Sun, February 07, 2016

Type in English and Give Space to Convert to Telugu

'కడలి వేదికగా కదన విన్యాసం''కల్తీల నుంచి కాపాడాలి''ఎస్సై కొలువులకు సై''వాట్సన్‌ @ రూ. 9.5 కోట్లు''హామీలు నెరవేర్చే వరకు దీక్ష''అన్నయ్యే వారసుడు..''ప్రజల మనసులు చూరగొంటూ..''సాగర జలాల్లో స్నేహబంధం''కాగిత రహిత టికెట్ల దిశగా రైల్వే''అనుమతి లేకుండా ప్రాజెక్టులు'
స్థిరాస్తి రంగానికి ఎఫ్‌డీఐ వూపు
నిధుల కొరతను తీర్చేందుకు నిబంధనల సరళీకరణ
కనీస నిర్మాణ స్థల విస్తీర్ణం, పెట్టుబడి మొత్తం తగ్గింపు
కేంద్ర కేబినెట్‌ నిర్ణయాలు
న్యూఢిల్లీ: నిర్మాణ రంగానికి బడ్జెట్‌ ప్రసంగంలో ఇచ్చిన హామీని కేంద్ర ప్రభుత్వం నిలబెట్టుకుంది. నిధుల కొరతతో సతమతమవుతున్న నిర్మాణ, స్థిరాస్తి రంగానికి వూతమిచ్చేందుకు చర్యలు తీసుకుంది. నివాస సముదాయాలతో పాటు నిర్మాణ రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐలు) మరింతగా ఆకర్షించేందుకు నిబంధనలను సరళతరం చేసింది. కనీస నిర్మాణ విస్తీర్ణంతోపాటు కనీస పెట్టుబడి మొత్తాన్ని తగ్గించింది. ప్రాజెక్టు నుంచి వైదొలిగే నిబంధనలనూ సడలించింది. నిర్మాణ రంగంలో ఎఫ్‌డీఐ విధానాన్ని సవరించటానికి ఉద్దేశించిన ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్‌ బుధవారం ఆమోదం తెలిపింది. 2-3 ఏళ్లుగా నిధుల కొరతను ఎదుర్కొంటున్న స్థిరాస్తి, నిర్మాణ రంగాల్లోకి ఎఫ్‌డీఐలను మరింతగా ఆకర్షించేందుకు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ పరిధిలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ పాలసీ అండ్‌ ప్రమోషన్‌ ఈ ప్రతిపాదనలను రూపొందించింది.
* ప్రస్తుతం 50వేల చ.మీటర్ల నిర్మాణాలకే ఎఫ్‌డీఐని అనుమతిస్తున్నారు. ఇకపై 20వేల చ.మీటర్ల నిర్మాణాలకూ విదేశీ నిధులను తెచ్చుకోవచ్చు.
* నిర్మాణానికి కనీస పెట్టుబడిగా కోటి డాలర్లు (రూ.60 కోట్లు) తెచ్చుకోవాల్సి వచ్చేది. దీన్ని 50లక్షల డాలర్లకు (రూ.30 కోట్లు) కుదించారు.
* నివాస సముదాయాల్లో 30 శాతం మేర ‘అందుబాటు ధర నిర్మాణాలు’ ఉండాలి.
ఎఫ్‌డీఐలలో 10 శాతమే ఈ రంగాలకు: టౌన్‌షిప్‌లు, నివాస సముదాయాలు, మౌలిక సదుపాయాల నిర్మాణంలోకి 2005 నుంచీ ఎఫ్‌డీఐలను 100 శాతం అనుమతిస్తున్నారు. అయితే పరిమితులు పెట్టడంతో ఆశించిన ఫలితాలు కనబడటం లేదు. 2000, ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు ఈ రంగాల్లోకి 23.75 బిలియన్‌ డాలర్లు (రూ.1,42,500 కోట్లు) పెట్టుబడిగా వచ్చాయి. దేశంలోని భిన్న రంగాలకు వచ్చిన ఎఫ్‌డీఐలలో ఈ మొత్తం 10 శాతమే. ఈ రంగంలో 2006-07 నుంచి 2009-10 మధ్య కాలంలో పెరుగుతూ వచ్చిన ఎఫ్‌డీఐలు ప్రస్తుతం క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో నిబంధనలను సరళతరం చేయటం తప్పనిసరని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ప్రాజెక్టుల నిధుల కోసం పత్యామ్నాయ మార్గాలను వెతుక్కోవటానికి ఇది తోడ్పడగలదని క్రెడాయ్‌ అధ్యక్షుడు సి.శేఖర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.
గోధుమల కనీస మద్దతు ధర పెంపు: ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ (సీసీఈఏ) గోధుమలకు కనీస మద్దతు ధరను క్వింటాలుకు రూ.50 పెంచింది. దీంతో క్వింటాలు గోధుమ కనీస మద్దతు ధర రూ.1,450కి చేరుకుంది.
* వ్యవసాయ, ఆరోగ్యరక్షణ పరిశోధన, అభివృద్ధిలో కొత్త ఆలోచనలను ప్రోత్సహించే అనుబంద ఒప్పందానికి ఆమోదం తెలపాలని నిర్ణయించింది. జీవ రక్షణపై కార్టజెనా ఒప్పందానికి సంబంధించిన నయోగా-కౌలాలంపూర్‌ అనుబంధ ఒప్పందానికి ఆమోదం తెలపటానికి ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశం అంగీకరించింది.
* మొత్తం 3 ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌ స్కూళ్ల(ఎస్‌పీఏ)ను బిల్లు పరిధిలోకి తేవటానికి ‘స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌ బిల్లు, 2014’ను పార్లమెంటులో ప్రవేశపెట్టటానికి కేబినెట్‌ ఆమోదించింది.
* భారత్‌, అల్బేనియా మధ్య దౌత్య పాస్‌పోర్ట్‌దారులు వీసా లేకుండా ప్రయాణాలను అనుమతించటానికి అంగీకరించింది.
* గురుగావ్‌లోని కేంద్రీయ విద్యాలయానికి 4.6 ఎకరాల భూమిని లీజుకు ఇవ్వటానికి ఆమోదం తెలిపింది.

వెలుగు వైపు నా అడుగులు...

బడిగంట కొట్టగానే పిల్లలందరూ బిలబిలమంటూ బయటకు పరుగుతీశారు. టీచర్లూ ఇంటిదారిపట్టారు. ఒకరిద్దరు తప్ప నిర్మానుష్యంగా మారిన ఆ బడిలో..

అనుక్షణం ఉత్కంఠగా... ‘క్షణం’

అనుక్షణం ఉత్కంఠభరితంగా సాగే కథనంతో తెరకెక్కిన చిత్రం ‘క్షణం’. పీవీపీ సినిమా బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రానికి రవికాంత్‌....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net