Sun, February 14, 2016

Type in English and Give Space to Convert to Telugu

'ప్యాకేజీ ఇవ్వండి''విలీనమా.. అనర్హతా?''అదనపు పనులన్నీ పాత గుత్తేదారులకే''భారతమాతను కించపరిస్తే సహించం''‘తెలంగాణ బ్రాండ్‌’ పేరుతో అమ్మకాలు''శాశ్వత ఉత్సవంగా మేడారం జాతర''కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయం''విలీన లేఖపై ఏమి చేయాలి?''వీరసేనానికి కన్నీటి వీడ్కోలు''అమ్మతనానికి అండ'
పైసా కూడా మురగనివ్వొద్దు
13వ ఆర్థిక సంఘం నిధులన్నీ రాబట్టాల్సిందే
ఇంకా రావాల్సిన గ్రాంటు రూ.3,094 కోట్లు
డిసెంబర్‌ 31కల్లా పనులు పూర్తిచేయాలి
అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశం
ఈనాడు - హైదరాబాద్‌
దమూడో ఆర్థికసంఘం గడువు వచ్చే మార్చి 31 నాటికి ముగియనున్నందున ఆలోపే దానికి సంబంధించిన నిధులన్నీ రాబట్టుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సంఘం కేటాయించిన మొత్తం గ్రాంట్లలో రాష్ట్రానికి ఇంకా రూ.3,094 కోట్లు రావాల్సి ఉన్నందున అందులో ఒక్కపైసా కూడా మురిగిపోనీకుండా జాగ్రత్తపడాలని సూచించారు. బుధవారం సచివాలయంలోని తన కార్యాలయంలో ఆయన 13వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై సమీక్షించారు. ఈ భేటీలో ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడుతోపాటు, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఐవైఆర్‌కృష్ణారావు, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శులు అజేయకల్లం, పీవీరమేష్‌, ఆర్థికశాఖ సలహాదారు సీఎస్‌రావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చందనాఖన్‌, ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శి అజయ్‌సహాని, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు. ఇప్పటివరకూ విడుదలైన గ్రాంట్లలో కనీసం 75 శాతం మొత్తానికి వినియోగ ధ్రువీకరణపత్రాలు (యుటిలైజేషన్‌ సర్టిఫికెట్లు) ఇస్తేనే మిగతా మొత్తం విడుదల చేస్తారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన నమూనా ప్రకారం ఈ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. తొలి విడత గ్రాంట్లు పొందిన శాఖలు ఇప్పటివరకూ జరిగిన పనుల వివరాలు, ఆర్థిక క్రమశిక్షణను చెబుతూ నివేదిక సమర్పిస్తేనే మిగతా మొత్తం అందుతుంది. అందువల్ల ఉన్నతస్థాయి కమిటీ ఆమోదించిన అన్ని పనులూ వచ్చే డిసెంబర్‌ 31 నాటికి పూర్తయ్యేలా చూడాలి. ఇందులో ఏవైనా మార్పులుంటే నవంబర్‌ 5వ తేదీలోపు ఉన్నతస్థాయి కమిటీ ఆమోదం పొందాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచనలు జారీచేశారు. 13వ ఆర్థికసంఘం ఉమ్మడి రాష్ట్రానికి మొత్తం 13,584.88 కోట్ల గ్రాంట్లు ఇస్తే రాష్ట్రం విడిపోయే రోజుకి అందులో 6,244.18 కోట్లు వచ్చినట్లు అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. విభజిత ఆంధ్రప్రదేశ్‌కు 4,017.28 కోట్లు రావాల్సి ఉండగా ఇప్పటివరకూ కేవలం 923.12 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇంకా రూ.3094.16 కోట్లు రావాల్సి ఉందని పేర్కొన్నారు. అందుకు ముఖ్యమంత్రి స్పందిస్తూ అందులో ఒక్కపైసా కూడా వృథాకావడానికి వీల్లేదని అధికారులకు స్పష్టంచేశారు.

మా వూరికి మంచి నీళ్లు...

బాగా ఆస్తిపాస్తులున్న వాళ్లని శ్రీమంతులంటారు.మహేశ్‌బాబు నటించిన ‘శ్రీమంతుడు’ చూశాక ఆ అర్థం మారిపోయిందనే చెప్పవచ్చు. ఎక్కడ పెరిగినా, స్థిరపడినా సొంతూరి...

ఎన్టీఆర్‌ ‘దండయాత్ర’కు ఏడాది..!

‘ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం.. అదే ఒక్కడు మీదడిపోతే.. దండయాత్ర.. ఇది దయా గాడి దండయాత్ర’. పవర్‌ఫుల్‌ డైలాగులతో ఎన్టీఆర్‌ తెలుగు సినీ సెల్యులాయిడ్‌పై చేసిన దండయాత్రకు ఫిబ్రవరి 13తో ఏడాది పూర్తైంది. ‘వన్‌ ....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net