Sun, February 14, 2016

Type in English and Give Space to Convert to Telugu

'భారత్‌లో తయారీకి బ్రహ్మరథం''ఐపీఎస్‌లను పెంచండి''పాకిస్థాన్‌కు అధునాతన ఎఫ్‌-16 యుద్ధవిమానాలు''ఖేడ్‌లో 81.72 శాతం పోలింగ్‌''దిండి మొదటి దశ పనులకు త్వరలో టెండర్లు''మెదక్‌ నిమ్జ్‌లో చైనా పెట్టుబడులు..''చెలకల్లో.. అవినీతి మొలకలు!''మార్చి 10 నుంచి శాసనసభ సమావేశాలు''మళ్లీ తెరపైకి ఓటుకు నోటు కేసు''కళతో సామాజిక సందేశం'
తుస్సుమన్న తంత్రం
ఆదాల, చైతన్యరాజుకు సీఎం ఫోన్లు
మంత్రులు గంటా, ఏరాసు, ఎమ్మెల్యేలు,
ఉద్యోగ సంఘాల నేతలతో రెబళ్ల భేటీ
ఒక్కరే బరిలో అవకాశం... చైతన్యరాజుకే మొగ్గు?
నేను విభజనవాదినా అంటూ ప్రశ్నించిన కేవీపీ!
అందరూ తనవాళ్లేనన్న సుబ్బరామిరెడ్డి
ఈనాడు - హైదరాబాద్‌
రాజ్యసభ ఎన్నికల్లో పోటీ లేకుండా చేసుకోవాలన్న కాంగ్రెస్‌ వ్యూహం ఫలించలేదు. అందుకోసం చేసిన ప్రయత్నం వృథా అయ్యింది. ఎమ్మెల్యేల నుంచి తీసుకున్న ప్రతిపాదన ఉపసంహరణ లేఖల మంత్రం పని పనిచేయలేదు. ఒత్తిళ్లకు దిగినా తిరుగుబాటు అభ్యర్థులు చలించక పోవడంతో కాంగ్రెస్‌ నేతలు నీళ్లు నమలాల్సిన పరిస్థితి ఏర్పడింది. సమైక్య నినాదంతో తిరుగుబాటు అభ్యర్థులుగా రాజ్యసభ ఎన్నికల పోటీలో దిగిన చైతన్యరాజు, ఆదాల ప్రభాకరరెడ్డిలకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలే సంతకాలు చేశారు. వారిని గుర్తించి అందులో సుమారు 15 మంది నుంచి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మంత్రి ఆనం రామనారాయణరెడ్డిలు మంగళవారమే ప్రతిపాదన ఉపసంహరణ లేఖలు తీసుకున్నారు. వాటిని బుధవారం ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి బొత్స స్వయంగా అందజేశారు. ఒకవేళ ఈ ఎమ్మెల్యేలను రిటర్నింగ్‌ అధికారి వద్దకు పంపించాల్సి వస్తుందేమోననే ఉద్దేశంతో అసెంబ్లీలోని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఛాంబరులో కూర్చొబెట్టారు. ముత్యాల పాప, సతీష్‌, అన్నా రాంబాబు, వెంకటేశ్వరరెడ్డి తదితరులు వారిలో ఉన్నారు. విజయ్‌కుమార్‌ కూడా అక్కడే అందుబాటులో ఉన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి కేవీపీ రామచంద్రరావు వారితో చాలాసేపు కూర్చున్నారు. ప్రభాకరరెడ్డి, చైతన్యరాజులకు ప్రతిపాదకుడిగా నిలిచిన ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డిని మంత్రి ఆనం ఛాంబరు మీదుగా వెళ్తుండగా బొత్స ఆపే యత్నం చేశారు. మంత్రి ఛాంబర్‌ లోపలకు వెళ్లాలని సూచించారు. మళ్లీ వస్తానంటూ ఆయన వెళ్లిపోయారు. అంతా ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి నిర్ణయం కోసం నిరీక్షించారు. ఒక దశలో రిటర్నింగ్‌ అధికారి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ నెలకొంది. ఒకసారి సంతకాలు చేసిన తరువాత ప్రతిపాదకులు ఇచ్చే ప్రతిపాదన ఉపసంహరణ లేఖలు పరిగణనలోకి రావని రిటర్నింగ్‌ అధికారి మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో తెలిపారు. దీంతో కాంగ్రెస్‌ నేతలు హతాశులయ్యారు. అప్పటి వరకూ మంత్రి ఛాంబరులో కూర్చున్న ఎమ్మెల్యేలు నిరాశగా వెనుతిరిగారు. ‘‘ప్రతిపాదన ఉపసంహరణ లేఖల ద్వారా పరిశీలన దశలోనే నామినేషన్లు తిరస్కరణకు గురయ్యేలా చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఖాళీ పత్రాల మీద ఎమ్మెల్యేల సంతకాలు తీసుకుని నామినేషన్‌ దాఖలుకు ఉపయోగించుకోవడం నైతికంగా సరైంది కాదు. అందుకే అభ్యర్థులు వారే పోటీ నుంచి స్వయంగా వైదొలగాలి. సంతకాలు పెట్టిన ఎమ్మెల్యేలు మా పార్టీ పరిధిలోనే ఉన్నారనే విషయమూ వెల్లడైంది’’ అని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఈ పరిణామంపై వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేల్ని తిరిగి తమ పార్టీ విధాన పరిధిలోకి తీసుకురావటం ద్వారా తమ ప్రయత్నం సఫలమైందని చెప్పారు. తిరుగుబాటు అభ్యర్థులకు మద్దతు కొనసాగిస్తే... ప్రలోభాలకు గురైనట్లు అప్రపద వస్తుందని చెప్పటం ద్వారా పలువురి ఎమ్మెల్యేలకు నచ్చజెప్పినట్లు సమాచారం. మరోపక్క పోటీ నుంచి వైదొలగాలని కోరుతూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తిరుగుబాటు అభ్యర్థులుగా పోటీలోకి దిగిన వారిని కోరారు. మంగళవారం రాత్రే ఆయన ఫోను చేసినట్లు చైతన్యరాజు చెప్పారు. మంత్రి గంటా శ్రీనివాసరావు ఛాంబర్‌లో కలిసిన చైతన్యరాజును బరి నుంచి వైదొలగాలని మంత్రి దానం నాగేందర్‌ కోరారు. ‘‘కాంగ్రెస్‌ పార్టీ మీ వంటి వారిని ఎందరినో చూసింది. డబ్బుతో రాజకీయం చేయలేరని’’ అన్నారు. ఆయన వ్యాఖ్యలపై చైతన్యరాజు అభ్యంతరం ప్రకటించారు. మంత్రి గంటా ఛాంబర్‌లో ఎమ్మెల్యేలను కలిసిన కేవీపీ రామచంద్రరావు ఒకదశలో ఒకింత ఆవేదనతో ‘‘నేను విభజనవాదినా, నన్నెందుకు వ్యతిరేకిస్తున్నారు?’’ అని ప్రశ్నించినట్లు తెలిసింది. కాంగ్రెస్‌ అభ్యర్థి టి.సుబ్బరామిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ, తాను అందరి వాడినని, తనకంతా మద్దతిస్తారని చెప్పారు. తిరుగుబాటు అభ్యర్థుల్లో చివరికి ఒకరే బరిలో నిలవనున్నారు. ఎమ్మెల్సీ చైతన్యరాజు వైపే ఎమ్మెల్యేలు మొగ్గు చూపిస్తున్నట్లు సమాచారం. దీనిపై చర్చించేందుకే మంత్రులు గంటా శ్రీనివాసరావు, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, తిరుగుబాటు అభ్యర్థులు, పలువురు ఉద్యోగ సంఘాల నేతలు ఓ హోటల్‌లో బుధవారం రాత్రి సమావేశమయ్యారు. తిరుగుబాటు అభ్యర్థిగా ఒక్కరినే ఎంచుకోవటంతో పాటు గెలిపించు కోటానికి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. సమావేశం రాత్రి 11.30 గంటల వరకు కొనసాగింది.

ఏఐసీసీ కార్యదర్శులతో బొత్స, మంత్రుల భేటీ
ఏఐసీసీ కార్యదర్శులు తిరునవక్కరసు, కుంతియాను బుధవారం పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మంత్రులు డొక్కా మాణిక్యవరప్రసాద్‌, కొండ్రు మురళీమోహన్‌, పి.బాలరాజు, రాజ్యసభ సభ్యుడు, అభ్యర్థి టి.సుబ్బరామిరెడ్డి తదితరులు వేర్వేరుగా కలిశారు. రాజ్యసభ ఎన్నికలపైనే వారు చర్చించినట్లు సమాచారం. కుంతియా తిరిగి వెళ్లిపోగా తిరునవక్కరసు గురువారం వరకు ఇక్కడే ఉంటారు.

ఆదాల, శిల్పా మోహన్‌రెడ్డి మధ్య వాగ్వాదం
తిరుగుబాటు అభ్యర్థి ఆదాల ప్రభాకరరెడ్డి, ఆయనకు మద్దతు ప్రకటిస్తూ నామినేషన్‌ పత్రాలపై సంతకం పెట్టిన శిల్పా మోహన్‌రెడ్డి మధ్య బుధవారం వాగ్వాదం చోటు చేసుకుంది. తన మద్దతును ఉపసంహరించుకునేందుకు మోహన్‌రెడ్డి లేఖ తయారు చేసిన సమయంలో... అలా అయితే మీరు సమైక్య ఆంధ్రకు వ్యతిరేకమన్నమాట అని ఆదాల వ్యాఖ్యానించారు. ‘‘మీ ఫైళ్లు క్లియర్‌ చేయించుకోవాలనే ఉద్దేశంతో, సీఎం చెబితే ఉపసంహరించుకోవాలని అనుకుంటున్నారు’’ అని ఆదాల అన్నట్టు తెలిసింది.

ఎంఎస్పీ బాగా పలుకుతుంది
రాజ్యసభ ఎన్నికల్లో తిరుగుబాటు అభ్యర్థులు పోటీలో ఉండడంతో ఎమ్మెల్యేలకు డిమాండ్‌ ఉంటుంది. ‘కనీస మద్దతు ధర’ (ఎంఎస్పీ) బాగా పలుకుతుందని ఎమ్మెల్యే జేసీ దివాకరరెడ్డి బుధవారం విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ చెప్పారు.

వలచి...గెలిచి..

ప్రేమికుల రోజూ.. అదే సూర్యుడు. అవే ఇరుసంధ్యలు. అదే గాలి. అవే దిక్కులు. ఎప్పట్లాగే ఇరవై నాలుగ్గంటలు!! మరేమిటీ ప్రత్యేకం? ఏముంది? ప్రేమే!!...

‘శ్రీరస్తు శుభమస్తు’ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌

అల్లు శిరీష్‌, లావణ్య త్రిపాఠి జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘శ్రీరస్తు శుభమస్తు’. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను చిత్ర....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net