గ్రూప్‌ బంధువులందరినీ కలిపేందుకు గూగుల్‌ ప్లస్‌.. ఇలా నేటి సామాజిక మాధ్యమాలని మస్తుగా వాడుకుంటోంది...

పచ్చబొట్టేసి...జోలీకి నచ్చేసి!

ఏంజెలీనా జోలీకి రెండంటే మహా ఇష్టం. ఒకటి పిల్లలు, రెండు టాటూలు. ముగ్గురు కన్నబిడ్డలతో పాటు మరో ముగ్గురు అనాథలను దత్తత తీసుకుని పెంచుకుంటోంది జోలీ...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net