Wed, February 10, 2016

Type in English and Give Space to Convert to Telugu

'ఈ హనుమంతుడు మృత్యుంజయుడు!''విద్యా విలీనం''ఆ నాటి హామీలను నెరవేర్చండి''తెరాస గూటికి కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే''కాల్పుల్లో అనూహ్య మలుపు''ఉగ్ర మూలం ఐఎస్‌ఐ''వెనక్కు పంపాం.. బహిష్కరణ కాదు''సుశీల్‌ కొయిరాలా కన్నుమూత''వెళ్లిరా నేస్తమా...''రాజ్యాంగం పవిత్రతను కాపాడాలి'
అమ్మకమా.. క్రమబద్ధీకరణా?
స్థలాలను విక్రయిస్తామని బడ్జెట్‌లో పేర్కొన్న తెలంగాణ సర్కారు
క్రమబద్ధీకరణ ద్వారానే అని ద్రవ్య విధాన పత్రంలో వెల్లడి
రూ.6,500 కోట్ల ఆదాయం లక్ష్యం
ఈనాడు, హైదరాబాద్‌: భూముల అమ్మకం ద్వారా రూ.6,500 కోట్లను సమీకరిస్తామని తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్‌లో పేర్కొంది. కానీ, తాజా ద్రవ్య విధానపత్రం మాత్రం.. ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ ద్వారానే ఆ మొత్తాన్నంతా సంపాదించనున్నట్టు వెల్లడించింది! వసూళ్లలోని లొసుగులను అరికట్టడం, యాజమాన్య విధానాలను మెరుగుపర్చుకోవటం వంటి విధానాల ద్వారా పన్నుల రాబడిని పెంచుకోనున్నట్టు తెలిపింది. రాష్ట్రం కొత్తగా ఏర్పాటైనందున అనేక అవసరాలు ఉంటాయని, అప్పులను ఎక్కువగా తెచ్చుకోక తప్పదని తేల్చింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పన్నేతర రాబడుల ద్వారా రూ.13,242 కోట్లను రాబట్టాలని లక్ష్యంగా పెట్టుకొంది. దీనిలో గనులు, ఖనిజాల ద్వారా రూ.1,878 కోట్లు, వడ్డీల రూపంలో రూ.2,509 కోట్లు, గ్రామీణాభివృద్ధి సెస్‌ ద్వారా రూ.344 కోట్లు, ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ ద్వారా రూ.6,500 కోట్లు సంపాదించనున్నట్టు ప్రభుత్వం శుక్రవారం ఉభయ సభలకు అందజేసిన ద్రవ్య విధానపత్రం వెల్లడించింది. పన్నేతర రాబడులను బాగా పెంచుకోదలచినట్టూ... రుణాలను, రుణ ఖర్చులను క్రమేణా తగ్గించుకుంటూ రుణ యాజమాన్య విధానాలను అనుసరిస్తామని పేర్కొంది. మెదటి ఏడాది ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటుంన్నందున పరిమితిని మించి రూ.4 వేల కోట్లను రుణంగా తెచ్చుకొనేందుకు అనుమతి ఇవ్వాలంటూ కేంద్రాన్ని కోరినట్టు తెలిపింది. జీఎస్‌డీపీ విలువలో 3 శాతం మేర మాత్రమే అప్పులు తెచ్చుకోవాలనే ద్రవ్యబాధ్యత బడ్జెట్‌ నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బీఎం) చట్టం నిబంధనను అమలుచేయటం ఈ ఏడాది సాధ్యంకాదని తేల్చింది. ఇక నిధుల వినియోగంలోనూ మార్పులు తేదలచినట్టు వివరించింది. పేదలకు ఆహారం, వసతి, ఉపాధి కల్పించే రాయితీలను ఆర్థిక భారంగా భావించటం లేదనీ.. బియ్యం, విద్యుత్తు, వ్యవసాయ పెట్టుబడులు, గృహనిర్మాణం వంటి వాటికి రాయితీలను సమకూర్చుతున్నామని వివరించింది. వివిధ సంస్థలకు ప్రభుత్వం ఇచ్చే పూచీకత్తుల మొత్తం విలువ రెవెన్యూ వసూళ్లలో 90 శాతం మేర మాత్రమే ఉండాలనే నిబంధన పరిధిలోనే ఉన్నట్టు తెలిపింది.
ఆరేళ్ల ప్రకృతి వైపరీత్యాలతో రైతుకు కష్టాలు..
తెలంగాణలో వరుసగా ఆరేళ్లపాటు కరవు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు చోటుచేసుకోవడం వల్లే అన్నదాతలు కష్టాల్లో ఉన్నారని, ఈ కారణంగానే రూ.17 వేల కోట్ల రుణమాఫీకి నడుం కట్టామని ద్రవ్య విధానపత్రంలో సర్కారు పేర్కొంది. ఇందులో ఈ ఏడాది రూ.4,250 కోట్లు ఇచ్చామని, సామాజిక భద్రత పింఛన్ల పథకం ‘ఆసరా’ ద్వారా నెలవారీ పింఛను మొత్తాన్ని పెంచామని తెలిపింది. మునుపటి రాబడులు ఏ స్థాయిలో ఉన్నదీ తెలియనందున 2015-16, 2016-17కు రాబడి లక్ష్యాలను వెల్లడించటం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం... రానున్న రెండేళ్ల లక్ష్యాలను సభ్యులకు ప్రభుత్వం వెల్లడించాల్సి ఉంటుంది.

పడిపోయిన పారిశ్రామిక వృద్ధి రేటు..: తెలంగాణలో 2004-05 నుంచి 2013-14 వరకు రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ) స్థిర ధరల్లో సగటు వృద్ధి రేటు 9.83 శాతం మేర ఉంది. 2013-14లో ఇది 5.58 శాతం మాత్రమే నమోదయింది. 2009-10 నుంచి పారిశ్రామిక రంగంలో వృద్ధి తగ్గిపోతోందని వెల్లడించింది. 2013-14లో సేవా రంగంలో 7.15 శాతం, వ్యవసాయ రంగంలో 4.58 శాతం, పారిశ్రామిక రంగంలో 2.70 శాతం వృద్ధి రేట్లు నమోదయ్యాయి. ఇదే సంవత్సరం నమోదుకాని తయారీ పరిశ్రమల్లో 2.29 శాతం, గనులు, క్వారీల్లో 2.58 శాతం మేర తిరోగమనం నమోదయింది. రాష్ట్ర అభివృద్ధిని అంచనావేసేందుకు తోడ్పడే తలసరి ఆదాయం 2013-14లో ప్రస్తుత ధరల్లో రూ.93,151 , స్ధిర ధరల్లో (2004-15 నాటివి) రూ.47,785 మేర ఉన్నట్టు పత్రం వెల్లడించింది.

మమ్మల్నీ ఉద్యోగులే అనుకున్నారు!

బయోటెక్నాలజీ రంగాన్ని చాలా ఇష్టంగా ఎంచుకున్నారా ఇద్దరు..!కానీ ఆ చదువుకు తగ్గ ఉద్యోగాల్లేవు.. ఈ పరిస్థితుల్లో ఎవరయినా ఉన్నచోటే వేరే ఉద్యోగాలు చూసుకోవడమో...

ఏప్రిల్‌ 1న లడ్‌కీ.. లడ్‌కా.. షురూ..

అర్జున్‌ కపూర్‌, కరీనా కపూర్‌ జంటగా తెరకెక్కుతున్న ‘కీ అండ్‌ కా’ చిత్రాన్ని ఏప్రిల్‌ 1న విడుదల చేయనున్నట్లు .............

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net