Mon, February 08, 2016

Type in English and Give Space to Convert to Telugu

'పట్టణాభిషేకం''వాస్తవాల ప్రతిబింబంగా బడ్జెట్‌''నీటిపై నిప్పుల వాన''సీఎం మొండి అయితే.. నేను జగమొండి''తీరప్రాంత దేశాల మధ్య సహకారం పెరగాలి''ఉత్తర కొరియా రాకెట్‌ ప్రయోగం''చిరుతకు చిక్కి .. ప్రాణాలతో బయటపడి''మౌఖికంలో మార్కులు ఖాయం''ఎయిమ్స్‌కు 220 ఎకరాలు కేటాయింపు''‘అంకుర’ భయాలొద్దు'
ఉండేదెవరో.. వెళ్లేదెవరో?
ఈనాడు, హైదరాబాద్‌: గోడ దూకిన నేతలు.. దూకడానికి సిద్ధంగా ఉన్నవారు.. గోడమీద పిల్లివాటం ప్రదర్శిస్తున్న వారు.. ఎన్నికల వరకూ పార్టీలోనే ఉండి, చివరి నిమిషంలో నిర్ణయం తీసుకుందామనుకొనే వారు.. ఇదీ ప్రస్తుతం కాంగ్రెస్‌ పరిస్థితి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి పార్టీలో ఎవరు ఉంటారు? అభ్యర్థులుగా ఎవరిని ఎంపిక చేయాలనేదానిపై కాంగ్రెస్‌ నాయకత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపికపై సర్వే చేసేందుకు ఏఐసీసీ పరిశీలకుల బృందం వారం రోజుల్లో రాష్ట్రానికి రానుంది. మరోవైపు పీసీసీ ఇప్పటికే ఒక్కో నియోజకవర్గానికి ముగ్గురు అభ్యర్థుల పేర్లతో జాబితాను సిద్ధం చేసింది. ఇప్పటికే లోక్‌సభ నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపిక పూర్తయినట్లు పీసీసీ ముఖ్యనేత ఒకరు తెలిపారు. ఎన్నికల ప్రణాళిక తయారీపైనా కసరత్తు జరుగుతోందని, త్వరలో కొలిక్కి రానుందని ఆయనే విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ చెప్పారు.

గోడ దూకేస్తున్నారు: కాంగ్రెస్‌ పార్టీని వీడనున్న ఎమ్మెల్యేలపై పీసీసీ దృష్టి సారించింది. ఈ మేరకు జిల్లాల వారీగా ఎంతమంది బయటకు వెళ్లనున్నారనే జాబితాను సిద్ధం చేసింది. అత్యధికంగా విశాఖ, కర్నూలు నుంచి నలుగురు చొప్పున ఎమ్మెల్యేలు పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. అలాగే అనంతపురం మూడు; శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, నెల్లూరు జిల్లాల నుంచి ఇద్దరు చొప్పున; విజయనగరం, గుంటూరు, నెల్లూరు, కడప, ప్రకాశం, చిత్తూరు జిల్లాల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు పీసీసీ గుర్తించింది. ఈ సంఖ్య మరికొంత పెరిగే అవకాశమూ ఉందని కీలకనేత ఒకరు తెలిపారు.

తెలంగాణ జిల్లాల్లోనూ బొత్స పర్యటన: ఈపరిస్థితి నుంచి బయటపడేందుకు, వచ్చే ఎన్నికలకు పార్టీని సమాయత్తపరిచేందుకు పీసీసీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా జనవరి మొదటివారం నుంచి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. ఆయా జిల్లాల పార్టీ నేతలతో నేరుగా సమావేశమై గోడమీద పిల్లివాటం ప్రదర్శిస్తున్న నేతలెవరనేది తేల్చడంతోపాటు, పార్టీలో మిగిలేవారెవరనే లెక్కా తేల్చుకోనున్నారు. తెలంగాణ జిల్లాల్లోనూ ఆయన పర్యటిస్తారు. మొదటివారంలోనే ఈ షెడ్యూల్‌ ప్రకటిస్తామన్నారు.

శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడిపై వేటు: జిల్లా కాంగ్రెస్‌ కమిటీల ప్రక్షాళనకూ పీసీసీ సన్నద్ధమైంది. ఇందులో భాగంగా మొదట శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు నరేంద్ర యాదవ్‌పై వేటు వేయనున్నారు. ధర్మాన ముఖ్య అనుచరుడైన నరేంద్ర.. వైకాపాలోకి వెళ్లేందుకు సిద్ధమైన నేపథ్యంలో ఆయనపై వేటు పడనుంది. వారం పది రోజుల్లో మరికొందరు జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులను మార్చనున్నట్లు బొత్స వెల్లడించారు. అనంతపురం, కడప జిల్లాల అధ్యక్షులు మధుసూదన్‌గుప్తా, అశోక్‌కుమార్‌లు చేసిన రాజీనామాలను ఆమోదించనున్నట్లు చెప్పారు. పదవిలో కొనసాగాలా వద్దా అనే సంశయంలో ఉన్న ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల అధ్యక్షులూ మారే అవకాశం ఉంది. తెలంగాణలో కరీంనగర్‌, ఆదిలాబాద్‌, ఖమ్మం జిల్లాల అధ్యక్షులు మారనున్నారు.

మాధవన్‌ పళ్లురాలగొట్టాను..!

సినిమా కోసం ఉత్తుత్తినే కాదు.. నిజంగానే అంతపని చేసిందట రితిక. గత వారం విడుదలై సంచలన విజయం సాధించిన ‘సాలా ఖడూస్‌’ చిత్రం కథానాయిక. అప్పుడెప్పుడో పరుగుల రాణీ...

ఉప్పల్‌లో పరుగుల పండగ

మ్యాచ్‌ అంటే ఇదీ.. ఆడేది సినిమావాళ్లే అయినా, అంతర్జాతీయ మ్యాచ్‌కి ఏమాత్రం తీసిపోదు. టీ ట్వంటీలో ఉండే అసలైన మజా... మరోసారి తెలిసొచ్చింది....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net