Mon, February 08, 2016

Type in English and Give Space to Convert to Telugu

'పట్టణాభిషేకం''వాస్తవాల ప్రతిబింబంగా బడ్జెట్‌''నీటిపై నిప్పుల వాన''సీఎం మొండి అయితే.. నేను జగమొండి''తీరప్రాంత దేశాల మధ్య సహకారం పెరగాలి''ఉత్తర కొరియా రాకెట్‌ ప్రయోగం''చిరుతకు చిక్కి .. ప్రాణాలతో బయటపడి''మౌఖికంలో మార్కులు ఖాయం''ఎయిమ్స్‌కు 220 ఎకరాలు కేటాయింపు''‘అంకుర’ భయాలొద్దు'

తెదేపా-భాజపా పొత్తులపై ప్రతిష్టంభన
45 కావాలి: భాజపా.. 31కి మించలేం: తెదేపా
ఒంటరిగా వెళ్తామని ప్రకటించిన కిషన్‌రెడ్డి
రెండు రాష్ట్రాల పార్టీ అధ్యక్షులకు రాజ్‌నాథ్‌ ఫోన్‌
నేడు తెదేపా పొలిట్‌ బ్యూరోలో కీలక నిర్ణయం
ఈనాడు, హైదరాబాద్‌: తెలుగుదేశం, భాజపా నాయకులు పొత్తుల విషయంలో ఎవరికి వారే అన్నట్లుగా ఉన్నారు. ఇరు పార్టీల నేతల మధ్య పొత్తు చర్చలు కొనసాగినా...ఎవరి పట్టులో వారే ఉండడంతో ప్రతిష్టంభన ఏర్పడింది. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఒకడుగు ముందుకేసి తాము ఒంటరిగా వెళ్తామని, అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేందుకు అధిష్టానం పచ్చజెండా వూపిందని ప్రకటించేశారు. భాజపా జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ కూడా తెలంగాణ, సీమాంధ్ర పార్టీల అధ్యక్షులు కిషన్‌రెడ్డి, కంభంపాటి హరిబాబులకు ఫోన్‌ చేసి పొత్తుల చర్చల సారాంశాన్ని తెలుసుకున్నట్లు సమాచారం. అవసరమైతే ఒంటరిగా వెళ్లేందుకైనా సిద్దపడాలని ఆయన పేర్కొన్నట్లు తెలిసింది. శనివారం మధ్యాహ్నం తెలంగాణ తెలుగుదేశం ఎన్నికల కమిటీ అధ్యక్షుడు ఎల్‌.రమణ, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రధాన కార్యదర్శి మోత్కుపల్లి నర్సింహులు.. భాజపా పొత్తుల బాధ్యుడు ప్రకాష్‌ జవదేకర్‌, తెలంగాణ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు కిషన్‌రెడ్డిలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఇరుపక్షాల మధ్య సీట్ల సంఖ్యపై ఏకాభిప్రాయం కుదరలేదు. భాజపా 45 శాసనసభ, 9 లోక్‌సభ స్థానాలు అడగ్గా...తెదేపా నేతలు 31 శాసనసభ, 7 పార్లమెంటు స్థానాలు ఇస్తామని ప్రతిపాదించారు. దీంతో కిషన్‌రెడ్డి ఆ సంఖ్య తమకు ఆమోదం కాదని అక్కడే స్పష్టం చేసేశారని సమాచారం. ఆ తర్వాత జాతీయ నాయకులతో మాట్లాడిన కిషన్‌రెడ్డి...తమకు ఒంటరిగా వెళ్లేందుకు, అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేందుకు జాతీయ నేతలు అనుమతిచ్చారని ప్రకటించారు. మరోవైపు సీమాంధ్రలో మూడు ఎంపీ స్థానాలు, 8 శాసనసభ స్థానాలు ఇస్తామని తెలుగుదేశం నేతలు ప్రతిపాదించగా...భాజపా సీమాంధ్ర నేతలు దానికి అంగీకరించలేదు. దీంతో అక్కడా ప్రతిష్టంభన ఏర్పడింది. తెలంగాణలో కానీ, సీమాంధ్రలో కానీ తాము అడిగినన్ని స్థానాలు ఇస్తేనే...పొత్తుకు అవకాశాలుంటాయని భాజపా నేతలు స్పష్టం చేశారు. తెదేపా తెలంగాణ ప్రాంత నేతలు విషయాన్ని చంద్రబాబుకు వివరించినట్లు సమాచారం. తెలంగాణలో కొంతవరకు అదనపు స్థానాలు ఇవ్వొచ్చని, సీమాంధ్రలో అంతకుమించి ఇస్తే అది వైకాపాకు ప్రయోజనకరంగా పరిణమిస్తుందని తెదేపా అభిప్రాయపడినట్లు సమాచారం.
నేడు తెదేపా పొలిట్‌ బ్యూరో... పొత్తులు, మేనిఫెస్టోపై చర్చ: మరోవైపు తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం ఆదివారం జరగనుంది. ఈ సమావేశంలో పొత్తుల అంశంపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలున్నాయి. భాజపాకు ఇవ్వదగిన సీట్ల సంఖ్యపైనా తుది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. పార్టీ మేనిఫెస్టో పైనా ఈ సమావేశంలో చర్చ జరగనుంది. మేనిఫెస్టోకు తుది మెరుగులు దిద్ది, ఉగాదిన విడుదల చేయాలని నిర్ణయించారు.

చంద్రబాబుకు నరేష్‌ గుజ్రాల్‌ ఫోన్‌: మరోవైపు మాజీ ప్రధాని ఐ.కె.గుజ్రాల్‌ తనయుడు, శిరోమణి అకాలీదళ్‌ ఎంపీ నరేష్‌ గుజ్రాల్‌ శనివారం చంద్రబాబుకు ఫోన్‌ చేశారని సమాచారం. భాజపా అడిగిన స్థానాలను ఇచ్చే విషయంపై సానుకూలంగా ఉండాలని, పొత్తు కుదుర్చుకోవాలని ఈ అకాలీ ఎంపీ కోరినట్లు సమాచారం. కాంగ్రెస్‌ పార్టీని ఓడించాలని తాము కోరుకుంటున్నామని, అయితే ఆ పార్టీని ఓడించే దిశగా బలాబలాలను బట్టి సీట్ల పంపిణీ ఉండాలని చంద్రబాబు అన్నట్లు సమాచారం. ఆదివారం పొలిట్‌ బ్యూరో సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని బాబు అన్నట్లు తెలిసింది.

ఒంటరిపోరే: కిషన్‌రెడ్డి: తెదేపాతో ఇక చర్చల ప్రసక్తే లేదని, అధిష్ఠానం అనుమతితో 119 అసెంబ్లీ, 17 లోక్‌సభ స్థానాల్లో పోటీకి సిద్ధమైనట్లు, అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు భాజపా తెలంగాణ శాఖ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ప్రకటించారు. శనివారం రాత్రి 9 గంటలకు భాజపా కార్యాలయంలో తెలంగాణ ఎన్నికల కమిటీ కిషన్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైంది. ఆ పార్టీ శాసనసభాపక్ష నేత యెండల లక్ష్మీనారాయణ, కేంద్ర మాజీ మంత్రి విద్యాసాగరరావు, సీనియర్‌ నేతలు రామారావు, ఇంద్రసేనారెడ్డి, సత్యనారాయణ, రామకృష్ణారెడ్డి, మీసాల చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. తెదేపాతో చర్చల సారాంశాన్ని కిషన్‌రెడ్డి ఈ సందర్భంగా నేతలకు వివరించారు. తెదేపాతో పొత్తు కోసం పాకులాడటం వల్ల పార్టీ నవ్వుల పాలవుతోందని, సొంతంగా ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలను గెలిచే వీలున్నందున మళ్లీ చర్చలే వద్దని ఈ సందర్భంగా నేతలు అభిప్రాయపడినట్లు తెలిసింది. సీమాంధ్రలో పొత్తు బాధ్యతలు ఆ పార్టీ రాష్ట్ర శాఖకు అప్పగించినందున, తెలంగాణను మినహాయించాలని కేంద్ర నాయకత్వాన్ని కోరాలని పలువురు నేతలు సూచించారు. చంద్రబాబు విభజన గురించి పదేపదే మాట్లాడటం వల్ల తెలంగాణలో వ్యతిరేకత రోజురోజుకూ పెరిగే ప్రమాదం ఉందనీ, ఇది తమ పార్టీకి నష్టం కలిగిస్తుందని నేతలు పేర్కొన్నట్లు తెలిసింది. రాష్ట్ర విభజనపై జేపీ వ్యాఖ్యలపైనా తెలంగాణలో వ్యతిరేకత వస్తున్నందున లోక్‌సత్తాతో పోటీ పట్ల కొందరు నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు తెలిసింది. తెలంగాణలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో భాజపా బలాన్ని చాటేందుకు ఒంటరి పోటీకి సన్నాహాలు చేపట్టాలని కోరారు. సమావేశం అనంతరం కిషన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. తెదేపాతో కలిసి పోటీ చేయడం వల్ల ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలున్నా అధిష్ఠానం ఆదేశాల మేరకు తాము చర్చలకు సిద్ధమయ్యామని తెలిపారు. తెదేపా నుంచి ఆశించిన స్పందన రానందుకే ఒంటరి పోటీకి సిద్ధమవుతున్నామని చెప్పారు. పొత్తుల ఆలోచన వద్దని కమిటీ అభిప్రాయపడిందని, అధిష్ఠానానికి ఈ సమాచారం అందజేశామని, వారి ఆదేశాల మేరకే అభ్యర్థులను ఎంపిక చేస్తున్నామని చెప్పారు. అధిష్ఠానం నుంచి పొత్తులకు సంబంధించిన ఆదేశాలేమైనా వస్తే అప్పుడు ఆలోచిస్తామన్నారు. చిన్న పార్టీలేమైనా పొత్తు కోసం ముందుకొస్తే వాటితో చర్చించేందుకు నిర్ణయించామని చెప్పారు. తెలంగాణ ఏర్పాటు సాధనలో భాజపా చేసిన కృషిని ప్రతి ఒక్కరూ గుర్తించారని, రాష్ట్ర పునర్నిర్మాణానికి తమ పార్టీ పునరంకితమవుతుందని తెలిపారు.

అభ్యర్థుల ఎంపికపై కసరత్తు: పొత్తుపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో తెలంగాణ భాజపా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలుపెట్టింది. ఎన్నికల కమిటీ శనివారం రాత్రి సమావేశం అయ్యింది. 8 గంటలకు ప్రారంభం అయిన భేటీ పొద్దు పోయే వరకు జరిగింది. శాసనసభ, లోక్‌సభ నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల వివరాలను పరిశీలించారు. రెండేసి పేర్లను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. తెదేపాతో చర్చల అనంతరం పార్టీ కార్యాలయానికి వచ్చిన కిషన్‌రెడ్డి దక్షిణాది రాష్ట్రాల సంస్థాగత వ్యవహారాల ఇన్‌ఛార్జి సతీశ్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీంద్రరాజు, సంయుక్త ప్రధాన కార్యదర్శి మంత్రి శ్రీనివాస్‌లకు చర్చల సారాంశాన్ని వివరించారు.

మాధవన్‌ పళ్లురాలగొట్టాను..!

సినిమా కోసం ఉత్తుత్తినే కాదు.. నిజంగానే అంతపని చేసిందట రితిక. గత వారం విడుదలై సంచలన విజయం సాధించిన ‘సాలా ఖడూస్‌’ చిత్రం కథానాయిక. అప్పుడెప్పుడో పరుగుల రాణీ...

ఉప్పల్‌లో పరుగుల పండగ

మ్యాచ్‌ అంటే ఇదీ.. ఆడేది సినిమావాళ్లే అయినా, అంతర్జాతీయ మ్యాచ్‌కి ఏమాత్రం తీసిపోదు. టీ ట్వంటీలో ఉండే అసలైన మజా... మరోసారి తెలిసొచ్చింది....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net